-
ఇప్పుడు క్లైమాక్స్ సమయం. ఓ సింపుల్ ఎండింగ్ తో సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:25 AM February 12, 2021
-
ఇపుడు విజయ్ మరియు కృతిల మధ్య ఓ భావోద్వేగపూరిత సన్నివేశం వస్తుంది. ఈ సీన్ లో కృతి చాలా బాగా నటన కనబరుస్తుంది. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 11:15 AM February 12, 2021
-
మరో సాలిడ్ ట్విస్ట్ ఇప్పుడు చోటు చేసుకుంది.ఇపుడు సినిమా షాకింగ్ మలుపులు తిరుగుతుంది. ఎమోషన్స్ మరింత బలంగా మారుతున్నాయి.
Date & Time : 11:05 AM February 12, 2021
-
ఇప్పుడు ఓ ఊహించని ఆసక్తికర ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్ సేతుపతి కథలో చాలా పెద్ద మార్పునే తీసుకొచ్చాడు.
Date & Time : 11:00 AM February 12, 2021
-
ఇప్పుడు ఈ ఇద్దరు జంట చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ అంతటిని ఈశ్వర అనే సాంగ్ ద్వారా చూపిస్తున్నారు.
Date & Time : 10:55 AM February 12, 2021
-
ఇప్పుడు ఇద్దరి జంటపై కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:45 AM February 12, 2021
-
రచన, ఎమోషన్స్ ఇందులో చాలా బలంగా ఉన్నాయి. సింపుల్ కథే కానీ చాలా గ్రిప్పింగ్ గా చూపిస్తున్నారు. నటుల పెర్ఫామెన్స్ కు దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో మేజర్ ప్లస్ అయ్యింది.
Date & Time : 10:40 AM February 12, 2021
-
సినిమా ఇప్పుడు పూర్తిగా సీరియస్ గా మారింది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి. వైష్ణవ్ చాలా బాగా హావభవాలు పలికిస్తున్నాడు.
Date & Time : 10:35 AM February 12, 2021
-
సేతుపతి తన కూతురే ఎవరితో ప్రేమలో ఉందో అతన్ని వెతకడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:30 AM February 12, 2021
-
ఇంటర్వెల్ అనంతరం ప్రేమ బ్రేకప్ అయ్యింది.అలాగే మరింత సీరియస్ నెస్ తో సేతుపతి రోల్ మంచి ఫ్లో లో కనిపిస్తుంది.
Date & Time : 10:20 AM February 12, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు కథ సింపుల్ గానే ఉన్నా నటీనటుల పెర్ఫామెన్స్ మాత్రం అవుట్ స్టాండింగ్ గా ఉంది. పాటలు, కథనం చాలా బాగున్నాయి. మెయిన్ లీడ్ చాలా బాగున్నారు, అలాగే సేతుపతి ఇంటర్వెల్ పాయింట్ కు కథను ఇంకా ఆసక్తిగా మలిచేసాడు. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:10 AM February 12, 2021
-
ఓ ఆసక్తికర సన్నివేశంతో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:05 AM February 12, 2021
-
ఇప్పుడు మరో రొమాంటిక్ నెంబర్ స్టార్ట్ అయ్యింది. మెయిన్ లీడ్ మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించడమే కాకుండా ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగా సెట్ చేశారు.
Date & Time : 10:00 AM February 12, 2021
-
ఇప్పుడు మరో రొమాంటిక్ నెంబర్ స్టార్ట్ అయ్యింది. మెయిన్ లీడ్ మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించడమే కాకుండా ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగా సెట్ చేశారు.
Date & Time : 10:00 AM February 12, 2021
-
ఇప్పుడు ఇంకా ఆసక్తికర సన్నివేశాలు నడుస్తున్నాయి. సేతుపతి వాళ్ళ ప్రేమ కోసం తెలుసుకున్నాడు. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 09:55 AM February 12, 2021
-
ఇపుడు సినిమాలో అన్ని అంశాలు మరింత సీరియస్ అయ్యిపోయాయి. విజయ్ సేతుపతి అక్కడి మత్స్యకారుల భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడు.
Date & Time : 09:50 AM February 12, 2021
-
ఓ గ్రామానికి చెందిన కీలక వ్యక్తిగా సేతుపతి కనిపిస్తున్నాడు. అలాగే కథ ధనిక-పేద, కులానికి సంబంధించి విడదీసినట్టుగా కనిపిస్తుంది. కొన్ని రసవత్తర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:40 AM February 12, 2021
-
ఇప్పుడు మరో హిట్ సాంగ్ కు టైం..ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది.
Date & Time : 09:35 AM February 12, 2021
-
హీరో తండ్రిగా సాయి చంద్ ఇప్పుడు పరిచయం అయ్యాడు. హీరో తన చిన్ననాటి నుంచి హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు. ఇపుడు కొన్ని రొమాంటిక్ అండ్ ఫన్నీ సీన్స్ వస్తున్నాయి. దేవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేసాడు.
Date & Time : 09:30 AM February 12, 2021
-
ఇప్పుడు హీరోయిన్ కృతి శెట్టి ఎంట్రీ అయ్యింది. నాచురల్ గా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ టైంతోనే బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ నీ కన్ను నీలి సముద్రం పాట స్టార్ట్ అయ్యింది. విజువల్స్ చాలా బాగున్నాయి.
Date & Time : 09:20 AM February 12, 2021
-
ఇప్పుడు వైష్ణవ్ ఎంట్రీ ఇచ్చాడు. అతని లుక్, నడవడిక చాలా బాగుంది. ముఖ్యంగా కళ్ళలో తేజస్సు బాగా కనిపిస్తుంది. కొన్ని బీచ్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:10 AM February 12, 2021
-
రాయణమ్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇప్పుడు సాలిడ్ ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని ఆసక్తికర సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 08:50 AM February 12, 2021
-
ఒక సీరియస్ నోట్ తో హీరో సముద్రపు ఒడ్డున స్పృహ లేకుండా ఉన్న సన్నివేశంతో సినిమా ఇప్పుడే మొదలయ్యింది. టైటిల్స్ స్క్రోల్ అవుతున్నాయి.
Date & Time : 08:50 AM February 12, 2021
-
హాయ్..147 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 08:45 AM February 12, 2021