-
సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:00 AM April 02, 2021
-
ఇప్పుడు క్లైమాక్స్ టైం.. ఎలాంటి యాక్షన్ లేకుండా థ్రిల్లింగ్ గా కనిపిస్తుంది. నాగ్ మరియు తన టీం బార్డర్ దాటుతున్న సన్నివేశాలు చూపిస్తున్నారు.
Date & Time : 10:50 AM April 02, 2021
-
నాగ్ మరియు తన టీం ఆ ఉగ్రవాదిని పట్టుకుని ఇండియాకు బయలుదేరిన సన్నివేశాలు వస్తున్నాయి.సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 10:40 AM April 02, 2021
-
మాంచి యాక్షన్ సీక్వెన్స్ ఎపిసోడ్ ఇప్పుదు వస్తుంది. నాగ్ లోని ఫుల్ మాస్ యాక్షన్ యాంగిల్ కనిపిస్తుంది. థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి.
Date & Time : 10:30 AM April 02, 2021
-
మరో ఆసక్తికర సన్నివేశం వస్తుంది. నాగ్ మళ్ళీ వైఫల్యం దిశగా వెళ్తున్నాడు.
Date & Time : 10:25 AM April 02, 2021
-
ఇప్పుడు నాగ్ మరియు తన టీం ఆ టెర్రరిస్ట్ పై మరోసారి షాట్ తీసుకున్నారు. సినిమాలో కెమెరా వర్క్ బాగా అనిపిస్తుంది.
Date & Time : 10:20 AM April 02, 2021
-
సెకండాఫ్ లో కూడా థమన్ స్కోర్ బాగుంది. అలాగే ఆసక్తిగానే నడుస్తుంది. ఇప్పుడు అనీష్ కురువిళ్ళ యాడ్ అయ్యింది.
Date & Time : 10:15 AM April 02, 2021
-
ఇప్పుడు నేపాల్ లోని ఓ సాలిడ్ యాక్షన్ సీన్ వస్తుంది, నాగ్ ఫుల్ స్వింగ్ లో కనిపిస్తున్నారు.
Date & Time : 10:10 AM April 02, 2021
-
నాగార్జున తన ఇన్వెస్టిగేషన్ ను ఒక్కడే లీడ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు ఆర్య గా సయామీ యాడ్ అయ్యింది.
Date & Time : 10:00 AM April 02, 2021
-
ఇంటర్వెల్ అనంతరం..ఓ సీరియస్ నోట్ లో సినిమా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు నాగ్ మరియు తన టీం సీక్రెట్ మిషన్ పై నేపాల్ లో ల్యాండ్ అయ్యారు.
Date & Time : 09:55 AM April 02, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు అంతా బాగానే ఉందని చెప్పాలి. మంచి థ్రిల్లింగ్ ఎపిసోడ్స్, థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నయి. అలాగే జరగబోయే ఓ పెద్ద టెర్రర్ అటాక్ పై ఇప్పటి వరకు నడిచింది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 09:45 AM April 02, 2021
-
ఇంటర్వెల్ బ్యాంగ్ కు సర్వం సిద్ధం.. మరో ట్విస్ట్ తో ఆ టెర్రరిస్ట్ లు నేపాల్ లో ఉన్నారని తెలిసింది. ఇప్పుడు విరామం.
Date & Time : 09:40 AM April 02, 2021
-
ఇప్పుడు కథనంలో ఓ ట్విస్ట్.. నాగ్ ఆపరేషన్ ఫెయిల్ అవ్వడంతో తాను సస్పెండ్ అయ్యాడు. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 09:35 AM April 02, 2021
-
ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ ను పట్టుకునే థ్రిల్లింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:30 AM April 02, 2021
-
అలీ రెజా తన రోల్ లో బాగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు వారి టీం అంతా లీడ్స్ తో ఖలీద్ అనే అతన్ని పట్టుకోడానికి ట్రై చేస్తున్నారు. థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.
Date & Time : 09:20 AM April 02, 2021
-
ఇప్పుడు నాగ్ మరియు తన టీం తమ కేసులో మెయిన్ లీడ్స్ కోసం చూస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ సీన్స్ బాగున్నాయి. ఇప్పుడు మరో టెర్రర్ సీన్ వస్తుంది.
Date & Time : 09:15 AM April 02, 2021
-
జాన్ బేకరీలో ఓ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దీన్ని ఛేదించడానికి నాగ్ మరియు తన ఎన్ ఐ ఏ టీం తమ వర్క్ స్టార్ట్ చేశారు.
Date & Time : 09:05 AM April 02, 2021
-
ఇప్పుడు విజయ్ వర్మగా కింగ్ నాగ్ ఎంట్రీ ఇచ్చారు. తన రోల్ లో మంచి డాషింగ్ గా కనిపిస్తున్నారు.
Date & Time : 09:00 AM April 02, 2021
-
కొన్నేళ్లుగా ఇండియాలో జరిగిన పలు టెర్రర్ దాడులను ఉద్దేశించిన సీన్స్ తో టైటిల్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి.
Date & Time : 08:50 AM April 02, 2021
-
హాయ్..129 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 08:45 AM April 02, 2021