టాక్సిక్
'Toxic' Live updates in English Version
మొదటి షో వివరాలు : టాక్సిక్
ఒక దిగ్భ్రాంతికరమైన నిజం తెలుస్తోంది. ఆ తర్వాత మరిన్ని యాక్షన్ సన్నివేశాలు సాగుతాయి. మొత్తానికి సినిమా అకస్మాత్తుగా ముగుస్తుంది. సినిమా సమాప్తం. పూర్తి సమీక్ష కోసం ఇక్కడ చూడండి.
ఓ తీవ్రమైన ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ కొనసాగుతూ, ఒక షాకింగ్ ట్విస్ట్ కు లీడ్ తీసుకుంది.
కొన్ని ఉత్కంఠభరితమైన సంఘటనల తర్వాత, యశ్ మరియు అతని కుమారుడు ఒక ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశంలో తలపడతారు.
యశ్ కుమారుడు 'టికెట్' ఒక భీకరమైన యాక్షన్ సన్నివేశంతో పరిచయం అయ్యాడు. ఈ యాక్షన్ సీక్వెన్స్ తండ్రీకొడుకుల మధ్య పోరుకు వేదికను సిద్ధం చేస్తుంది.
రుక్మిణి వసంత్ పాత్ర పరిచయం అవుతుంది, అలాగే యశ్ కి ఆమెకు మధ్య సన్నివేశాలు సాగుతున్నాయి.
కథ మకావుకు మారుతుంది; అక్కడ కియారా యశ్ లేని లోటును భరిస్తూ.. అతని రాక కోసం ఎదురుచూస్తుంటుంది. ఆ తర్వాత కథ తిరిగి వర్తమానానికి వస్తుంది.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ :- ఇప్పటివరకు సినిమా జస్ట్ ఏవరేజ్ స్థాయిలోనే ఉంది. ఐతే, యశ్ స్టైలిష్‌గా కనిపించారు, అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా కొంతవరకు బాగానే ఆకట్టుకున్నాయి. ఇక కియారా అద్వానీకి ఈ సినిమాలో బలమైన పాత్ర రూపంలో మంచి అవకాశం లభించింది. మరి ఈ సినిమా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
కథలో మరో షాకింగ్ ట్విస్ట్ ఇంటర్వెల్ కి దారితీస్తుంది.
యశ్, కియారా విషయంలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు, ఐతే, ఈ నిర్ణయం ఒక ఊహించని మలుపుతో పాటు మరో గందరగోళానికి కూడా దారితీస్తుంది. మొత్తానికి సినిమా ఉత్కంఠతో సాగుతుంది.
యశ్ వ్యక్తిగత జీవితంలో మరికొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. ఈ క్రమంలో మధ్యలో 'తబాహి' (Tabahi) పాట వస్తూ ఉంది.
యశ్ పై మరొక భయంకరమైన దాడి జరగడానికి ముందు, యశ్ - కియారాకు మరింతగా దగ్గరవుతాడు. ఐతే, ఆ దాడి మహిళలతో కూడిన ఒక హింసాత్మకమైన భారీ ఫైట్ కి దారితీస్తుంది.
కియారా సర్కస్‌లో యశ్ మరియు అతని గ్యాంగ్ పై దాడి జరిగింది. ఈ దాడి కియారా పై అనుమానాలను రేకెత్తిస్తూ, మరో యాక్షన్ సన్నివేశానికి దారి తీస్తోంది.
యశ్ వ్యాపార సామ్రాజ్యంతో పాటు అతనికున్న ఆధిపత్యం ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఈ కథను మోషన్ లో నడిపిస్తున్నారు.
కథ 1947 గోవాకు మారుతుంది, అక్కడ ఒక ఉత్కంఠభరితమైన ఫైట్ తో యశ్ మాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వెంటనే నయనతార క్యారెక్టర్ కూడా ఎంట్రీ ఇచ్చింది.
కియారా అద్వానీతో సినిమా ప్రారంభమైంది. ఆమె తన బిడ్డతో మాట్లాడుతూ ఉంది. అంతలో ఒక షాకింగ్ సంఘటన జరుగుతుంది, ఆ తర్వాత సినిమా టైటిల్ వచ్చింది.
మూవీ ఇప్పుడే మొదలైంది. 194 నిమిషాలు నిడివి ఉంది.