
మొదటి షో వివరాలు : ‘తెలుసు కదా’
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
ఇప్పుడు ముగ్గురు మధ్య ఓ ఎమోషనల్ మూమెంట్ తో సినిమా క్లైమాక్స్ కి చేరుకుంటుంది.
ఇప్పుడు కథనంలో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ తర్వాత ముగ్గురు మధ్య ఓ సీరియస్ డిస్కషన్ జరుగుతుంది.
ప్రస్తుతం ముగ్గురు మధ్య నెలకొన్న ప్రశ్నార్ధక పరిస్థితిలో రాశిఖన్నా సఫర్ అవుతుంది. ఆమెపై కొన్ని ఫ్యామిలి సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
ఇప్పుడు రాశిఖన్నా, సిద్ధూకి ఒక ఊహించని స్ట్రోక్ ఇవ్వడంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ఈ క్రమంలో బాబాయ్ సాంగ్ మొదలైంది.
ఇంటర్వెల్ అనంతరం.. అంతా బాగుంది అనుకున్న టైంలో ముగ్గురు మధ్య ఓ సీరియస్ అండ్ ఫన్ తో కూడిన సీక్వెన్స్ వస్తుంది.
ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పటి వరకు సినిమా ఓకే రేంజ్ లో సాగింది. సిద్ధూ రోల్ యువతని ఆకట్టుకునేలా ఉంది. హీరోయిన్స్ ఇద్దరూ తమ రోల్ లో బాగా చేశారు. వైవా హర్ష కామెడీ ట్రాక్స్ బాగున్నాయి. థమన్ స్కోర్ కూడా బాగుంది. ఇక సెకాండఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
శ్రీనిధి రాశి, సిద్ధూల బిడ్డ కోసం ఓ డెసిషన్ తీసుకుంది. సో ఈ ముగ్గురూ కలిసి కొత్త జర్నీ స్టార్ట్ చేసే సీన్స్ తో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
సిద్ధూ రోల్ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అలాగే ప్రస్తుతం సిద్ధూ, శ్రీనిధి శెట్టిల ట్రాక్ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. థమన్ స్కోర్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేస్తుంది.
సిద్ధూ, రాశి మధ్య ఓ ఊహించని ఎమోషనల్ టర్న్ తర్వాత ఐ వి ఆర్ డాక్టర్ గా శ్రీనిధి శెట్టి ఎంట్రీ ఇచ్చింది. ఆమె సిద్ధూ ఎక్స్.. ప్రస్తుతం సినిమా ఫ్లాష్ బ్యాక్ కి మారి సొగసు చూడ తరమా సాంగ్ మొదలైంది.
పెళ్లి చూపులు కోసం కలసిన సిద్ధూ, రాశిఖన్నా పెళ్లితో ఒకటయ్యారు. వీరి రిలేషన్ షిప్ పై ఇప్పుడు మల్లిక గంధ సాంగ్ వస్తుంది.
సిద్ధూ, వైవా హర్ష మధ్య కొన్ని ఫన్ సీన్స్ తర్వాత హీరోయిన్ రాశిఖన్నా ఇపుడు సింపుల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మెయిన్ లీడ్ నడుమ సన్నివేశాలు వస్తున్నాయి.
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డపై ఓ సీరియస్ సన్నివేశంతో సినిమా మొదలైంది. తన మార్క్ యాటిట్యూడ్ తో ఇప్పుడు టైటిల్స్ రోల్ అవుతున్నాయి.
హాయ్.. 136 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలవుతుంది.