-
కొన్ని ఎమోషనల్ సన్నివేశాల అనంతరం సినిమా సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు. కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 04:04 AM Jan 11, 2023
-
ఇప్పుడు విజయ్ తన అన్నయ్యలతో ప్రకాష్ రాజ్ మనుషుల మధ్య ఫైట్ సీన్ వస్తుంది. ఇక సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 03:44 AM Jan 11, 2023
-
కొన్ని ఎమోషనల్ సీన్స్ అనంతరం ఫైనల్ గా సినిమా హిట్ సాంగ్ రంజితమే స్టార్ట్ అయ్యింది. మెయిన్ లీడ్ ఇద్దరూ తమ డాన్స్ తో అదరగొడుతున్నారు.
Date & Time : 03:34 AM Jan 11, 2023
-
ఇప్పుడు సినిమా ఎమోషనల్ సీన్స్ నుంచి ఓ మాసివ్ ఫైట్ కి వచ్చింది.
Date & Time : 03:24 AM Jan 11, 2023
-
ఓ క్లాసీ ఎలివేషన్ సీన్ తర్వాత చార్ట్ బస్టర్ థీ థలపతి సాంగ్ మొదలైంది.
Date & Time : 03:15 AM Jan 11, 2023
-
ప్రకాష్ రాజ్ మరియు శరత్ కుమార్ ల మధ్య కొన్ని సీరియస్ సీన్స్ తర్వాత ఇప్పుడు సినిమాలో ఓ ఊహించని పాత్ర ఎంటర్ అయ్యింది.
Date & Time : 03:05 AM Jan 11, 2023
-
బోర్డ్ రూమ్ లో ఓ హిలెరియోస్ కామెడి సీన్ విజయ్ పై వస్తుంది. విజయ్ తనదైన స్వాగ్ స్టైల్ తో అలరిస్తున్నాడు.
Date & Time : 02:55 AM Jan 11, 2023
-
ఇప్పుడు విజయ్ పై మరో సూపర్ స్టైలిష్ యాక్షన్ సీన్ మొదలైంది.
Date & Time : 02:45 AM Jan 11, 2023
-
ఇంటర్వెల్ అనంతరం.. విజయ్ మరియు తన అన్నయ్య ల మధ్య కొన్ని డ్రమాటిక్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:35 AM Jan 11, 2023
-
ఫస్టాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు సినిమా పర్లేదు అని చెప్పొచ్చు. విజయ్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అలాగే యోగిబాబు తో కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే ఫ్యామిలీ డ్రామా బాగుంది. థమన్ మ్యూజిక్ కూడా బాగుంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 02:25 AM Jan 11, 2023
-
విజయ్ మరియు శరత్ కుమార్ ల మధ్య కొన్ని సీన్స్ తర్వాత ఓ చిన్న ట్విస్ట్ తో స్టైలిష్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్ మొదలైంది.
Date & Time : 02:15 AM Jan 11, 2023
-
ఎనర్జిటిక్ సాంగ్ తర్వాత ఇప్పుడు కొంచెం సీరియస్ ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అయ్యింది.
Date & Time : 02:00 AM Jan 11, 2023
-
రష్మికా మందన్నా ఎంట్రీ తర్వాత విజయ్ తో పలు సన్నివేశాలు అయ్యాయి. ఇప్పుడు జిమిక్కి పొన్ను సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 01:46 AM Jan 11, 2023
-
విజయ్ మరియు యోగి బాబు ల మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి. యోగి బాబు కామెడీ టైమింగ్ బాగుంది.
Date & Time : 01:36 AM Jan 11, 2023
-
ఓ డాక్టర్ గా నటుడు ప్రభు కనిపిస్తున్నారు. ఇప్పుడు కథనంలో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 01:30 AM Jan 11, 2023
-
ఇప్పుడు శరత్ కుమార్ మరియు విజయ్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 01:25 AM Jan 11, 2023
-
ఇప్పుడు ఓ మాస్ ఇంట్రో సాంగ్ తో దళపతి విజయ్ ఓ సింపుల్ ఎంట్రీ ఇచ్చేసారు.
Date & Time : 01:20 AM Jan 11, 2023
-
ఇప్పుడు శ్రీకాంత్ మరియు నటుడు షామ్ లు శరత్ కుమార్ కొడుకులుగా పరిచయం అయ్యారు. వారు ప్రకాష్ రాజ్ ని ఓ డీల్ లో అయితే దెబ్బ కొట్టారు.
Date & Time : 01:16 AM Jan 11, 2023
-
ప్రకాష్ రాజ్ ఇంట్రో తో సినిమా స్టార్ట్ అయ్యింది. తానొక పెద్ద బిజినెస్ మెన్ లా కనిపిస్తున్నాడు. తన సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 01:10 AM Jan 11, 2023
-
హాయ్.. 170 నిమిషాల నిడివి గల చిత్రం "వారిసు"(తమిళ్) ఇప్పుడే మొదలైంది.
Date & Time : 01:00 AM Jan 11, 2023