'ది ప్యారడైజ్'

The Paradise

The Paradise

Pre-Release Event

The Paradise

Stills

The Paradise

Video

మొదటి షో వివరాలు : 'ది ప్యారడైజ్'

ఒక ఎమోషనల్ నోట్ తో సినిమా ముగుస్తుంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.

Date & Time : 24 Sep, 2026, 12:35 AM

ఒక ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్ తో సవారి తెగ తిరగబడుతుంది. వారి డిమాండ్లకు ఒక ట్విస్ట్ తో సమాజం తలవంచుతుంది.

Date & Time : 24 Sep, 2026, 12:30 AM

మోహన్ బాబు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సవారి తెగకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటాడు. దీంతో వారంతా అయోమయంలో పడతారు. ఇప్పుడు కొన్ని ఇంటెన్స్ సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 24 Sep, 2026, 12:10 AM

ఒక మాసివ్ ఫేస్-ఆఫ్ తర్వాత నాని ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. దీంతో ప్యారడైజ్‌లో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. తెలంగాణకు సంబంధించిన ఓ ప్రముఖ వ్యక్తి ఎంట్రీ ఇస్తారు. ఇప్పుడు ‘యేష నాగుల’ పాట వస్తుంది.

Date & Time : 23 Sep, 2026, 11:55 PM

నానితో పాటు అతడి మనుషులపై మోహన్ బాబు తన క్రూరత్వాన్ని చూపిస్తాడు. అయితే, నాని తిరగబడటంతో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చోటు చేసుకుంటుంది.

Date & Time : 23 Sep, 2026, 11:40 PM

షాకింగ్ ఇంటర్వెల్ తర్వాత, సెకండాఫ్ తల్లి కొడుకు మధ్య ఎమోషనల్ సంభాషణతో మొదలవుతుంది.

Date & Time : 23 Sep, 2026, 11:20 PM

ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా డీసెంట్‌గా సాగింది. నాని చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. సోనాలి కుల్కర్ణి తన నటనతో ఇంప్రెస్ చేస్తుంది. కయాదు పాత్ర ఆకట్టుకోగా రాఘవ్ జుయల్ విలన్‌గా ఇంప్రెస్ చేస్తాడు. ఇంటర్వెల్ బ్లాక్‌ను చక్కగా ఎగ్జిక్యూట్ చేశారు. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

Date & Time : 23 Sep, 2026, 11:10 PM

ఒక ఎమోషనల్ ఫైట్‌తో కథ నాని వర్సెస్ మోహన్‌బాబు లా మారుతుంది. ఇప్పుడు ఇంటర్వెల్.

Date & Time : 23 Sep, 2026, 11:05 PM

ఒక అనుకోని ఘటనతో మోహన్ బాబు కోపానికి గురవుతాడు. నాని తల్లికి సంబంధించిన ఎమోషనల్ నేపథ్యం సాగుతుంది. ఇప్పుడు కథ ఇంటర్వెల్‌కు చేరుకుంటుంది.

Date & Time : 23 Sep, 2026, 10:50 PM

నాని, రాఘవ్ జుయల్ మధ్య ఓ చిన్న గొడవ లిబర్టీ కేఫీలో ఫైట్‌కు దారి తీస్తుంది. కయాదు సీక్రెట్ లైఫ్ గురించి నాని తెలుసుకుంటాడు.

Date & Time : 23 Sep, 2026, 10:35 PM

సుబ్బు పాత్రలో కయాదు లోహర్ పరిచయం అయింది. నానితో ఆమె స్నేహం చేయడంతో వారి మధ్య బంధం ఏర్పడుతుంది.

Date & Time : 23 Sep, 2026, 10:20 PM

చోటా మాలిక్‌గా రాఘవ్ జుయల్ పరిచయం అయ్యాడు. టైటిల్ కార్డ్ రావడంతో ‘ఆయా షేర్’ పాటకు సమయం ఆసన్నమైంది.

Date & Time : 23 Sep, 2026, 10:05 PM

మోహన్ బాబు క్రూరత్వం, జడల్ పసితనం, వారి జాతి అణచివేతకు గురయ్యే సన్నివేశాలు వస్తున్నాయి. కథ ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత సమయానికి షిఫ్ట్ అవుతుంది. ఒక జైల్ ఫైట్‌తో నాని అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.

Date & Time : 23 Sep, 2026, 09:50 PM

సవారి జాతి గురించి సమ్మక్క వాయిస్ తో 'ది ప్యారడైజ్' ప్రపంచం పరిచయం అవుతుంది. శిఖంజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చారు.

Date & Time : 23 Sep, 2026, 09:35 PM

హాయ్.. 2 గంటల 54 నిముషాలు నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.

Date & Time : 23 Sep, 2026, 09:30 PM