-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:45 AM October 11, 2024
-
గోపిచంద్ టీం, విలన్ టెర్రరిస్ట్ గ్యాంగ్ నడుమ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా క్లైమాక్స్ కి చేరుకుంది.
Date & Time : 11:40 AM October 11, 2024
-
ఇప్పుడు సినిమా ప్రస్తుతానికి చేరుకుంది. గోపిచంద్ విలన్ నడుమ కీలక సన్నివేశాలు వస్తున్నాయి. ఇపుడు కథనంలో ఎమోషనల్ గా చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 11:30 AM October 11, 2024
-
గోపిచంద్ ఫ్యామిలీ పై జరిగిన దారుణ ఘటనపై ఎమోషనల్ సన్నివేశాలు తర్వాత గోపిచంద్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండర్ గా కనిపిస్తున్నాడు. కొన్ని సీరియస్ సన్నివేశాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి.
Date & Time : 11:20 AM October 11, 2024
-
మెయిన్ లీడ్ నడుమ ఒక మాస్ సాంగ్ తర్వాత సినిమా సీరియస్ టోన్ లోకి మారింది. గోపిచంద్ పై ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:10 AM October 11, 2024
-
ట్రైన్ లో వీటివి గణేష్ పై చిన్న కామెడీ సీన్ తర్వాత నరేష్ ఫ్యామిలీకి వెన్నెల కిషోర్ నడుమ మంచి కామెడీ సీక్వెన్స్ మొదలైంది. ఇందులో వెన్నెల కిషోర్ అదరగొడుతున్నాడు.
Date & Time : 11:00 AM October 11, 2024
-
ఇప్పుడు స్క్రీన్ పైకి వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చాడు. తనపై హిళేరియాస్ కామెడీ సీన్స్ వస్తున్నాయి. వీటితో ఐకానిక్ ట్రైన్ సీక్వెన్స్ కి రంగం సిద్ధం అవుతుంది.
Date & Time : 10:50 AM October 11, 2024
-
ఇంటర్వెల్ అనంతరం.. గోవాలో పలు కామెడీ సీన్స్ తో సినిమా స్టార్ట్ అయ్యింది. ఓ పక్క విలన్ గ్యాంగ్ ఆ పాపని పట్టుకోడానికి ట్రై చేస్తున్నారు.
Date & Time : 10:40 AM October 11, 2024
-
ఫస్టాఫ్ రిపోర్ట్:
ఇప్పుడు వరకు సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఉంది. గోపిచంద్, కావ్య థాపర్ ల జోడి బాగుంది. పృథ్వీరాజ్ తదితరులుపై కామెడీ సీన్స్ మాత్రం వర్కవుట్ అయ్యాయి కానీ మిగతా అంతా రెగ్యులర్ గానే ఉంది. వీటితో సెకండాఫ్ ఏమన్నా కీలకంగా మారుతుందో లేదో చూడాలి.
Date & Time : 10:30 AM October 11, 2024
-
ఈ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత చిన్న ఎమోషనల్ బిట్ తో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:20 AM October 11, 2024
-
ప్రస్తుతం సినిమాలో ఓ పాపకి సంబంధించిన కీలక సన్నివేశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో గోపిచంద్ పై సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ మొదలయింది.
Date & Time : 10:15 AM October 11, 2024
-
నరేష్ ఫ్యామిలీపై కొన్ని కామెడీ సీన్స్ తర్వాత సినిమా కొంచెం సీరియస్ టోన్ లోకి మారింది. నటుడు షామ్ పై కొన్ని ఎమోషనల్ సీన్స్ తో అమ్మ సాంగ్ మొదలైంది.
Date & Time : 10:05 AM October 11, 2024
-
మెయిన్ లీడ్ నడుమ కొన్ని సింపుల్ లవ్ సీన్స్ తర్వాత వస్తాను వస్తానులే రొమాంటిక్ సాంగ్ వస్తుంది.
Date & Time : 09:55 AM October 11, 2024
-
ఇప్పుడు సినిమా ఇటలీ, మిలాన్ కి షిఫ్ట్ అయ్యింది. గోపిచంద్, కావ్య థాపర్ గ్యాంగ్ పై శ్రీనువైట్ల మార్క్ కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:45 AM October 11, 2024
-
కొన్ని హిళేరియాస్ కామెడీ సీన్స్ తర్వాత మొరకాన్ మగువ సాంగ్ తో హీరోయిన్ కావ్య థాపర్ గ్లామరస్ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 09:30 AM October 11, 2024
-
గోపిచంద్ పై ఒక స్టైలిష్ ఎంట్రీ తర్వాత నరేష్, ఫ్యామిలీతో కొన్ని కామెడీ సీన్స్ వచ్చాయి. ఇప్పుడు గోపిచంద్ కి కొందరు రౌడిల నడుమ మాస్ ఫైట్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:20 AM October 11, 2024
-
ఇప్పుడు సుమన్ పై కొన్ని కీలక సన్నివేశాలు తర్వాత టెర్రరిస్టులకి సంబంధించి సీన్స్ వచ్చాయి. ఈ తర్వాత స్క్రీన్ పైకి నరేష్, ప్రగతిలు పరిచయం అయ్యారు.
Date & Time : 09:15 AM October 11, 2024
-
ద్వారకాలో ఒక బాంబ్ దాడి జరిగిన సన్నివేశాలతో సినిమా మొదలైంది. సునీల్, జిస్సు సేన్ గుప్త ఇప్పుడు స్క్రీన్ పై పరిచయం అయ్యారు.
Date & Time : 09:05 AM October 11, 2024
-
హాయ్.. 155 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయింది.
Date & Time : 09:00 AM October 11, 2024