-
మొత్తానికి సినిమా పూర్తయ్యింది. కంప్లీట్ రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 06:47 AM October 29, 2021
-
ఒక ఎమోషనల్ సాంగ్ తో సినిమా కంప్లీట్ అయ్యిపోవచ్చింది.
Date & Time : 06:40 AM October 29, 2021
-
ఇప్పుడు కథనంలో చిన్న ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది.
Date & Time : 06:35 AM October 29, 2021
-
ఇప్పుడు నాగ శౌర్య పై కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ తో క్లైమాక్స్ నడుస్తుంది.
Date & Time : 06:30 AM October 29, 2021
-
మరో హిట్ సాంగ్ వడ్డాణం మొదలయింది. ఇది కూడా విజువల్ గా బానే ఉంది. సినిమా అలా క్లైమాక్స్ దిశగా కొనసాగుతుంది.
Date & Time : 06:25 AM October 29, 2021
-
ఇప్పుడు కమెడియన్ సప్తగిరి ఎంటర్ అయ్యి మరిన్ని నవ్వులు పూయిస్తున్నాడు.
Date & Time : 06:20 AM October 29, 2021
-
ఇప్పుడు సినిమా అరకు కి షిఫ్ట్ అయ్యింది. కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:15 AM October 29, 2021
-
అలాగే నటుడు మురళీ శర్మ పెళ్లి కోసం చెప్పిన సన్నివేశంలో డైలాగ్స్ కూడా బాగున్నాయి.
Date & Time : 06:10 AM October 29, 2021
-
ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఒక ఎమోషనల్ నోట్ తో కంప్లీట్ అయ్యింది. గణేష్ రావూరి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఇప్పుడు రీతూ నదియా ల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:05 AM October 29, 2021
-
మళ్లీ మనసులోనే నిలిచిపోకే సాంగ్ తో మెయిన్ లీడ్ మధ్య మరికొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:00 AM October 29, 2021
-
ఇప్పుడు సినిమా ఆల్ టైం హిట్ ట్రాక్ దిగు దిగు దిగు నాగ స్టార్ట్ అయ్యింది. పూర్తిగా కొత్త రీతూ వర్మని ఇందులో చూస్తాం.
Date & Time : 05:55 AM October 29, 2021
-
ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. కమెడియన్ సత్య ఎంటర్ అయ్యాడు. అలాగే నాగ శౌర్య, రీతూ వర్మల రోల్స్ కూడా కనిపిస్తున్నాయి.
Date & Time : 05:50 AM October 29, 2021
-
ఇంటర్వెల్ అనంతరం.. కొత్త లుక్ లో నాగ శౌర్య కనిపిస్తున్నాడు. తన సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:45 AM October 29, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పుడు వరకు సినిమా పర్లేదు అని చెప్పొచ్చు. డీసెంట్ కామెడీ, ఎమోషన్స్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ కు చేరుకుంది. కానీ సెకండాఫ్ సినిమాని మరింత ఆసక్తిగా మార్చవచ్చు. మరి అదెలా ఉంటుందో చూడాలి.
Date & Time : 05:40 AM October 29, 2021
-
కొన్ని రొమాంట్ సన్నివేశాల తర్వాత సినిమా కంప్లీట్ గా ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 05:40 AM October 29, 2021
-
ఇప్పుడు రొమాంటిక్ సాంగ్ మనసులే నిలిచిపోకే మొదలైంది. ఇక్కడ నుంచి రీతూకి శౌర్య పట్ల ఫీలింగ్స్ మొదలయ్యాయి.
Date & Time : 05:35 AM October 29, 2021
-
ఇప్పుడు సినిమా ఓ గ్రామానికి షిఫ్ట్ అయ్యింది. అక్కడ ఓ పెళ్లి కోసం మెయిన్ లీడ్ వచ్చారు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:30 AM October 29, 2021
-
ఇప్పుడు నాగ శౌర్య, రీతూ ల ప్రాజెక్ట్ సంబంధించి సీన్స్ వస్తున్నాయి. అలాగే కొన్ని కామెడీ సీన్స్ కూడా కొనసాగుతున్నాయి.
Date & Time : 05:20 AM October 29, 2021
-
ఇప్పుడు మరో సాంగ్ కోల కళ్ళే మొదలైంది. ఇందులో విజువల్స్ మ్యూజిక్ బాగా అనిపిస్తున్నాయి.
Date & Time : 05:15 AM October 29, 2021
-
ఇప్పుడు నెగిటివ్ రోల్ లో హర్షవర్ధన్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 05:10 AM October 29, 2021
-
వెన్నెల కిషోర్, ప్రవీణ్ ల సింగిల్ లైన్ డైలాగ్స్ నవ్వు తెప్పిస్తున్నాయి. కానీ సినిమా ఇంకా స్లో గానే వెళుతూ ఉంది.
Date & Time : 05:05 AM October 29, 2021
-
నాగ శౌర్య రీతూ వర్మ ల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. అలాగే కామెడీ సీన్స్ కూడా..
Date & Time : 05:00 AM October 29, 2021
-
నాగ శౌర్య ఇండియాకి వచ్చి రీతూ ని కలిసిన సన్నివేశాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అంతా సజావుగానే ఉంది.
Date & Time : 04:55 AM October 29, 2021
-
ఇప్పుడు ఫస్ట్ సాంగ్ వాట్ టు డూ పరమేశ్వర స్టార్ట్ అయ్యింది. ఈ సాంగ్ ద్వారా రీతూ వర్మ రోల్ ఎంత స్ట్రిక్ గా ఉంటుంది అన్నది చూపిస్తున్నారు.
Date & Time : 04:50 AM October 29, 2021
-
దుబాయ్ లో సీన్స్ తో నాగ శౌర్య ఎంట్రీ ఇచ్చాడు. ఓ ప్రాజెక్ట్ కోసం ఇండియాకి వస్తున్నాడు, అలాగే రీతూ వర్మ పెళ్ళికి సంబందించిన సన్నివేశాలు కూడా వస్తున్నాయి.
Date & Time : 04:45 AM October 29, 2021
-
ఒక టాప్ ఎం ఎన్ సి కంపెనీలో పని చేసే అమ్మాయిలా రీతూ వర్మ కనిపిస్తుంది. అలాగే ఆమె చాలా స్ట్రిక్ట్ గా ఉండే అమ్మాయిలా ఉంది.
Date & Time : 04:40 AM October 29, 2021
-
ఓ ఫన్నీ పెళ్లి చూపుల సన్నివేశంతో హీరోయిన్ రీతూ వర్మ పరిచయం అయ్యింది.
Date & Time : 04:35 AM October 29, 2021
-
హాయ్..135 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 04:30 AM October 29, 2021