థగ్ లైఫ్

Thug Life

Thug Life

Pre Release Event

Thug Life

Trailer Launch Event

Thug Life

Videos

మొదటి షో వివరాలు : థగ్ లైఫ్

మొత్తానికి సినిమా పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.

Date & Time : 11:54 AM June 05, 2025

ఒక కమల్ తన గతం నుంచి శింబుకి సంబంధించిన ఒక షాకింగ్ నిజాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు ఇద్దరి నడుమ యుద్ధం మొదలైంది.

Date & Time : 11:40 AM June 05, 2025

ఒక షాకింగ్ ఇన్సిడెంట్ తో శింబు కమల్ పై మరింత కోపాన్ని పెంచుకుంటున్నాడు.

Date & Time : 11:25 AM June 05, 2025

కమల్ కి అశోక్ సెల్వన్ ఒక ఆఫర్ చేశారు. కానీ తను మాత్రం మరొకటి తిరిగి ఆశిస్తున్నారు. ఈ హంట్ కొనసాగుతుంది

Date & Time : 11:10 AM June 05, 2025

కమల్ పై ఇపుడు అటాక్ జరిగింది. ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రంగం సిద్ధం అవుతుంది. తనని మోసం చేసినవారిని కమల్ ఇపుడు వేటాడుతున్నారు.

Date & Time : 10:55 AM June 05, 2025

ఇంటర్వెల్ అనంతరం.. కొత్త అవతార్ లో కమల్ ఇప్పుడు కనిపిస్తున్నారు. అలాగే ఫోకస్ అశోక్ సెల్వన్ వైపుకి కూడా మారింది. తన మాజీ భార్యగా ఐశ్వర్య లెక్ష్మి ఇప్పుడు ఎంటర్ అయ్యింది.

Date & Time : 10:42 AM June 05, 2025

ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పుడు వరకు సినిమా జస్ట్ ఓకే రేంజ్ లో సాగింది. కమల్ ఊహించినట్టే షైన్ అయ్యారు. కొన్ని సీన్స్ కూడా బాగున్నాయి. సెకండాఫ్ అన్ని అంశాలని డిసైడ్ చేస్తుంది. అదెలా ఉంటుందో చూడాలి.

Date & Time : 10:32 AM June 05, 2025

ఊహించినట్టుగానే ఒక ట్విస్ట్ ఇప్పుడు చోటుచేసుకుంది. ఇలా సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.

Date & Time : 10:28 AM June 05, 2025

ఎస్సై గా అశోక్ సెల్వన్ ఇప్పుడు ఎంటర్ అయ్యారు. అమర్ పై కమల్ అనుమానం ఎక్కువ అవుతుంది కానీ కారణం అతను కాదని తెలుసుకున్నారు. ఇప్పుడు అమర్ పై మరికొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తర్వాత కథనం మరో గేర్ లోకి మారింది.

Date & Time : 10:22 AM June 05, 2025

అమర్ తన చుట్టు పక్కల ఉన్నవారి వల్ల ప్రభావితం అవుతున్నాడు. ఇప్పుడు కమల్, శింబు నడుమ కొన్ని ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి.

Date & Time : 10:11 AM June 05, 2025

ఫ్యామిలీ సెలబ్రేషన్ సాంగ్ జింగుచ్చా తర్వాత కమల్ కొన్ని కీలక అంశాలు పసిగట్టారు. సడెన్ గా తనపై తన గ్యాంగ్ పై ఒక మెరుపు దాడి జరిగిన సన్నివేశాలు వస్తున్నాయి.

Date & Time : 10:03 AM June 05, 2025

కమల్, త్రిషలపై కొన్ని సీన్స్ తర్వాత ఇప్పుడు కమల్ కుటుంబానికి చెందిన సన్నివేశాలు వస్తున్నాయి.

Date & Time : 09:53 AM June 05, 2025

ఇప్పుడు షుగర్ బేబీ సాంగ్ తో హీరోయిన్ త్రిష ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఒక కీలక మూమెంట్ తో కమల్ నమ్మకానికి వ్యతిరేకంగా శింబు ఒక డీల్ చేస్తున్నాడు.

Date & Time : 09:43 AM June 05, 2025

ఇప్పుడు కమల్, శింబులు ఆమె మరణానికి కారణమైన వారిని శిక్షించారు. ఇప్పుడు రెండు గ్యాంగ్స్ నడుమ కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా మరో కొత్త అధ్యాయం కథనంలో మొదలైంది.

Date & Time : 09:33 AM June 05, 2025

ఒక కీలక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత కథ ఇపుడు 2016 కి షిఫ్ట్ అయ్యింది. ఒకమ్మాయి ఆత్మహత్యా ఘటన యాక్షన్ ఎపిసోడ్ కి దారి తీయడంతో శింబు ఈ సీన్ తో ఎంట్రీ ఇచ్చాడు.

Date & Time : 09:23 AM June 05, 2025

కమల్ పై ఒక వివరణాత్మక ఇంట్రో తర్వాత కథ 1994కి షిఫ్ట్ అయ్యింది. ఢిల్లీలో యంగ్ లుక్స్ లో కమల్ కనిపిస్తున్నారు.

Date & Time : 09:13 AM June 05, 2025

హాయ్.. 2 గంటల 45 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.

Date & Time : 09:03 AM June 05, 2025