-
కొన్ని ఆసక్తికర పరిస్థితుల్లో చివరకు విజయ్ తీర్చి దిద్దిన టీమ్ గెలుపొందింది.సినిమా పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 12:10 PM October 25, 2019
-
ఫైనల్ మ్యాచ్ కు ఇప్పుడు రంగం సిద్ధం అయ్యింది.క్షుణ్ణంగా ఈ ఫుట్ బాల్ మ్యాచ్ థ్రిల్ ఇస్తుంది.
Date & Time : 12:05 PM October 25, 2019
-
అంశాలు మరింత కీలకంగా మారింది.సినిమా ఇప్పుడు క్లైమాక్స్ దిశకు చేరుకుంటుంది.
Date & Time : 12:00 PM October 25, 2019
-
ఆ లేడీ ఫుట్ బాల్ ప్లేయర్స్ అందరికి ఒక్కో ఫ్లాష్ బ్యాక్ ఉంది.వాటిని అధిగమించి ఆత్మస్థైర్యం నింపుకొని ఓ కీలక మ్యాచ్ కోసం సన్నద్ధం అవుతున్నారు.
Date & Time : 11:50 AM October 25, 2019
-
కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలు మంచి అనుభూతిని ఇస్తాయి.వాటిని తీర్చిదిద్దిన తీరు ఎమోషన్స్ చాలా బాగున్నాయి.
Date & Time : 11:40 AM October 25, 2019
-
ఇప్పుడు మరో అదిరిపోయే ఫుట్ బాల్ మ్యాచ్ వస్తుంది.ఇక్కడ ఏ ఆర్ రహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్లో ఉంది.
Date & Time : 11:32 AM October 25, 2019
-
ఇప్పుడు విజయ్ ఫుట్ బాల్ టీమ్ మ్యాచ్ కు సన్నద్ధం అవుతున్న సమయంలో జాకీ ష్రాఫ్ వల్ల ఇబ్బందుల్లో పడ్డారు.సంబంధిత ట్విస్ట్ లు చూపిస్తున్నారు.
Date & Time : 11:25 AM October 25, 2019
-
సినిమాలో ఎమోషన్స్ మాత్రం చాలా బాగున్నాయి.ఆడవారిని ఉద్దేశించి కొన్ని సీన్స్ వస్తున్నాయి.ఇప్పుడు కథనం కాస్త వేగవంతం కూడా అయ్యింది.
Date & Time : 11:20 AM October 25, 2019
-
ప్రధానంగా కథలోని లోతు కథనం ద్వారా ఇప్పుడిప్పుడే చక్కగా బయటకు వస్తుంది.
Date & Time : 11:10 AM October 25, 2019
-
సెకండాఫ్ లో కథనం బాగుంది.వివేక్ కామెడీ కూడా బాగుంది.
Date & Time : 11:05 AM October 25, 2019
-
ఇప్పుడు కోచింగ్ సెషన్ సీన్స్ వస్తున్నాయి.ఇక్కడే వినోదంతో పాటు బలమైన ఎమోషన్ కూడా కనిపిస్తుంది.
Date & Time : 11:00 AM October 25, 2019
-
ఇప్పుడు విజయ్ మరియు జాకీ ష్రాఫ్ లకు సంబంధించి కొన్ని మంచి సన్నివేశాలు వస్తున్నాయి.ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 10:50 AM October 25, 2019
-
ఇప్పుడు అదిరిపోయే లేడీస్ ఫుట్ బాల్ మ్యాచ్ వస్తుంది.ఈ షాట్ లో వీఎఫ్ ఎక్స్ మరియు రెహమాన్ సంగీతం బాగున్నాయి.
Date & Time : 10:45 AM October 25, 2019
-
ఇప్పుడు జాకీ ష్రాఫ్ మరియు కమెడియన్ వివేక్ పాత్రలు పరిచయం అయ్యాయి.
Date & Time : 10:40 AM October 25, 2019
-
ఇంటర్వెల్ అనంతరం ఇప్పుడు విజయ్ ఒక ఫుట్ బాల్ టోర్నమెంట్ కోసం కొంత మంది ఆడవాళ్లకు ఫుట్ బాల్ కోచ్ గా నియమించబడ్డాడు.
