
మొదటి షో వివరాలు : వార్ 2
ఇప్పుడు హృతిక్, తారక్ నడుమ ఓ ఎమోషనల్ సీన్ తర్వాత ఇద్దరిపై ఓ పాజిటివ్ ఎండింగ్ తో కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
ఫైనల్ బ్యాటిల్.. తారక్ వర్సెస్ హృతిక్ భీకర యాక్షన్ మొదలైంది. తారక్ ఇందులో స్ట్రాంగ్ ఎమోషన్ తో టెర్రిఫిక్ గా కనిపిస్తున్నాడు
కొన్ని కీలక సన్నివేశాలు తర్వాత సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
మరో యాక్షన్ సీన్ తర్వాత కబీర్ ను పట్టుకునే వేట కొనసాగుతుంది. ఇప్పుడు ఊపిరి ఊయలగా సాంగ్ మొదలైంది
ఇద్దరూ డిఫరెంట్ మైండ్ సెట్ తో కనిపిస్తున్నారు. ఓ కీలక సమయంలో ఇద్దరి మధ్య క్లాష్ వచ్చింది. ఇక కథ ఇప్పుడు తిరిగి ప్రస్తుత కాలానికి చేరుకుంది
ఇంటర్వెల్ అనంతరం.. ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తో మొదలైంది. 1990 ముంబైలో తారక్, హృతిక్ చిన్ననాటి సీన్స్ వస్తున్నాయి.
ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పటివరకు సినిమా డీసెంట్‌గా సాగింది. తారక్, హృతిక్ తమ పాత్రల్లో టెర్రిఫిక్‌గా కనిపించారు. తారక్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడని చెప్పాలి. యాక్షన్ సీక్వెన్స్‌లు, మ్యూజిక్ డీసెంట్‌గా సాగగా.. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంది. ఇక సెకండాఫ్‌పైనే అందరి చూపులు ఉన్నాయి
మరో స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత తారక్ పై ఓ షాకింగ్ ట్విస్ట్ తో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామ
తారక్, హృతిక్ మధ్య కొన్ని కీలక సన్నివేశాల తర్వాత అవైటెడ్ డ్యాన్స్ నెంబర్ ‘సలాం అనాలి’ సాంగ్ వస్తోంది. ఇద్దరు హీరోలు తమ డ్యాన్స్ మూమెంట్స్‌తో అదరగొడుతున్నారు. ఇది ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పాలి
ఇప్పుడు అవైటెడ్ ఫేస్ ఆఫ్ టైగర్ వర్సెస్ హృతిక్.. ఓ క్రేజీ ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ తో తారక్, హృతిక్ ని వేటాడుతున్నాడు. ఇంట్రెస్టింగ్ సీన్స్ కొనసాగుతున్నాయి
ఆ విధ్వంసకర యాక్షన్ సీక్వెన్స్ తర్వాత తారక్, కియార, మరో కీలక నటుడు ఒక టీంగా చేరి కబీర్ ని పట్టుకునే ప్లాన్ చేస్తున్నారు
అవైటెడ్ ఎంట్రీ.. ఓ క్రేజీ ఎలివేషన్ సీన్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏజెంట్ విక్రమ్ గా ఒక ఊహించని మ్యాడ్ అండ్ రోరింగ్ ఎంట్రీ ఇచ్చారు. తనపై ఓ ప్రమాదకర మిషన్ కి సంబంధించిన సీన్స్ వస్తున్నాయి
కథనంలో ఓ ట్విస్ట్ తర్వాత ఇప్పుడు సినిమా ఎమోషనల్ టర్న్ తీసుకుంది.
ఆ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత కథ ఇండియాకి షిఫ్ట్ అయ్యింది. వింగ్ కమాండర్ గా కియార పరిచయం కాగా.. హృతిక్ పై కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి
జపాన్ లో సీన్స్ తో సినిమా మొదలైంది. సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో హృతిక్ ఒక బ్యాడాస్ ఎంట్రీ ఇచ్చారు. తనపై ఓ ఫైట్ సీక్వెన్స్ ఇప్పుడు వస్తుంది
హాయ్.. 171 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలవుతుంది