-
-
సినిమా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి కోసం ఇచ్చిన స్పీచ్ తో ముగిసింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 04:48 AM February 08, 2019
-
అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో కూడా వైఎస్సార్ రెండోసారి ముఖ్యమంత్రిగా 2009 ఎన్నికల్లో గెలుపొందారు.ఇప్పుడు ఆయన జీవిత చరిత్రలో కీలక ఘట్టం అయినటువంటి నిజ జీవితంలో వైఎస్సార్ మరణానికి సంబంధించిన విజువల్స్ చూపిస్తున్నారు.ఇప్పుడు మరగైనవా రాజన్న పాత వస్తుంది.
Date & Time : 04:44 AM February 08, 2019
-
కాంగ్రెస్ పార్టీ గెలుపుతో యాత్ర ముగిసింది.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.
Date & Time : 04:35 AM February 08, 2019
-
2004 ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్న సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 04:25 AM February 08, 2019
-
నిర్విరామంగా పాదయాత్ర చేసేసరికి వైఎస్సార్ స్పృహ తప్పిపోయారు,దానితో ఆయన్ని హాస్పిటల్ లో చేర్చారు.ఈ సందర్భంలో ఆయన తండ్రి రాజా రెడ్డి చెప్పిన గెలుపోటములకు మధ్య ఉన్న తారతమ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు.ఇప్పుడు సంభందిత ఎమోషనల్ సన్నివేశం వస్తుంది.
Date & Time : 04:10 AM February 08, 2019
-
రాజన్న నిన్నాపగలరా పాటలో వైఎస్సార్ ప్రజలతో మమేకం అవుతున్న సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 04:00 AM February 08, 2019
-
వైఎస్సార్ ఉచిత కరెంటును అందజేస్తున్నట్టు ప్రకటించారు.పార్టీ హై కమాండ్ దిగొచ్చి రాజశేఖర్ రెడ్డిని 2004 ఎన్నికల ప్రచారానికి హెడ్ గా నియమించారు.ఆ సంబంధిత ఎలివేట్ చేసే సన్నివేశాలు బాగున్నాయి.
Date & Time : 03:50 AM February 08, 2019
-
గ్రామాల్లో రైతుల మరణాలను వారి సమస్యలను చక్కగా ప్రతిబింబిస్తూ పల్లెల్లో కల ఉంది అనే ఒక మంచి పాట ఇప్పుడు వస్తుంది.
Date & Time : 03:38 AM February 08, 2019
-
రైతులు పడుతున్న కష్టాలు వైఎస్సార్ కు చెప్పుకుంటున్న ఒక సన్నివేశం కాస్త భావోద్వేగానికి లోను చేసే విధంగా వస్తుంది.
Date & Time : 03:28 AM February 08, 2019
-
వైఎస్సార్ పాదయాత్ర చేస్తానంటూ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇప్పుడే సభితా ఇంద్రా రెడ్డిగా నటి సుహాసిని ఎంట్రీ అయ్యారు.రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి వైఎస్సార్ తన యాత్రను ప్రారంభించారు.ఇప్పుడు సమర శంఖం పాట వస్తుంది.
Date & Time : 03:18 AM February 08, 2019
-
వైఎస్సార్ ప్రజా సమస్యలను తెలుసుకుంటుండగా వాటిని ప్రతిబింబిస్తూ మందితో పాట వస్తుంది.ఇప్పుడొక మంచి భావోద్వేగపూరిత సన్నివేశం వస్తుంది.
Date & Time : 03:14 AM February 08, 2019
-
ఇప్పుడు వైఎస్సార్ తండ్రి అయిన రాజా రెడ్డికి సంబందించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వస్తున్నాయి.వైఎస్సార్ తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు జగపతి బాబు కనిపిస్తున్నారు.
Date & Time : 03:10 AM February 08, 2019
-
వారి పార్టీకి సంబందించి విధేయత కలిగిన అభిమానులకు వైఎస్సార్ కు మధ్య కొన్ని నోటెడ్ "కార్యకర్తల తర్వాతే పార్టీ అయినా పార్టీ పెద్దలైనా" వంటి అద్భుత డైలాగ్స్ ఇప్పుడు వస్తున్నాయి.1990లలో జరిగిన రాజకీయాలకు సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 03:02 AM February 08, 2019
-
ప్రముఖ నటుడు అయిన రావు రమేష్ వైఎస్సార్ కు అత్యంత సన్నిహితుడైన కే.వి.పి రామచంద్రారావు గా ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు హై కమాండ్ కు సంబందించిన ఒక మీటింగులో వైఎస్సార్ ను ఎలివేట్ చేస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:51 AM February 08, 2019
-
ఇప్పుడు ఎన్నికల నామినేషన్ సమయంలో ఒక రాజకీయ నాయకుని కూతురు(అనసూయ)కి వైఎస్సార్(మమ్ముట్టి) హామీ ఇస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:46 AM February 08, 2019
-
బ్యాక్గ్రౌండ్ లో వైఎస్సార్ బాల్యానికి మరియు ఆయన వృత్తికి సంబందించిన ఫొటోలతో టైటిల్స్ మొదలయ్యాయి.
Date & Time : 02:42 AM February 08, 2019
-
హాయ్..126 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 02:38 AM February 08, 2019