-
తండ్రి కొడుకుల మధ్య కొన్ని బలమైన ఎమోషనల్ సన్నివేశాల తరువాత సినిమా కంప్లీట్ అయింది.... పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ వుండండి.
Date & Time : 07:40 AM July 12, 2018
-
సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతూ నాజర్ చేత ఏర్పాటు చేయబడ్డ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ కి షిఫ్ట్ అయింది, ప్రస్తుతం కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:33 AM July 12, 2018
-
కొన్ని కుటుంబ పెళ్లి సన్నివేశాల తరువాత, ప్రస్తుతం ఫ్యామిలీ సాంగ్ 'ఆకాశాన్ని తాకే' వస్తోంది
Date & Time : 07:27 AM July 12, 2018
-
చిన్న స్ట్రీట్ ఫైట్ తరువాత ప్రస్తుతం ఎమోషనల్ సాంగ్ 'అడుగడునా' వస్తోంది. తండ్రి గొప్పతనాన్ని పాటలో బాగా చూపిస్తున్నారు.
Date & Time : 07:17 AM July 12, 2018
-
హీరోయిన్ కజిన్ గా కమెడియన్ సత్యం రాజేష్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.. వారి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి...థర్టీ ఇయర్స్ పృథ్వి కూడా సీన్ లో జాయిన్ అయ్యాడు.
Date & Time : 07:10 AM July 12, 2018
-
కొన్ని ఆకట్టుకునే సన్నివేశాల తరువాత, ప్రస్తుతం మంచి మోటివేషనల్ సాంగ్ 'సలాం సలాం' వస్తోంది.
Date & Time : 07:02 AM July 12, 2018
-
చివరికి, కళ్యాణ్ తన మనసు మార్చుకుని జీవితంలో సెటిల్ కావడానికి హీరోయిన్ సాయం తీసుకున్నాడు. దానికి సంబంధించి ప్రస్తుతం కొన్ని సన్నివేహాసాలు వస్తున్నాయి...
Date & Time : 06:54 AM July 12, 2018
-
ఫ్లాష్ బ్యాక్ పూర్తి అయింది. కొన్ని మధ్యతరగతి వారి సమస్యలకు సంబంధించి ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 06:45 AM July 12, 2018
-
ఇంటర్వెల్ తరువాత వాళ్ల ఫ్యామిలీ వెల్ విషర్ గా, కళ్యాణ్ కు మురళి శర్మ ఫ్లాష్ బ్యాక్ చెపుతూ, సేనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి ఇప్పుడే సీన్లో కి వచ్చారు.
Date & Time : 06:37 AM July 12, 2018
-
తండ్రి కొడుకుల మధ్య కొన్ని భావోద్వేగభరిత సన్నివేశాల తరువాత సినిమా సగం పూర్తి అయింది...ప్రస్తుతం ఇంటర్వెల్
Date & Time : 06:25 AM July 12, 2018
-
కళ్యాణ్, అతని ఫ్రెండ్స్ సొంత వ్యాపారం చేసుకుని లైఫ్ లో స్థిరపడాలని నిర్ణయించారు... దానికి సంబంధించి ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 06:20 AM July 12, 2018
-
మురళి శర్మ గతానికి సంబంధించి ఒక చిన్న ట్విస్ట్ వచ్చింది.... ఫేమస్ ఫొటోగ్రాఫర్ గా యాక్టర్ నాజర్ స్కీన్లోకి ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 06:12 AM July 12, 2018
-
కొన్ని ఫన్నీ సీన్ల తరువాత ప్రస్తుతం 'మీ మమ్మీ' అనే మరొక పాట వస్తోంది...హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే టీజింగ్ సాంగ్ అది.
Date & Time : 06:05 AM July 12, 2018
-
హీరో ప్రక్కింటి అమ్మాయిగా హీరోయిన్ మాళవిక నాయర్ ఎంట్రీ ఇచ్చింది...కళ్యాణ్ దేవ్ హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు...ఆ సన్నివేశం ప్రస్తుతం అందమైన పాట, మిన్సారే మిన్సారే కి దారి తీసింది....
Date & Time : 05:58 AM July 12, 2018
-
కళ్యాణ్ దేవ్ బాధ్యతారాహిత్యంపై మురళి శర్మ కలవర పడుతున్నాడు..... ప్రస్తుతం దానికి సంబంధించి వారి కుటుంబ సభ్యుల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 05:50 AM July 12, 2018
-
ప్రస్తుతం ఫన్నీ లిరిక్స్ తో రాసిన మొదటి పాట కొక్కరోకో వస్తోంది...
Date & Time : 05:40 AM July 12, 2018
-
తన గ్యాంగ్ తో కలిసి హీరోకి కళ్యాణ్ దేవ్ ఇప్పుడే జాబ్ వెతుక్కునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గా ఎంట్రీ ఇచ్చాడు.... ప్రస్తుతం కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 05:35 AM July 12, 2018
-
ప్రస్తతం తండ్రి కొడుకుల అనుబంధం మీద చిత్రీకరించబడిన చిన్ననాటి సన్నివేశాలు వస్తున్నాయి.... హీరో తండ్రిగా మురళి శర్మ పరిచయం కబడ్డారు...
Date & Time : 05:28 AM July 12, 2018
-
హాయ్ 137 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే మొదలయింది.
Date & Time : 05:20 AM July 12, 2018