
మొదటి షో వివరాలు : తమ్ముడు
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
ఒక ఊహించని ఘటనతో సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
ఈ వేట కొనసాగుతున్న సమయంలో కీలక పాత్ర ఒకటి విషాదంతో ముగుస్తుంది. వీటితోనే యాక్షన్ కొనసాగుతుంది.
నితిన్ తన అక్క కుటుంబం కోసం ఎదురయ్యే ప్రమాదంకి అడ్డంగా నిలబడ్డాడు. ఓ యాక్షన్ సన్నివేశం కొనసాగుతుంది.
ఇంటర్వెల్ అనంతరం.. నితిన్, లయ కుటుంబంపై అంబరగుడి తెగలు వారు వేట కొనసాగిస్తున్నారు.
ఓ యాక్షన్ సన్నివేశం తర్వాత లయ బ్యాక్ స్టోరీతో తన నిజాయితీ, ఆమె ఇచ్చిన ఒక మాట తర్వాత సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
నితిన్, లయలు కొన్ని ఊహించని ఘటనతో కలిశారు కానీ ఇద్దరూ దారి తప్పి సాయం కోసం ట్రై చేయగా వారికి సాయం చేసే అమ్మాయిగా సప్తమి గౌడ ఎంటర్ అయ్యింది. ఈ సన్నివేశాలతో భూ అంటూ సాంగ్ మొదలైంది.
కొన్ని కీలక సన్నివేశాలు తర్వాత ఝాన్సీ కిరణ్మయి పరిచయం అయ్యారు. ఇపుడు ఆమె కుటుంబంపై ఓ అటాక్ జరిగిన సన్నివేశాలు వస్తున్నాయి.
జై గా నితిన్ ఆర్చరీలో వరల్డ్ ఛాంపియన్ గా నిలవాలనే పాత్రలో పరిచయం అయ్యాడు. వర్ష బొల్లమ్మ కూడా పరిచయం అయ్యింది. ఇద్దరి నడుమ సన్నివేశాలు వస్తున్నాయి.
వైజాగ్ లో ఒక ఫ్యాక్టరీ భారీ పేలుడుతో విషాదం ఏర్పడింది. అందుకు కారణమైన వ్యవస్థాపకుడు సౌరబ్ సచ్ దేవా పై కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.
హాయ్.. 154 నిమిషాల నిడివి గల తమ్ముడు సినిమా ఇప్పుడే మొదలవుతుంది.