ది గర్ల్ ఫ్రెండ్
'The Girl Friend' Live updates in English Version
మొదటి షో వివరాలు : ది గర్ల్ ఫ్రెండ్
ఇంట్రెస్టింగ్ నోట్‌తో సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
అన్ని అంశాలు రష్మికకు వ్యతిరేకంగా మారుతుండటంతో ఆమె ప్రవర్తనలో తీవ్ర మార్పు వస్తుంది. కథ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది.
రష్మిక రిలేషన్ మరింత ఘోరంగా మారుతుంది. తనను తాను కోల్పోయినట్లు, బంధం అనే ఉచ్చులో ఇరుక్కున్నట్ల భావిస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ ని ఎదిరించడం హింసకు దారి తీస్తుంది.
రష్మిక తండ్రి రావు రమేష్ ఆమె రిలేషన్‌షిప్ గురించి తెలుసుకుంటాడు. తన బాయ్‌ఫ్రెండ్‌ను తండ్రి మందలించడంతో ఆమె మరింత అయోమయానికి గురవుతుంది.
నదివే నదివే అనే పాటతో సెకండ్ హాఫ్ మొదలైంది. రష్మిక తన ఎమోషన్స్ తో ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా పర్వాలేదు. రష్మిక పర్ఫార్మెన్స్ డీసెంట్‌గా ఉంది. దీక్షిత్ శెట్టి తన పాత్రలో మెప్పించాడు. కొన్ని సీన్స్ బాగా హ్యాండిల్ చేశారు. మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
రిలేషన్‌షిప్ తాను అనుకున్నట్లుగా ఉండదని రష్మిక క్రమంగా గ్రహిస్తుంది. తన బాయ్‌ఫ్రెండ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుని ఆమెలో భయం మొదలవుతుంది. దీంతో ఆమె డైలమాలో పడుతుంది. ఇప్పుడు ఇంటర్వెల్ కార్డు పడింది.
రష్మిక, అను ఇమ్మాన్యుయెల్ మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. ఇప్పుడు వారి స్నేహానికి సంబంధించి కొన్ని మూమెంట్స్ వస్తున్నాయి.
కొన్ని లవ్లీ మూమెంట్స్ తర్వాత, వారి మధ్య కొంత విభేదం ఏర్పడుతుంది.
ఓ ఘటనతో దీక్షిత్, రష్మిక దగ్గరవుతారు. వారు సన్నిహితంగా కలిసి ఉండటంతో ఒకరినొకరు ప్రేమిస్తారు.
రష్మిక మందన్న ఒక చక్కటి ఎంట్రీ ఇచ్చింది. దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయెల్ కూడా పరిచయమయ్యారు.
హాయ్.. 2 గంటల 18 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.