-
సినిమాకి శుభం టైటిల్ పడింది. సినిమా పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి...
Date & Time : 12:06 PM March 09, 2018
-
చివరికి విజయ్ కథలోని ట్విస్ట్ ని కనిపెట్టాడు. ఇప్పుడు హీరో విలన్స్ తో ఫైట్ చేస్తున్నాడు. సినిమా అంతిమ ఘట్టానికి చేరువలో ఉంది
Date & Time : 12:04 PM March 09, 2018
-
చాలా ఆసక్తికరమైన అంతిమ ఘట్టానికి సముయం ఆసన్నమైంది. కథలోని అంతిమ ఘట్టం చాలా ఆసక్తికరమైనది. హీరోయిన్ తప్పిపోవడానికి ఒక మంచి కారణం ఉంది. ఆ కారణం బయట పడింది.
Date & Time : 12:02 PM March 09, 2018
-
తీవ్రమైన రీతిలో హీరో ఆమెని వెతుకుతున్నాడు. ఆమెని వెతులులాడటం హీరోకి చాల కష్ట తరంగా ఉంది. కథ వెనుక ఉన్న సమస్య ఇప్పుడే బయట పడింది.
Date & Time : 11:58 AM March 09, 2018
-
విజయ్ మాఫియాకు సంబంధించి కొన్ని ఆధారాలు కనిపెట్టాడు. అతడు వాటిని ఒక్కొక్కటిగా నాశనం చేస్తున్నాడు.
Date & Time : 11:54 AM March 09, 2018
-
హీరోయిన్ తప్పిపోయిన అంశం వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. భారీ ఎత్తున అమ్మాయిల అక్రమ రవాణా మాఫియా ప్రదర్శించబడుతోంది
Date & Time : 11:36 AM March 09, 2018
-
విజయ్ కి హీరోయిన్ పైన ఎంత ప్రేమ ఉందనే అంశం ఒక మాంటేజ్ పాటలో అందంగా చూపించబడుతుంది.
Date & Time : 11:25 AM March 09, 2018
-
ఇప్పుడిది విచారకరమైన పాటకి సరైన సమయం. హీరో, హీరోయిన్ ని పట్టుకోలేపోతున్నాననే బాధను వ్యక్తపరచే పాట మొదలైంది.
Date & Time : 11:23 AM March 09, 2018
-
ఇంటర్వల్ బ్రేక్ తర్వాత, హీరో అదే పనిగా హీరోయిన్ వెతుకులాటలో చుట్టుపక్కల ఆసుపత్రులన్నీ తిరుగుతున్నాడు.
Date & Time : 11:20 AM March 09, 2018
-
ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ తో పెద్ద సమస్యలో వెనక చిక్కుకున్న హీరోయిన్ ని వెతికిపట్టుకున్నాడు హీరో. ఇప్పుడే సినిమాకి ఇంటర్వల్ బ్రేక్ పడింది.
Date & Time : 11:03 AM March 09, 2018
-
కథలో ఒక చిన్న ట్విస్ట్ వచ్చి చేరింది. ఈ ట్విస్ట్ హీరోయిన్ చుట్టూరా తిరుగుతుండటంతో తనని పట్టుకోవడానికి ఎలాంటి క్లూ లేకుండా పోయింది. ట్విస్ట్ సినిమాను ఇంటర్వల్ కు దగ్గరకి తీస్కువెల్తుంది.
Date & Time : 10:48 AM March 09, 2018
-
హీరో సవాల్ చేసి మరీ హీరోయిన్ ఎక్కడున్నా కుడా వెతికి పట్టుకుంటా అని ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 10:44 AM March 09, 2018
-
ఇప్పుడే మొదటి పాట వస్తుంది. హీరోయిన్ మరియు ఆమె స్నేహితులు ఇంటర్నెట్ లో ఆటపాటలతో ఒక వీడియోను తయారు చేస్తూ ఉన్నారు. ఈ పాటలో సన్నివేశాలు చూడటానికి చాలా బాగున్నాయి.
Date & Time : 10:23 AM March 09, 2018
-
విజయ్ మరియు అతని స్నేహితుల మధ్య జరుగుతున్నకొన్ని హాస్యపురితమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఆనంద కేళిలో ముంచెత్తితున్నాయి.
Date & Time : 10:18 AM March 09, 2018
-
ఇప్పుడే హీరోయిన్ శివానీ సింగ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఒక గేమింగ్ డెవలపర్.
Date & Time : 10:09 AM March 09, 2018
-
హీరో విజయ్ దేవరకొండ ఒక గేమింగ్ ఎక్స్ పర్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇతని తల్లిదండ్రులు ఇతని పట్ల విసుగు చెంది ఉన్నారు.
Date & Time : 10:06 AM March 09, 2018