-
మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూకోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 11:15 AM November 11, 2022
-
ఇప్పుడు క్లైమాక్స్ ఓ ఎమోషనల్ అండ్ యాక్షన్ క్లైమాక్స్ ఇప్పుడు వస్తుంది. వరలక్ష్మి మరియు సామ్ ల మధ్య సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:10 AM November 11, 2022
-
ఇప్పుడు అన్నీ క్లియర్ అయ్యి అసలు యాక్షన్ మొదలైంది. సమంత ఆ మాఫియా ని బ్రేక్ చేసింది. ఇలా సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 11:05 AM November 11, 2022
-
చిత్రంలో క్రైమ్ సెటప్ అంతా బాగుంది. అలాగే మిస్టరీ ని రివీల్ చేసే విధానం మెప్పించే విధంగా కనిపిస్తుంది.
Date & Time : 11:00 AM November 11, 2022
-
ఇప్పుడు కథనంలో మరో షాకింగ్ ట్విస్ట్.. దీన్ని కూడా డైరెక్టర్స్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. సమంత మంచి నటన కనబరుస్తుంది.
Date & Time : 10:50 AM November 11, 2022
-
ఇప్పుడు సినిమాలో అసలు ట్విస్ట్ రివీల్ అయ్యింది. ఇది కాస్త ఆసక్తిగా ఉండగా దర్శకులు బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పటివరకు అయితే అంతా ఆసక్తిగానే నడుస్తుంది.
Date & Time : 10:40 AM November 11, 2022
-
ఈ ఫ్లాష్ బ్యాక్ మంచి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. వరలక్ష్మి తన రోల్ లో బాగా కనిపిస్తుంది. అలాగే ఉన్ని మునికందన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
Date & Time : 10:30 AM November 11, 2022
-
వరలక్ష్మి శరత్ కుమార్ పై అసలు కథ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తున్నాయి. ఇప్పుడు రావు రమేష్ ఎంటర్ అయ్యారు.
Date & Time : 10:20 AM November 11, 2022
-
ఇంటర్వెల్ అనంతరం..సినిమా మరింత సీరియస్ గా స్టార్ట్ అయ్యింది. సమంతా ట్రాప్ లో పడి మరిన్ని సమస్యలు ఎదుర్కొంటుంది.
Date & Time : 10:10 AM November 11, 2022
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు బాగుందని చెప్పొచ్చు. సరోగసి దాని వెనుక మాఫియా పై తెరకెక్కిన ఈ చిత్రం స్టార్టింగ్ కాస్త స్లో గా ఉన్నా తర్వాత ఆసక్తి పెరుగుతుంది. అలాగే సామ్ తన పాత్రలో మంచి నటన కనబరిచింది. ట్విస్టులు, కథనం బాగున్నాయి. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:05 AM November 11, 2022
-
ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్.. సమంతా ఓ షాకింగ్ నిజాన్ని ఈ సరోగసి కోసం తెలుసుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:00 AM November 11, 2022
-
చిన్న ట్విస్ట్ తో సమంత ఈ సరోగసి వెనుక ఉన్న అసలు ఉద్దేశం తెలుసుకుంది. దాని నుంచి ఆమె తప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలా సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 09:55 AM November 11, 2022
-
ఆ సరోగసి సెంటర్ వెనుక ఉన్న మిస్టరీ చాలా ఆసక్తిగా మారుతూ వస్తుంది. సామ్ ఇప్పుడు తన సొంత ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు సినిమా మరింత ఆసక్తిగా మారుతుంది.
Date & Time : 09:45 AM November 11, 2022
-
ఓ స్లో స్టార్ట్ తర్వాత అయితే సినిమా కాస్త ఆసక్తిగా మారుతుంది. సమంత తన సరోగసి విషయంలో సస్పీషియస్ గా మారుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.
Date & Time : 09:35 AM November 11, 2022
-
ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా ఏకకాలంలో కనిపిస్తున్నాయి. పోలీస్ ఆఫీసర్ గా నటుడు సంపత్ ఇప్పుడు పరిచయం అయ్యారు. ఆ హత్యకి అలాగే ఈ సరోగసి సెంటర్ కి ఏదో లింక్ ఉన్నట్టు కనిపిస్తుంది.
Date & Time : 09:25 AM November 11, 2022
-
ఇప్పుడు ఉన్ని మునికందన్ కూడా పరిచయం అయ్యారు. ఆ సెంటర్ లో తాను డాక్టర్ కాగా ఈ సంబంధిత సన్నివేశాలు మంచి ఆసక్తిగా కనిపిస్తున్నాయి.
Date & Time : 09:15 AM November 11, 2022
-
సమంతని ఓ స్పెషల్ సరోగసి సెంటర్ కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ సెంటర్ కి హెడ్ గా వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర పరిచయం అయ్యింది.
Date & Time : 09:10 AM November 11, 2022
-
ఇప్పుడు సమంత పాత్ర పరిచయం అయ్యింది. డబ్బు అవసరం కోసం సరోగేట్ తల్లిగా మారడానికి ఆమె ఒప్పుకున్న సీన్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి.
Date & Time : 09:05 AM November 11, 2022
-
సినిమా ఇప్పుడు ఓ సీరియస్ నోట్ తో టేకాఫ్ అయ్యింది. ఓ ఫారిన్ యువతి రేప్ కేసు ఇన్వెస్టిగేషన్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:00 AM November 11, 2022
-
హాయ్..134 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 08:50 AM November 11, 2022