-
పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 03:20 AM April 09, 2021
-
చివరలో ఎట్టకేలకు ముగ్గురు మహిళలకు న్యాయం జరుగుతుంది. దీంతో చక్కని భావోద్వేగంతో సినిమా ముగుస్తుంది. ముగింపు.
Date & Time : 03:15 AM April 09, 2021
-
క్లైమాక్స్‌లో పవన్‌కళ్యాణ్ మహిళలపై చేసిన ప్రసంగం అద్భుతంగా అనిపించింది, అతని సంభాషణలు ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచించదగినవిలా అనిపించాయి. ఇక దాని తరువాత మెట్రో ట్రైన్లో ఫైట్ కూడా ఒకే అనిపించింది.
Date & Time : 03:10 AM April 09, 2021
-
పవన్ కళ్యాణ్ ముగ్గురు వ్యక్తులను కోర్టులో ప్రశ్నించడం ప్రారంభించాడు. చిత్రం యొక్క ఇతివృత్తం మరియు ఉద్దేశ్యం ఈ సన్నివేశాల ద్వారా తెలియజేయబడుతుండడంతో ఇది ప్రభావవంతంగా అనిపిస్తుంది. అంతేకాదు దీని నుంచి చక్కటి సామాజిక సందేశం కూడా వెలువడింది.
Date & Time : 03:00 AM April 09, 2021
-
పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మరియు అంజలి మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ సన్నివేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే కాస్త ఎమోషనల్ ఎపిసోడ్ సాగుతూ సినిమా క్లైమాక్స్ వైపు వెళుతుంది.
Date & Time : 02:55 AM April 09, 2021
-
పింక్ సినిమాలో ఫేమస్ అయిన “నో” అని చెప్పే సీన్ ఇప్పుడు వస్తుంది. దానిని నివేదా చాలా చక్కగా చేసి చూపించింది.
Date & Time : 02:50 AM April 09, 2021
-
ఇప్పుడే మరొక యాక్షన్ సీన్ మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ తన మ్యానరిజం మరియు బాడీ లాంగ్వేజ్ అందులో బాగా కనిపించింది. కథలో ఇప్పుడే ఒక ట్విస్ట్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్‌కు వృత్తిపరంగా ఊహించని అడ్డంకి వచ్చిపడింది.
Date & Time : 02:40 AM April 09, 2021
-
కోర్టు గది దృశ్యాలు సీరియస్, ఎమోషనల్‌గా ఉన్నా బాగా ఆకట్టుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ యొక్క ట్రేడ్ మార్క్ కామెడీ టైమింగ్ చాలా చక్కగా పనిచేస్తోంది మరియు ఇది కథనానికి మరింత తాజాదనాన్ని తీసుకువచ్చింది.
Date & Time : 02:35 AM April 09, 2021
-
ఈ చిత్రం ఇప్పుడు చివరి దశలోకి ప్రవేశిస్తుంది. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, నివేదా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకోగా తమన్ తన మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేశాడని చెప్పాలి. ప్రధానంగా వీరే కథను లీడ్ చేశారు.
Date & Time : 02:30 AM April 09, 2021
-
ప్రస్తుతం కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ నడుస్తుంది. ప్రధానంగా కథనం మొత్తం ఇప్పుడు జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్ సన్నివేశాలపై కేంద్రీకృతమై ఉంది. స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపిస్తుంది. నివేదా చక్కటి ప్రశంసనీయమైన ప్రదర్శనను కనబరుస్తుంది .
Date & Time : 02:25 AM April 09, 2021
-
పవన్ కళ్యాణ్ మరియు ప్రకాష్ రాజ్ మధ్య కోర్టులో వాదిస్తున్న ఘర్షణ దృశ్యాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య నడుస్తున్న వాదోపవాదనలతో కోర్టు గది దృశ్యాలు బాగా అనిపిస్తున్నాయి.
Date & Time : 02:15 AM April 09, 2021
-
సెకండాఫ్ ఇప్పుడే మొదలయ్యింది. డిఫెన్స్ లాయర్‌గా ప్రకాష్ రాజ్ కథా సన్నివేశంలోకి ఎంట్రీ ఇచ్చారు. ముగ్గురు మహిళలను వేధిస్తున్న ముగ్గురు వ్యక్తుల తరపున ప్రకాష్ రాజ్ వాదించబోతున్నారు. ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్‌లు ఈ కేసును స్వీకరించడంతో కోర్టులోని దృశ్యాలు ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి.
