-
-
చరణ్ మరియు వివేక్ ల మధ్య ఒక భీకర పోరాట సన్నివేశంతో క్లైమాక్స్ ముగిసింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 06:02 AM January 11, 2019
-
ఇప్పుడు సినిమా క్లైమాక్స్ దిశకు చేరుకుంటుంది..
Date & Time : 05:58 AM January 11, 2019
-
ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక విషాద సన్నివేశంతో ముగిసింది.
Date & Time : 05:53 AM January 11, 2019
-
వివేక్ ఓబ్రాయ్ రామ్ యొక్క అన్నలను కిడ్నప్ చేసి బంధించాడు.ఇప్పుడు రామ్ చరణ్ టాటూ బాడీ పోస్టర్లతో ఎంతో ఆసక్తి రేకెత్తించిన ఫైట్ సీన్ వస్తుంది.
Date & Time : 05:41 AM January 11, 2019
-
రామ్ కుటుంబం అంతా ద్వారకా చేరుకున్నారు.పోస్టర్లో చూపిన సీన్ హీరోయిన్ ను హీరో చేత్తో లేపే సన్నివేశం బోయ బాగా చిత్రీకరించారు..ఇప్పుడు రామ లవ్స్ సీత పాట వస్తుంది.
Date & Time : 05:25 AM January 11, 2019
-
విరామం అనంతరం బీహార్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో మొదలయ్యింది.విలన్ గా వివేక్ ఓబ్రాయ్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 05:15 AM January 11, 2019
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇంటర్వెల్ కు ముందు చివరి 15 నిమిషాలు బాగుంది.ఇదే స్థాయి సెకండాఫ్ లో కూడా కొనసాగుతుందో లేదో వేచి చూద్దాం
Date & Time : 05:05 AM January 11, 2019
-
సినిమా ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ తో సగానికి చేరుకుంది.
Date & Time : 05:05 AM January 11, 2019
-
ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ కు ఇప్పుడు రంగం సిద్ధమయ్యింది.
Date & Time : 05:01 AM January 11, 2019
-
ఇప్పుడు తస్సాదియ్యా సాంగ్ వస్తుంది.రామ్ చరణ్ తనదైన డాన్స్ స్టెప్పులతో పాటను లాక్కొచ్చేస్తున్నారు.
Date & Time : 04:50 AM January 11, 2019
-
హాస్య నటులు హేమ మరియు 30 ఇయర్స్ పృథ్వీల మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:43 AM January 11, 2019
-
ఇప్పుడు ఐదుగురు అన్నదమ్ములు మరియు వారి కుటుంబం మధ్య ఆప్యాయతలను చిత్రీకరిస్తూ హిట్ సాంగ్ తందానే తందానే పాట వస్తుంది.
Date & Time : 04:33 AM January 11, 2019
-
పెళ్లి చూపుల సన్నివేశంతో హీరోయిన్ కియారా అద్వానీ ఎంట్రీ ఇచ్చారు,హీరో మరియు హీరోయిన్ల మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 04:27 AM January 11, 2019
-
రామ్ పెద్దన్నయ్యగా మరియు స్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా ప్రశాంత్ ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు టీజర్ లో మంచి హిట్ అయిన డైలాగ్ "నువ్వు పందెం పరుశురాం అయితే ఏంటి..ఇక్కడ రామ్ కో..ణి..దె..ల" డైలాగ్ తో మరి యాక్షన్ సన్నివేశం మొదలయ్యింది.
Date & Time : 04:15 AM January 11, 2019
-
ఇప్పుడు బాలీవుడ్ నటి ఈషా గుప్తాతో ఐటెం సాంగ్ ఏక్ బార్, ఏక్ బార్ పాటకి రంగం సిద్ధమయ్యింది.
Date & Time : 04:02 AM January 11, 2019
-
వారికి దొరికిన చిన్న బాబు పెద్దయ్యి రామ్(చరణ్) అయ్యాడు.ఒక యాక్షన్ బ్లాక్ తో రామ్ ఎంట్రీ మొదలయ్యింది.ఇక్కడే చిన్న ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది.
Date & Time : 03:52 AM January 11, 2019
-
ఆ నలుగురు పిల్లలు ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఒక చిన్న బాబును చూసారు.ఇప్పుడు ఆ నలుగురు పిల్లలకు ఆ బాబుకు మధ్య "అమ్మ నాన్న" పాట వస్తుంది.
Date & Time : 03:47 AM January 11, 2019
-
నలుగురు అనాధ పిల్లలకు సంబందించిన సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 03:42 AM January 11, 2019
-
హాయ్..146 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడు మొదలయ్యింది.
Date & Time : 03:38 AM January 11, 2019