ది రాజా సాబ్

The Raja Saab

The Raja Saab

Release Press Meet

The Raja Saab

Pre-Release Event

The Raja Saab

Movie Stills

The Raja Saab

Videos

మొదటి షో వివరాలు : ది రాజా సాబ్

ఓ హ్యాపీ నోట్‌తో సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవండి.

Date & Time : 09 Jan, 2026, 12:47 AM

మొసలితో ప్రభాస్ ఫైట్ చేస్తున్నాడు. దీంతో సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంటోంది.

Date & Time : 09 Jan, 2026, 12:40 AM

సంజయ్ దత్ ప్లాన్‌ను ప్రభాస్ పసిగడతాడు. ఇప్పుడు కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ వస్తున్నాయి.

Date & Time : 09 Jan, 2026, 12:26 AM

కొన్ని కీలక సన్నివేశాల తర్వాత ఇప్పుడు చార్ట్‌బస్టర్ ‘నాచె నాచె’ సాంగ్ వస్తుంది.

Date & Time : 09 Jan, 2026, 12:07 AM

సైకియాట్రిస్ట్ పాత్రలో బొమన్ ఇరాని ఎంట్రీ ఇచ్చాడు.

Date & Time : 08 Jan, 2026, 11:57 PM

ఇప్పుడు సినిమాలో ట్రయాంగిల్ లవ్‌కు సంబంధించిన సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 08 Jan, 2026, 11:40 PM

ప్రభాస్, మాళవిక, విటివి గణేష్, సత్య, ప్రభాస్ శ్రీనులకు సంబంధించి మహల్‌లో కొన్ని సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 08 Jan, 2026, 11:27 PM

ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా పర్వాలేదు. కామెడీ కొంతమేర వర్క్ అయింది. ప్రభాస్ బాగా చేశాడు. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

Date & Time : 08 Jan, 2026, 11:17 PM

సంజయ్ దత్ - ప్రభాస్ ఎదురుపడే సీన్‌తో సినిమా ఇంటర్వెల్‌కు చేరుకుంది.

Date & Time : 08 Jan, 2026, 10:57 PM

జరీనా వాహబ్‌కు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ వస్తుంది. కథకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.

Date & Time : 08 Jan, 2026, 10:47 PM

ప్రభాస్, మాళవిక మోహనన్ మధ్య కొన్ని ఫన్ మూమెంట్స్ తర్వాత కథ సీరియస్ గా మారుతుంది.

Date & Time : 08 Jan, 2026, 10:37 PM

‘సహాన’ పాట తర్వాత విటివి గణేష్, సముథ్రఖని పరిచయం అయ్యారు.

Date & Time : 08 Jan, 2026, 10:27 PM

కథ ఇప్పుడు చార్మినార్ ప్రాంతానికి షిఫ్ట్ అయింది. నిధి అగర్వాల్ ఓ నన్‌గా పరిచయమైంది.

Date & Time : 08 Jan, 2026, 10:17 PM

రిద్ధి కుమార్, జరీనా వాహబ్ పరిచయం అయ్యారు. సంజయ్ దత్‌కు సంబంధించిన సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 08 Jan, 2026, 10:07 PM

ప్రభాస్ ఒక సింపుల్ ఎంట్రీతో రాగా, ఇప్పుడు ‘రెబల్ సాబ్’ సాంగ్ వస్తుంది.

Date & Time : 08 Jan, 2026, 09:58 PM

కొన్ని హారర్ అంశాలతో మొదలైన సినిమాలో కమెడియన్ సత్య ఓ మహల్‌లోకి ప్రవేశించాడు.

Date & Time : 08 Jan, 2026, 09:50 PM

మాస్ టైటిల్ కార్డ్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్.

Date & Time : 08 Jan, 2026, 09:47 PM

హాయ్.. ‘ది రాజా సాబ్’ ప్రీమియర్ షో నుండి లైవ్ అప్డేట్స్ మీ కోసం. 3 గంటల 9 నిమిషాల నిడివిగల ఈ సినిమా ఇప్పుడే మొదలైంది.

Date & Time : 08 Jan, 2026, 09:43 PM