వార్ :హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ చిత్రం అక్టోబర్ 2న విడుదలై క్లీన్ హిట్ గా నిలిచింది. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా కూడా దుమ్మురేపుతోంది.

హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ ల స్టైలింగ్ లుక్స్ మరియు వారిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు మూవీకి హైలెట్ గా నిలిచాయి. ఇండియన్ ఏజెంట్స్ గా వారిద్దరి నటన మూవీకి ప్రధాన ఆకర్షణ.
హాలీవుడ్ స్థాయి పోరాట సన్నివేశాలు, హై వోల్టేజ్ ఛేజింగ్ అండ్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని ఇస్తాయి. ఉన్నత స్థాయిలో ఉన్న నిర్మాణ విలువలు ఈ చిత్రానికి అస్సెట్ గా నిలిచాయి. ఇక వాణి కపూర్ గ్లామర్ షార్ట్ అండ్ స్వీట్ లా అలరించింది.

బలమైన కథంటూ ఏమీ వార్ చిత్రంలో ఉండకపోవడం ఒక మైనస్ గా చెప్పవచ్చు. మూవీ మొత్తంగా కేవలం యాక్షన్ కోసమే తీశారా అనిపించేలా సాగుతుంది.
సాధారణంగా హృతిక్ చిత్రాలలో ఆకట్టుకొనే మ్యూజిక్ ఉంటుంది కానీ ఈ చిత్రంలో ఆహ్లాదంగా అనిపించే ఒక్క సాంగ్ లేకపోడం గమనార్హం. అలాగే ఒక పూర్తి స్థాయి హీరోయిన్ లేకపోవడం, హృతిక్, టైగర్ ష్రాఫ్ లాంటి మేటి డాన్సర్స్ ఉండి ఒక్క పాటలో కూడా ఆకట్టుకునే నృత్యాలు లేకపోవడం కూడా ఓ మైనస్ గా చెప్పవచ్చు.