-
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసే ఎగ్జైటింగ్ సీక్వెన్స్ తో సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:50 AM February 08, 2023
-
మంచి హై ని కలిగించే సాలిడ్ సాంగ్, సీన్స్ తో జగన్ తన పాద యాత్రకి పూనుకున్న సన్నివేశాలు ఇప్పుడు మొదలయ్యాయి.
Date & Time : 11:40 AM February 08, 2023
-
మరికొన్ని కీలక సన్నివేశాలు తర్వాత ఇప్పుడు జగన్ కి తన తల్లికి మధ్య పలు ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:30 AM February 08, 2023
-
ఇప్పుడు మొదటి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. జగన్, చంద్రబాబు మధ్య సీరియస్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:20 AM February 08, 2023
-
ఇప్పుడు జగన్ జైలు నుంచి బయటకు రావడం, ఆ వెంటనే 2014 ఎన్నికల యుద్ధానికి సిద్ధం అవుతున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:10 AM February 08, 2023
-
కొన్ని పొలిటికల్ కుట్రల కారణంగా జగన్ ఇపుడు జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది. తన జైలు జీవితానికి సంబంధించిన పలు సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:00 AM February 08, 2023
-
ఇంటర్వెల్ అనంతరం.. ఇంట్రెస్టింగ్ పొలిటికల్ సీన్ తో సినిమా స్టార్ట్ అయ్యింది. జగన్ పై ఎలివేషన్స్ కొనసాగుతున్నాయి.
Date & Time : 10:55 AM February 08, 2023
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పుడు వరకు సినిమా చాలా బాగుంది. కదిలించే ఎమోషన్స్, డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అలాగే జగన్ పాత్రలో జీవా జీవించాడు. మమ్ముట్టి మరోసారి షైన్ అయ్యారు. ఇంకా సంగీతం మరో స్ట్రెంగ్త్ గా నిలిచింది. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:45 AM February 08, 2023
-
కడప బై ఎలక్షన్ లో జగన్ భారీ విజయాన్ని సొంతం చేసుకోడంతో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:40 AM February 08, 2023
-
ఇప్పుడు జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దీనితో పరిస్థితులు మరింత రసవత్తరంగా మారాయి.
Date & Time : 10:35 AM February 08, 2023
-
హై కమాండ్ ఇచ్చిన వార్నింగ్ ని పట్టించుకోకుండా జగన్ తన యాత్రని కొనసాగించాలని డిసైడ్ అయ్యాడు. సంబంధిత కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:25 AM February 08, 2023
-
జగన్ ఓదార్పు యాత్ర తర్వాత కొన్ని ఎమోషనల్ సీన్స్ కదిలించే సాంగ్ తో వచ్చాయి. వాటి తర్వాత ఇపుడు జగన్ కి హై కమాండ్ కి మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:15 AM February 08, 2023
-
ఇప్పుడు సన్నివేశాలు నెక్స్ట్ ఎలక్షన్ సంబంధించి వస్తున్నాయి. నటుడు మహేష్ మంజ్రేకర్ చంద్రబాబుగా పరిచయం అయ్యారు.
Date & Time : 10:05 AM February 08, 2023
-
కథనం ఇప్పుడు సీరియస్ గా మారింది. ఓ షాకింగ్ ఘటన రాజశేఖర్ రెడ్డికి జరగడంతో సన్నివేశాలు ఎమోషనల్ గా మారాయి. బ్యాక్గ్రౌండ్ లో ఓ ఎమోషనల్ సాంగ్ వస్తుంది.
Date & Time : 09:55 AM February 08, 2023
-
ఇప్పుడు కథ ఢిల్లీకి షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ ఓ ప్రముఖ నేషనల్ పార్టీ అధ్యక్షురాలిగా నటి సుజానే బెర్నెర్ట్ పరిచయం అయ్యింది.
Date & Time : 09:45 AM February 08, 2023
-
ఇప్పుడు కథ రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టిని చూపిస్తూ జగన్ మోహన్ రెడ్డిగా జీవాని పరిచయం చేస్తూ మొదలైంది. ఇలా సినిమా టైటిల్ ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో స్క్రీన్ పైకి వచ్చింది.
Date & Time : 09:35 AM February 08, 2023
-
హాయ్..130 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:30 AM February 08, 2023