-
ఓ పాజిటివ్ నోట్ తో అయితే సినిమా సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 11:40 AM November 04, 2022
-
క్లైమాక్స్.. ఓ చిన్న ట్విస్ట్ తో కథనం ఆసక్తిగా కనిపిస్తుంది.
Date & Time : 11:20 AM November 04, 2022
-
ఇప్పుడు ఓ ఎమోషనల్ సాంగ్ ఇద్దరి మధ్య స్టార్ట్ అయ్యింది. వారు మళ్ళీ బ్రేకప్ అయ్యారు. హీరో కొత్త నిర్ణయం ని అయితే తీసుకున్నాడు. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 11:15 AM November 04, 2022
-
ఇప్పుడు లవ్ స్టోరీలో మరో సమస్య వచ్చింది. సంబంధిత కొన్ని సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:10 AM November 04, 2022
-
డీసెంట్ ఫ్యామిలీ డ్రామా కూడా ఈ రొమాంటిక్ సినిమాలో బ్యాలన్సుడ్ గా కనిపిస్తుంది. అలాగే ఈ రెండు కోణాలు కూడా ఇంప్రెసివ్ గా ఉన్నాయి.
Date & Time : 11:00 AM November 04, 2022
-
ఇప్పుడు సినిమాలో మరో రొమాంటిక్ సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో మెయిన్ లీడ్ మధ్య కెమిస్ట్రీ బాగుంది.
Date & Time : 10:50 AM November 04, 2022
-
ఇప్పుడు నటుడు పోసాని ఎంటర్ అయ్యారు. శిరీష్ తల్లిదండ్రులు తనకి పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు. కానీ శిరీష్ మాత్రం లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాడు. ఈ సంబంధిత కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:45 AM November 04, 2022
-
లివ్ ఇన్ రిలేషన్ షిప్ పై కొన్ని కామెడీ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి. సినిమాలో ఆసక్తి మాత్రం అలా కొనసాగుతుంది.
Date & Time : 10:35 AM November 04, 2022
-
సినిమాలో కాన్సెప్ట్ కూడా ఇప్పుడే వచ్చింది. మరికొన్ని కామెడీ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 10:30 AM November 04, 2022
-
సునీల్, వెన్నెల కిషోర్ లు తమ పాత్రల్లో మంచి నటన కనబరుస్తున్నారు. కానీ శిరీష్ అయితే ఈ చిత్రంలో నటుడుగా మరింత పరిణితి చెందినట్టుగా అనిపిస్తుంది.
Date & Time : 10:25 AM November 04, 2022
-
ఇంటర్వెల్ అనంతరం హీరో తన బ్రేకప్ ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్న సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 10:20 AM November 04, 2022
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు సినిమా బాగానే ఉందని చెప్పొచ్చు. రిలేషన్ షిప్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ తో కామెడీ, రొమాన్స్ యాంగిల్స్ బాగున్నాయి. శిరీష్ అలాగే అను లు తమ రోల్స్ లో బాగున్నారు. ట్విస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగున్నాయి. మరి సెకండాఫ్ కూడా ఇంతే నరేషన్ లో ఉంటుందో లేదో చూడాలి.
Date & Time : 10:10 AM November 04, 2022
-
ఓ చిన్న సింపుల్ అండ్ ఎంగేజింగ్ సీన్ తో అయితే సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:05 AM November 04, 2022
-
ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ కీలకమైన సన్నివేశం ఇప్పుడు వస్తుంది.
Date & Time : 10:00 AM November 04, 2022
-
ఓ ఆసక్తికర సన్నివేశం తర్వాత బోరింగ్ బ్రేకప్ సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో శిరీష్ తన డాన్స్ మూమెంట్స్ ప్రదర్శిస్తున్నాడు.
Date & Time : 09:55 AM November 04, 2022
-
ఇప్పుడు కథనంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ రొమాంటిక్ సీన్ తో సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 09:50 AM November 04, 2022
-
ఇప్పుడు సిద్ శ్రీరామ్ పాడిన రొమాంటిక్ నెంబర్ స్టార్ట్ అయ్యింది. ఇందులో మంచి విజువల్స్ కనిపిస్తున్నాయి. అలాగే అను మరింత అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు నటుడు పృథ్వీ ఎంటర్ అయ్యాడు.
Date & Time : 09:45 AM November 04, 2022
-
సినిమాలో కామెడీ చాలా బాగుంది. తన రోల్ కి శిరీష్ న్యాయం చేస్తున్నాడు. అలాగే తన కామెడి టైమింగ్ కూడా బాగుంది.
Date & Time : 09:35 AM November 04, 2022
-
స్క్రీన్ పై ఇప్పుడు వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చాడు. తాను కూడా ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి కాగా పెద్దింటి అమ్మాయి అయినటువంటి అను ని తాను లవ్ లో పడెయ్యాలని ట్రై చేస్తున్నాడు.
Date & Time : 09:25 AM November 04, 2022
-
ఇప్పుడు హీరోయిన్ అను ఇమ్మానుయుయేల్ ఎంట్రీ ఇచ్చింది. ఓ సాంగ్ తో ఆమె గ్లామ్ షో తో కనిపిస్తుంది.
Date & Time : 09:15 AM November 04, 2022
-
ఓ మిడిల్ క్లాస్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా శిరీష్ ఇప్పుడు డీసెంట్ ఎంట్రీ ఇచ్చాడు. నటి ఆమని కూడా ఎంటర్ అయ్యారు. ఆమె శిరీష్ తల్లి గా కనిపిస్తుంది.
Date & Time : 09:05 AM November 04, 2022
-
హాయ్..అల్లు రామలింగయ్య గారికి నివాళులు అర్పిస్తూ సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:00 AM November 04, 2022