-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 10:15 PM Feb 27, 2025
-
ఇప్పుడు ఒక నెగిటివ్ పాత్రలో నటి లైలా పరిచయం అయ్యారు. తనపై కొన్ని సీరియస్ సీన్స్ వస్తున్నాయి. ఇలా సినిమా క్లైమాక్స్ దిశగా వెళుతుంది.
Date & Time : 09:55 PM Feb 27, 2025
-
ఇప్పుడు ఆది, సిమ్రాన్ విషయంలో కీలక నిజాలు తెలుసుకుంటున్నాడు. ఈ సంబంధించిన సన్నివేశాలు కొనసాగుతున్నాయి.
Date & Time : 09:45 PM Feb 27, 2025
-
ఇప్పుడు ఆదిపై కొన్ని ఎమోషనల్ సీన్స్ తర్వాత కథనం మళ్లీ సీరియస్ టోన్ లోకి మారింది.
Date & Time : 09:35 PM Feb 27, 2025
-
రెడిన్ కింగ్స్ లే పై కామెడి సీన్స్ బాగున్నాయి. ఇపుడు నటి సిమ్రాన్ పరిచయం అయ్యారు. తనపై కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:25 PM Feb 27, 2025
-
ఇంటర్వెల్ అనంతరం.. ఆది ఆ కాలేజ్ కి సంబంధించిన ఒక లైబ్రరీ విషయంలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తెలుసుకున్నాడు. ప్రస్తుతం మరిన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ కొనసాగుతున్నాయి.
Date & Time : 09:15 PM Feb 27, 2025
-
ఫస్టాఫ్ అప్డేట్:
ఇప్పటి వరకు సినిమా బాగానే ఉంది. కొంచెం స్లోగా ఉన్నా ఇంట్రెస్టింగ్ థీమ్, సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ డీసెంట్ గా డీల్ చేయబడ్డాయి. సౌండ్ ఎఫెక్ట్స్ అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఆది, లక్ష్మీ మీనన్ లు తమ పాత్రల్లో షైన్ అయ్యారు. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 09:05 PM Feb 27, 2025
-
లక్ష్మీ మీనన్ పై ఒక క్రేజీ హారర్ సీక్వెన్స్ తో సినిమా ఇపుడు సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 08:55 PM Feb 27, 2025
-
ఇపుడు కథనంలో మరో ఆత్మహత్య జరిగింది. ఆది అన్ని డాట్స్ ని కలుపుతున్నాడు. సస్పెన్స్ ఫ్యాక్టర్ అలా కొనసాగుతుంది.
Date & Time : 08:45 PM Feb 27, 2025
-
ఆ కేసుల్లో ఆది మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కనుక్కుంటున్నాడు. సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం సాలిడ్ గా ఉన్నాయి.
Date & Time : 08:35 PM Feb 27, 2025
-
ఆది కూల్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ కొనసాగుతున్నాయి.
Date & Time : 08:25 PM Feb 27, 2025
-
ఆది, లక్ష్మీ మీనన్ నడుమ కొన్ని సీన్స్ తర్వాత ఆది ఆ రెండు సూసైడ్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 08:15 PM Feb 27, 2025
-
ఆది ఒక పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ గా కనిపిస్తున్నాడు. ఇపుడు కథ మున్నార్ కి షిఫ్ట్ అయ్యింది. ఆ కాలేజ్ లో ఏం జరుగుతుందో ఇన్వెస్టిగేట్ చేయడానికి తను వచ్చాడు.
Date & Time : 08:05 PM Feb 27, 2025
-
ఒక కాలేజ్ లో రెండు ఆత్మహత్యలతో మొదలైన సినిమా ఇపుడు ముంబైకి షిఫ్ట్ అయ్యింది. ఒక ఇంట్రెస్టింగ్ పాత్రలో ఆది పినిశెట్టి పరిచయం అయ్యాడు.
Date & Time : 07:55 PM Feb 27, 2025
-
హాయ్.. 148 నిమిషాల నిడివి గల 'శబ్దం' సినిమా(స్పెషల్ ప్రీమియర్) ఇప్పుడే మొదలవుతుంది.
Date & Time : 07:45 PM Feb 27, 2025