-
బాలయ్య ఫై మాస్ యాక్షన్ సీక్వెన్స్ తో కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 05:05 AM Jan 12, 2023
-
నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో ఆకట్టుకుంటుంది. తనపై ఎమోషనల్ సీన్ తో సినిమాలో మరో ట్విస్ట్ రివీల్ అయ్యింది.
Date & Time : 05:00 AM Jan 12, 2023
-
మరో మాసివ్ యాక్షన్ సీక్వెన్స్ తో మాస్ మొగుడు సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఇలా సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 04:50 AM Jan 12, 2023
-
ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మరికొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:40 AM Jan 12, 2023
-
ఇప్పుడు మరిన్ని ఎమోషనల్ సీన్స్ కొనసాగుతున్నాయి.
Date & Time : 04:30 AM Jan 12, 2023
-
కొన్ని ఫామిలీ సీన్స్ తర్వాత కథనంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కీలక పాత్రదారుల మధ్య పలు సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:25 AM Jan 12, 2023
-
మరిన్ని కొత్త పాత్రల పరిచయం తర్వాత ఎనర్జిటిక్ నబర్మా బావ మనోభావాలు సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో బాలయ్య అదిరే డాన్స్ మూమెంట్స్ కనిపిస్తున్నాయి.
Date & Time : 04:15 AM Jan 12, 2023
-
మరికొన్ని యాక్షన్ సీన్స్ తర్వాత చార్ట్ బస్టర్ జై బాలయ్య సాంగ్ స్టార్ట్ అయ్యింది. సీమ ప్రజలు వీర సింహా రెడ్డి పై తమ ప్రేమ వ్యక్తం చేస్తున్నారు.
Date & Time : 04:10 AM Jan 12, 2023
-
వీరసింహా రెడ్డి గా బాలయ్య మరో షేడ్ ఇప్పుడు కనిపిస్తుంది. అలాగే మరో చిన్న సర్ప్రైజ్ కూడా వచ్చింది.
Date & Time : 04:00 AM Jan 12, 2023
-
ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది. కీలక పాత్రలపై సన్నివేశాలు కొనసాగుతున్నాయి.
Date & Time : 03:50 AM Jan 12, 2023
-
ఇంటర్వెల్ అనంతరం.. కొన్ని ఎమోషనల్ సీన్స్ తో సినిమా మొదలైంది.
Date & Time : 03:40 AM Jan 12, 2023
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు అంతా పర్లేదని చెప్పొచ్చు. బాలయ్య నుంచి మాస్ పెర్ఫార్మన్స్, తన ఎనర్జీ ఆకట్టుకుంటాయి, యాక్షన్ సీక్వెన్స్ లు థమన్ మ్యూజిక్ బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఆసక్తి గా ఉంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 03:35 AM Jan 12, 2023
-
ఓ షాకింగ్ ట్విస్ట్ తో అయితే సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 03:30 AM Jan 12, 2023
-
ఇప్పుడు రాయలసీమ నుంచి ఇంట్రెస్టింగ్ గా ఫారిన్ కి ఫ్యాక్షన్ షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు ఇస్తాంబుల్ లో మాసివ్ యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 03:20 AM Jan 12, 2023
-
వీరసింహా రెడ్డి ఇతర పాత్రలపై మరికొన్ని కీలక సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 03:10 AM Jan 12, 2023
-
మరో మాస్ ఫైట్ సీక్వెన్స్ అనంతరం బాలయ్య ఓ పొలిటికల్ లీడర్ తో మీటింగ్ సీన్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ బాలయ్య మార్క్ హై వోల్టేజ్ పొలిటికల్ డైలాగ్స్ పేలుతున్నాయి.
Date & Time : 03:05 AM Jan 12, 2023
-
నటి వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఇప్పుడు పరిచయం అయ్యింది. ఆమెపై కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:00 AM Jan 12, 2023
-
ఇప్పుడు బాలయ్య, విలన్ గ్యాంగ్ మధ్య సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది. ఇందులో థమన్ స్కోర్ బాగుంది.
Date & Time : 02:50 AM Jan 12, 2023
-
ఇప్పుడు సినిమా రాయలసీమ కి షిఫ్ట్ అయ్యింది. వీరసింహా రెడ్డి గా బాలయ్య స్టన్నింగ్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 02:40 AM Jan 12, 2023
-
కొన్ని సన్నివేశాల అనంతరం సుగుణ సుందరి సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 02:30 AM Jan 12, 2023
-
ఓ కామెడీ సీన్ తో హీరోయిన్ శృతి హాసన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 02:20 AM Jan 12, 2023
-
ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. తన మార్క్ డైలాగ్స్, ఫైట్ సీన్ వస్తుంది.
Date & Time : 02:17 AM Jan 12, 2023
-
ఇప్పుడు సినిమా ఇస్తాంబుల్ కి షిఫ్ట్ అయ్యింది. నటి హనీ రోస్ పాత్ర ఇక్కడ పరిచయం అయ్యింది.
Date & Time : 02:15 AM Jan 12, 2023
-
ఇప్పుడు విలన్ పవర్ ఫుల్ ఎంట్రీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 02:10 AM Jan 12, 2023
-
దివంగత నటులు కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, కైకాల, మరియు చలపతి రావు గార్లను స్మరిస్తూ సినిమా మొదలవుతుంది.
Date & Time : 02:05 AM Jan 12, 2023
-
హాయ్.. 170 నిమిషాల నిడివి గల వీరసింహా రెడ్డి చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 02:00 AM Jan 12, 2023