Date & Time : 10:30 AM October 25, 2019
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటికి పాత్రలన్నీ చాలా బాగా పరిచయం కాబడ్డాయి. కాకపోతే బలమైన కథ లేనట్టు అనిపించింది.కానీ మాస్ ఎలివేషన్ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి.విజయ్ అద్భుతంగా నటించారు.అసలు కథ ఏమిటి అన్నది ఇప్పుడు మొదలయ్యింది.మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:20 AM October 25, 2019
-
ఇప్పుడు ఒక సరికొత్త బాధ్యత మైఖేల్ మీద పడింది.అదేంటో సెకండ్ హాఫ్ లో తెలిసేలా ఉంది.ఇపుడు విరామం.
Date & Time : 10:18 AM October 25, 2019
-
ఇప్పుడు కీలకమైన రీతిలో ఇంటర్వెల్ బ్యాంగ్ మొదలయ్యింది.మైఖేల్ అసలు ఎందుకు ఫుట్ బాల్ ఆటను వదిలేసాడో దానికి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:15 AM October 25, 2019
-
ఇప్పుడొక ఊహించని పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది.ఒక సీరియస్ ఎమోషనల్ సీన్ ద్వారా సినిమా ఇంటర్వెల్ దిశగా కొనసాగుతుంది.
Date & Time : 10:10 AM October 25, 2019
-
మైఖేల్ ఒక ఫుట్ బాల్ ప్లేయర్ కానీ అతని తండ్రి ఒక క్రిమినల్ బ్యాక్ డ్రాప్ ఉన్న వాడు అవ్వడం వల్ల అతని సెలక్షన్ కమిటీ పక్కన పెట్టేస్తారు.ఆ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 10:00 AM October 25, 2019
-
ఇప్పుడు నయన్ మరియు విజయ్ ల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ వస్తున్నాయి.ఇప్పుడొక రొమాంటిక్ సాంగ్ వస్తుంది.ఇప్పటి వరకు సినిమా కాస్త నెమ్మదిగానే సాగింది.పెద్దగా ఆకట్టుకునే సీన్స్ ఇంకా రాలేదు.
Date & Time : 09:50 AM October 25, 2019
-
ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది.ఇక్కడ పెద్ద విజయ్ కథను చూపిస్తున్నారు.ఎక్కడో విజయ్ విభిన్న పాత్రలకు మధ్య ఉన్న సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది.
Date & Time : 09:40 AM October 25, 2019
-
ఇప్పుడు కథలో మరో విజయ్ ఎంట్రీ ఇచ్చారు.డ్యూయల్ రోల్ ఇప్పుడు చూపిస్తున్నారు.అలాగే ఒక ఫుట్ బాల్ మ్యాచ్ ద్వారా బిగిల్ ఎంటర్ అయ్యాడు.
Date & Time : 09:30 AM October 25, 2019
-
సినిమా అసలు కథలోకి ఇంకా ఎంటర్ కాలేదు.కేవలం మాస్ ఎలివేషన్ సీన్స్ మాత్రమే వస్తున్నాయి.
Date & Time : 09:20 AM October 25, 2019
-
ఇప్పుడు నయన్ పాత్ర ఎంటర్ అయ్యింది.విజయ్ ఆమె పెళ్లిని చెడగొట్టేసాడు.నయన్ చాలా అందంగా కనిపిస్తుంది.
Date & Time : 09:15 AM October 25, 2019
-
ఇప్పుడు విజయ్ ఎంట్రీకి సమయం ఆసన్నం అయ్యింది.ఒక మాస్ ఎంట్రీ తో మైఖేల్ గా ఎంటర్ అయ్యారు.
Date & Time : 09:05 AM October 25, 2019
-
సినిమా ఇప్పుడు ఒక సీరియస్ నోట్ పై మొదలయ్యింది.కొంత మంది విద్యార్థులు ఒక కాలేజ్ ముందు ఉంది నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Date & Time : 09:00 AM October 25, 2019
-
హాయ్..178 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 08:55 AM October 25, 2019