-
క్లైమాక్స్ టైం.. ఒక చిన్న ఎమోషనల్ సన్నివేశంతో సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 10:55 AM March 27, 2021
-
ఇప్పుడు అన్ని అంశాలు ఒక స్టాండర్డ్స్ వచ్చేసాయి. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 10:50 AM March 27, 2021
-
ఇప్పుడు అంశాలు అన్నీ కాస్త బెటర్ గా మారుతున్నాయి. హీరోయిన్ కి కూడా హీరో పై ఇంప్రెస్ ఏర్పడింది. ముందు పెళ్లి వద్దనుకున్న వారే తమ పెళ్ళికి ప్రేమలో పడ్డారు.
Date & Time : 10:45 AM March 27, 2021
-
శ్రీ సింహా అలాగే మిషా లు తమ రోల్స్ లో బాగా కనిపిస్తున్నారు. అలాగే వైవా హర్ష కూడా తన రోల్ లో మంచి ఫన్ ను జెనరేట్ చేస్తున్నాడు.
Date & Time : 10:35 AM March 27, 2021
-
ఇప్పుడు సినిమా మరో రూట్ లోకి వెళ్ళింది. నటుడు విజయ్ ఇప్పుడు స్క్రీన్ పైకి వచ్చాడు.
Date & Time : 10:30 AM March 27, 2021
-
ఇప్పుడు హీరో మిషా నరాంగ్ కు దగ్గరవుతున్నాడు. ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 10:25 AM March 27, 2021
-
ఇప్పుడు సినిమా మరిన్ని మలుపులు తీసుకుంటుంది దీనితో మరిన్ని సన్నివేశాలు యాడ్ అవుతున్నాయి.
Date & Time : 10:20 AM March 27, 2021
-
హీరోయిన్ తండ్రిగా రాజీవ్ కనకాల కనిపిస్తున్నారు. తన రోల్ లో చాలా బాగా చేస్తున్నారు.
Date & Time : 10:15 AM March 27, 2021
-
ఇంటర్వెల్ అనంతరం ఓ ఫన్నీ ట్విస్ట్ రివీల్ అయ్యింది.. ఇప్పుడు హీరో తన మాజీ ప్రియురాలికి మరియు పెళ్లి కూతురు మధ్యలో ఇరుక్కున్నాడు.. ఈ కామెడీ యాంగిల్ బాగుంది.
Date & Time : 10:00 AM March 27, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు పర్వాలేదని చెప్పాలి. కథ మరియు కామెడీ డీసెంట్ గా ఉన్నాయి. ప్రీ ఇంటర్వెల్ కు కాస్త స్లో అనిపించింది. సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 09:45 AM March 27, 2021
-
ఇంటర్వెల్ టైం.. హీరో మరో అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి రెడీ అయ్యిన టైం లో తన ఎక్స్ వచ్చి మొత్తం పరిస్థితి మార్చేసింది. ఇప్పుడు విరామం.
Date & Time : 09:45 AM March 27, 2021
-
మొత్తానికి మెయిన్ లీడ్ కు బ్రేకప్ అయ్యింది. అలాగే ఓ ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. ఇలా సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 09:35 AM March 27, 2021
-
వైవా హర్ష కామెడీ కూడా బాగుంది.. ఇప్పుడు ఓ ఫన్ బాచిలర్ సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:30 AM March 27, 2021
-
ఇప్పుడు ఈ లవ్ స్టోరీలో చిన్నపాటి అలజడి స్టార్ట్ అయ్యింది. అది కూడా కామెడీ యాంగిల్ లోనే చూపించబడుతుంది. శ్రీ సింహ తన రోల్ లో బాగా చేస్తున్నాడు.
Date & Time : 09:25 AM March 27, 2021
-
ఇపుడు మెయిన్ లీడ్ మధ్య కొన్ని రొమాంటిక్ అండ్ ఫన్ సీన్స్ వస్తున్నాయి. కామెడీ యాంగిల్ బాగుంది.
Date & Time : 09:20 AM March 27, 2021
-
ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోకి వెళ్ళింది. ఓ డాక్టర్ గా చిత్ర శుక్ల ఇప్పుడు పరిచయం అయ్యింది.
Date & Time : 09:05 AM March 27, 2021
-
పెళ్లి కూతురిలా హీరోయిన్ మినీషా నరాంగ్ ఇప్పుడు పరిచయం అయ్యింది. కానీ తాను ఈ పెళ్లి నుంచి తప్పించుకోడానికి ట్రై చేస్తుంది. అలాగే కమెడియన్ సత్య కూడా ఇప్పుడు యాడ్ అయ్యాడు.
Date & Time : 08:55 AM March 27, 2021
-
ఓ పెళ్లి సీన్ తో సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. హీరో శ్రీ సింహ పెళ్లి కొడుకుగా పరిచయం అయ్యాడు.
Date & Time : 08:50 AM March 27, 2021
-
హాయ్..120 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 08:45 AM March 27, 2021