-
మొత్తానికి సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 07:40 AM October 20, 2023
-
ఇపుడు చిత్రం మరింత ఆసక్తికరంగా మారింది. పోలీసులు సహా విలన్స్ కూడా టైగర్ నాగేశ్వరరావుని పట్టుకునేందుకు ఏదో ఊహించనిది ప్లాన్ చేస్తున్నారు.
Date & Time : 07:30 AM October 20, 2023
-
ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు ని పట్టుకునేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తు ఓ ట్రాప్ ని వేశారు. సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.
Date & Time : 07:20 AM October 20, 2023
-
ఇప్పుడు నటి రేణు దేశాయ్ హేమలత లవణం గా పరిచయం అయ్యారు. ఆమె ఓ సోషల్ రిఫార్మర్ కాగా ఆమె సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 07:10 AM October 20, 2023
-
ఇప్పుడు సినిమా డీసెంట్ గా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇచ్చేసుకుంటాలే సాంగ్ మొదలైంది.
Date & Time : 07:00 AM October 20, 2023
-
విలన్ కి టైగర్ నాగేశ్వరరావు ఇచ్చిన ఓ స్ట్రాంగ్ వార్నింగ్ సీన్ తర్వాత నటుడు జిస్సు సేన్ గుప్తా స్క్రీన్ పైకి వచ్చాడు.
Date & Time : 06:55 AM October 20, 2023
-
మొత్తానికి మరో హీరోయిన్ గాయత్రీ భరద్వాజ్ ఇప్పుడు పరిచయం అయ్యింది.
Date & Time : 06:50 AM October 20, 2023
-
ప్రస్తుతం మరో మాస్ యాక్షన్ సీక్వెన్స్ టైగర్ నాగేశ్వరరావు మరియు విలన్స్ నడుమ మొదలైంది. ఈ సీక్వెన్స్ మాంచి ఇంటెన్స్ గా ఉంది.
Date & Time : 06:40 AM October 20, 2023
-
ఇప్పుడు నాగేశ్వరరావు మరియు స్టువర్ట్ పురంలో ఉన్న కొందరి యువత మధ్య ఓ ఎమోషనల్ సన్నివేశం వస్తుంది.
Date & Time : 06:30 AM October 20, 2023
-
టైగర్ నాగేశ్వరరావు పై మరిన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:20 AM October 20, 2023
-
ఇంటర్వెల్ అనంతరం.. స్టువర్ట్ పురంలో పోలీసుల అరాచకాలపై అలాగే అనుపమ్ ఖేర్ టైగర్ నాగేశ్వరరావు ని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న సీన్స్ తో మొదలైంది.
Date & Time : 06:10 AM October 20, 2023
-
ఫస్టాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా పర్వాలేదు అని చెప్పొచ్చు. కాస్త స్లో గా ఉన్నా పలు ఇంట్రెస్టింగ్ సీన్స్ బాగున్నాయి. టైగర్ నాగేశ్వరరావు గా రవితేజ ఇంప్రెస్ చేసాడు. మ్యూజిక్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 06:05 AM October 20, 2023
-
ఆ వివిఐపీ టైగర్ నాగేశ్వరరావు ని పట్టుకోవాలని ట్రై చేసే సీక్వెన్స్ తో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 06:00 AM October 20, 2023
-
ఇప్ఫడు టైగర్ నాగేశ్వరరావు పై ఇంట్రెస్టింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సీన్ కనిపిస్తుంది. ఓ వివిఐపీ దగ్గర దొంగతనం చేసేందుకు సన్నద్ధం అవుతున్న సీక్వెన్స్ మొదలైంది.
Date & Time : 05:55 AM October 20, 2023
-
ఆ దొంగతనం సీన్ తో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ కథనంలో చోటు చేసుకుంది.
Date & Time : 05:45 AM October 20, 2023
-
ఆ సాంగ్ అనంతరం సినిమా ఇప్పుడు సీరియస్ టోన్ లోకి మారింది. ఇప్పుడు నాగేశ్వరరావు తన ముఠాతో ఓ కంటైనర్ లోని బంగారాన్ని కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. దీనితో ఓ ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ మొదలైంది.
Date & Time : 05:35 AM October 20, 2023
-
ఇప్పుడు హీరోయిన్ నుపూర్ సనన్ ఎంట్రీ ఇవ్వగా ఆమెని ఇంప్రెస్ చెయ్యడానికి టైగర్ నాగేశ్వరరావు కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఏక్ దం సాంగ్ మొదలైంది.
Date & Time : 05:20 AM October 20, 2023
-
ఇప్పుడు నాగేశ్వరరావు స్టువర్ట్ పురం ప్రాంతంలోనే ఒక తెలివైన దొంగగా మారిపోయాడు. ఈ క్రమంలో తనపై మొదటి సాంగ్ వీడు మొదలైంది.
Date & Time : 05:10 AM October 20, 2023
-
ఇప్పుడు నటుడు నాజర్ స్టువర్ట్ పురం నాగేశ్వరరావు కి గురువుగా పరిచయం అయ్యారు. తరువాత మరికొందరు దోపిడీ దొంగలకి సంబంధించిన సన్నివేశాలు మొదలయ్యాయి.
Date & Time : 05:00 AM October 20, 2023
-
ఓ మాసివ్ ఇంట్రో అనంతరం స్టువర్ట్ పురం నాగేశ్వరరావు పై మరో ఫ్లాష్ బ్యాక్ సీన్ మొదలైంది.
Date & Time : 04:50 AM October 20, 2023
-
ఓ మాసివ్ అడ్వెంచర్ దొంగతనం సీక్వెన్స్ తో మాస్ మహారాజ రవితేజ స్టువర్ట్ పురం నాగేశ్వరరావు గా అదిరిపోయే ఎంట్రీ ఇప్పుడు ఇచ్చాడు.
Date & Time : 04:40 AM October 20, 2023
-
ఇప్పుడు చిత్రం 1980వ దశకంలో నటుడు మురళీ శర్మ నటుడు అనుపమ్ ఖేర్ ల మధ్య ఓ కీలక మీటింగ్ జరుగుతున్న సీక్వెన్స్ తో మొదలైంది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్.
Date & Time : 04:35 AM October 20, 2023
-
హాయ్..2 గంటల 52 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 04:30 AM October 20, 2023