Date & Time : 02:05 AM April 09, 2021
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇక్కడి వరకు చూసుకున్నట్టైతే వకీల్ సాబ్ యొక్క ప్రధాన కథాంశాన్ని నిలుపుకుందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ సత్య దేవ్‌గా చాలా చురుకుగా, తెలివిగా కనిపిస్తాడు. అంజలి, అనన్య మరియు నివదా పవన్ కళ్యాణ్‌కు చక్కటి మద్దతు అందించారు. మంచి కమర్షియల్ అంశంతో ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంది. సెకాండాఫ్ సినిమాకు కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది.
Date & Time : 02:00 AM April 09, 2021
-
ఇంటర్వెల్ సమయం ఆసన్నమవ్వడంతో ఫస్టాఫ్ మంచి యాక్షన్ ఎపిసోడ్‌తో ముగిసింది. పవన్ కళ్యాణ్ తిరిగి న్యాయవాదిగా వచ్చేశాడు. ఇప్పుడు విరామం వచ్చింది.
Date & Time : 01:54 AM April 09, 2021
-
పవన్ కళ్యాణ్ తన జీవితంలో జరిగిన కొన్ని దిగ్భ్రాంతికరమైన పరిణామాల కారణంగా లా ప్రాక్టీస్‌ను వదులుకుంటాడు. అక్కడితో ఫ్లాష్‌బ్యాక్ ముగుస్తుంది. అయితే నివేదా, అంజలి మరియు అనన్య బెయిల్ కోసం పవన్ సహాయం చేస్తాడు.
Date & Time : 01:45 AM April 09, 2021
-
మెయిన్ హీరోయిన్ శృతిహాసన్ ఎంట్రీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ మరియు శ్రుతి హసన్ రొమాంటిక్ సన్నివేశాలు నడుస్తూ కంటి పాప సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 01:35 AM April 09, 2021
-
సామాజిక సమస్యలకు సంబంధించి భావోద్వేగ సన్నివేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సినిమాలోని రెండవ పాట సత్యమేవ జయతే సాంగ్ మొదలయ్యింది. ఈ పాట చాలా అద్భుతంగా చిత్రీకరించబడింది మరియు పవన్ కళ్యాణ్ న్యాయవాది ప్రయాణాన్ని చక్కగా అభివర్ణిస్తుంది
Date & Time : 01:30 AM April 09, 2021
-
పవన కళ్యాణ్‌ని ముగ్గురు హీరోయిన్స్ కలవడంతో అతను గతంలో పెద్ద లాయర్ అనే విషయాన్ని రివీల్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ఉనికి, మాటలు, బాడీ లాంగ్వేజ్ చాలా బాగున్నాయి.
Date & Time : 01:10 AM April 09, 2021
-
నివేదా థామస్ మరియు ఆమె స్నేహితులను వేధిస్తున్న వారిపై పోలీసులకు నివేదా ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు నివేదాను అరెస్టు చేయడంతో ఇప్పుడు ఉద్రిక్త దృశ్యాలు జరుగుతున్నాయి.
Date & Time : 01:10 AM April 09, 2021
-
ముగ్గురు హీరోయిన్లను చుట్టుముట్టిన ప్రధాన వివాదం మరింత పెరుగుతోంది. అసలు కథ అయిన పింక్ సినిమా యొక్క ప్రధాన కథాంశాన్ని వకీల్ సాబ్ కలిగి ఉంది.
Date & Time : 01:05 AM April 09, 2021
-
ఇప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఎంట్రీ ఇచ్చారు. అతని పరిచయ సన్నివేశం చాలా స్మూత్‌గా అనిపించింది. పవన్ పరిచయ సన్నివేశానికి తమన్ యొక్క బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా సెట్ అయ్యింది. ఎంట్రీ ఫైట్ కూడా బాగా ప్రదర్శించబడింది.
Date & Time : 12:55 AM April 09, 2021
-
సినిమా కథలో సంఘర్షణ స్థానం ఇప్పుడే మొదలయ్యింది. నివేదా, అంజలి, అనన్య కొంత మంది మగవారితో వాగ్వాదానికి దిగడంతో పెద్ద ఇబ్బందుల్లో పడ్డారు. ముగ్గురు హీరోయిన్లు చాలా చక్కగా ఎమోషన్‌ను పండిస్తున్నారు.
Date & Time : 12:50 AM April 09, 2021
-
మగువా మగువా సినిమాలోని మొదటి పాటతో నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్లా పరిచయ సన్నివేశాలతో సినిమా ప్రారంభమయ్యింది.
Date & Time : 12:40 AM April 09, 2021
-
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ సినిమా ఇప్పుడే మొదలయ్యింది. సినిమా మొత్తం నిడివి 154 నిమిషాలు ఉండబోతుంది.
Date & Time : 12:35 AM April 09, 2021