-
కొన్ని ఆసక్తికర మలుపులు ట్విస్ట్ లు తర్వాత సినిమా ఓ ఉహించని ఎండింగ్ తో ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 07:10 AM April 21, 2023
-
ఆసక్తికర సీన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు కథనంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు సినిమా ఎగ్జైటింగ్ క్లైమాక్స్ దిశగా కొనసాగుతుంది.
Date & Time : 06:45 AM April 21, 2023
-
ట్విస్ట్ లు ఒకొకటిగా రివీల్ అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ రుద్రవనం ప్రజల్ని కాపాడేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 06:30 AM April 21, 2023
-
సినిమా మరింత ఆసక్తికరంగా కొనసాగుతుంది. చేతబడి కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి. మరోపక్క సాయి తేజ్ మిస్టరీ ఛేదించే పనిలో కొనసాగుతున్నాడు.
Date & Time : 06:20 AM April 21, 2023
-
ఇంటర్వెల్ అనంతరం.. ఓ ట్విస్ట్ తో అయితే సినిమా స్టార్ట్ అయ్యింది. ఇప్ఫడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలయింది.
Date & Time : 06:10 AM April 21, 2023
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు సినిమా బాగానే ఉందని చెప్పాలి. ఆసక్తిగొల్పే థ్రిల్లింగ్ సీన్స్ తో కథనం ఇంటెన్స్ గా సాగింది. సాయి తేజ్,ముఖ్యంగా సంయుక్త మీనన్ లు తమ పాత్రల్లో ఇంప్రెస్ చేస్తున్నారు. అలాగే మ్యూజిక్ కూడా మరింత థ్రిల్ ని జెనరేట్ చేస్తుంది. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 06:00 AM April 21, 2023
-
ఇప్పుడు ఓ కీలక పాత్ర టార్గెట్ గా మారింది. కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అనంతరం సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 05:50 AM April 21, 2023
-
ఇప్పుడు సినిమా సీరియస్ నోట్ లో కొనసాగుతుంది. ఆ ఊరిలో అనుమానాస్పద మృతిల సంఖ్య ఇంకా పెరిగుతుంది. ఒక అఘోరా గా నటుడు అజయ్ పరిచయం అయ్యాడు. మరోపక్క సాయి తేజ్ ఈ మిస్టరీ ఛేదించే పనిలో ఉన్నాడు.
Date & Time : 05:40 AM April 21, 2023
-
ఇప్పుడు రుద్రవనం కి సంబంధించి పలు ఇంటెన్స్ సీన్స్ వస్తున్నాయి. సాయి తేజ్ ఓ సమస్య లో ఇరుక్కున్నాడు.
Date & Time : 05:30 AM April 21, 2023
-
ఇప్పుడు సినిమా మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఓ గుడిలో జరిగిన అనుమానాస్పద మృతి సస్పెన్స్ గా మారింది.
Date & Time : 05:15 AM April 21, 2023
-
మెయిన్ లీడ్ మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ అనంతరం నచ్చావులే సాంగ్ మొదలైంది. ఇందులో సంయుక్త బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది.
Date & Time : 05:05 AM April 21, 2023
-
సూర్య గా సాయి ధరమ్ తేజ్ ఓ కూల్ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే నందిని గా సంయుక్త మీనన్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 04:55 AM April 21, 2023
-
ఓ వైలెంట్ సీన్ తో అయితే సినిమా ఆరంభం అయ్యింది. నటులు బ్రహ్మాజీ, సునీల్, రాజీవ్ కనకాల లు పరిచయం అయ్యారు. కొన్ని భయానక సీన్స్ కనిపిస్తున్నాయి.
Date & Time : 04:45 AM April 21, 2023
-
హాయ్..140 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 04:35 AM April 21, 2023