-
ఓ ఇంటెన్స్ క్లైమాక్స్ ఫైట్ తో అయితే సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 07:10 AM May 05, 2023
-
విలన్ దాక్కున్న చోటుకి నరేష్ ఎంటర్ అయ్యాడు. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 06:55 AM May 05, 2023
-
ఓ థ్రిల్లింగ్ యాక్షన్ సీన్ తర్వాత ఈ కిడ్నాప్స్ వెనుకున్న గ్యాంగ్ ని నరేష్ వెంటాడుతున్నాడు. ఇప్పుడు కథనంలో మరో కీలక ట్విస్ట్ రివీల్ అయ్యింది.
Date & Time : 06:45 AM May 05, 2023
-
నరేష్ తన టీం కలిసి క్రిమినల్స్ కోసం ఓ ట్రాప్ ని సెట్ చేసారు. ఇప్పుడు మరో వైలెంట్ ఫైట్ సీన్ మొదలైంది.
Date & Time : 06:40 AM May 05, 2023
-
సినిమా ఇప్పుడు పూర్తిగా సీరియస్ టోన్ లో కొనసాగుతుంది. నరేష్ ఓ ఇంట్రెస్టింగ్ క్లూ ని అయితే పట్టుకున్నాడు.
Date & Time : 06:30 AM May 05, 2023
-
మరో చిన్న ఫ్లాష్ బ్యాక్ తర్వాత నరేష్, శత్రు కలిసి మిస్సింగ్ కేసులపై లోతైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
Date & Time : 06:15 AM May 05, 2023
-
ఇంటర్వెల్ అనంతరం..చిన్న ట్విస్ట్ తో మొదలైన కథనం. నరేష్ ఓ కీలకమైన మిస్సింగ్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు.
Date & Time : 06:00 AM May 05, 2023
-
ఫస్టాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు సినిమా ఓకే అని చెప్పొచ్చు. నరేష్ మరోసారి మంచి పెర్ఫార్మన్స్ ని కనబరిచాడు. అలాగే నేపథ్యం కూడా ఆసక్తి గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ లు కూడా బాగున్నాయి. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 05:55 AM May 05, 2023
-
ఓ ఇంటెన్స్ ఫైట్ తో అయితే సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 05:50 AM May 05, 2023
-
ఓ వైలెంట్ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత కథనంలో మరిన్ని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి.
Date & Time : 05:40 AM May 05, 2023
-
మిర్నా మరియు రౌడీల మధ్య కొన్ని టెన్స్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:30 AM May 05, 2023
-
ఇప్పుడు మరో ఫ్లాష్ బ్యాక్ సీన్ వస్తుంది.. నరేష్ ఓ టీజింగ్ కేసు హ్యాండిల్ చేస్తున్నాడు.
Date & Time : 05:20 AM May 05, 2023
-
నరేష్ పెళ్లి సీన్ తో అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఎస్ ఐ శత్రు మరియు ఇంద్రజల మధ్య సీన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కథనంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
Date & Time : 05:10 AM May 05, 2023
-
కథనంలో ఓ ట్విస్ట్ అనంతరం నరేష్ పై అధికారిగా నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కనిపిస్తున్నారు.
Date & Time : 05:05 AM May 05, 2023
-
ఇప్పుడు దేవేరి సాంగ్ తో హీరోయిన్ మిర్నా నరేష్ భార్య గా పరిచయం అయ్యింది.
Date & Time : 05:00 AM May 05, 2023
-
ఓ సాలిడ్ ఫైట్ సీక్వెన్స్ తో పవర్ఫుల్ పోలీస్ శివ కుమార్ గా అల్లరి నరేష్ ఇప్పుడు పరిచయం అయ్యాడు.
Date & Time : 04:50 AM May 05, 2023
-
డాక్టర్ గా నటి ఇంద్రజ పరిచయం అయ్యారు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ మొదలైంది.
Date & Time : 04:45 AM May 05, 2023
-
ఒక భయంకరమైన కార్ యాక్సిడెంట్ సీన్ తో సినిమా మొదలైంది. ఇందులో నరేష్ తన కుటుంబం కనిపిస్తున్నారు. ఇప్పుడు సీన్స్ హాస్పిటల్ కి షిఫ్ట్ అయ్యాయి. కాస్త సస్పెన్స్ నెలకొంది.
Date & Time : 04:40 AM May 05, 2023
-
హాయ్.. 148 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 04:35 AM May 05, 2023