-
-
ఎమోషనల్ క్లైమాక్స్ ఎపిసోడ్ తో శ్వాసలోన దేశమే అనే పాటతో సినిమా పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 03:35 AM October 02, 2019
-
ఇప్పుడు సినిమా క్లైమాక్స్ కు చేరుకుంటుంది.కొన్ని భావోద్వేగ పూరిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 03:25 AM October 02, 2019
-
ఇప్పుడు మహా సంగ్రామానికి రంగం సిద్ధం అయ్యింది.ఈ ఫ్రేమ్ లో చిరుతో పాటు కిచ్చ సుదీప్,విజయ్ సేతుపతి మరియు జగపతిబాబులు కనిపిస్తున్నారు.
Date & Time : 03:15 AM October 02, 2019
-
ఇప్పుడు తమన్నా అద్భుత నాట్య ప్రదర్శన వస్తుంది.
Date & Time : 03:04 AM October 02, 2019
-
ఇప్పుడు విజయ్ సేతుపతి పాత్ర పరిచయం అయ్యింది.ఆ అనంతరం సినిమాలోని హిట్ ట్రాక్ "ఓ సైరా" పాట వస్తుంది.
Date & Time : 02:46 AM October 02, 2019
-
ఇప్పుడు చిరు మరియు నయనతారల మధ్య ఒక భావోద్వేగపూరిత సన్నివేశం వస్తుంది.
Date & Time : 02:38 AM October 02, 2019
-
ఇప్పుడు కథనంలో చిన్న మలుపు చోటు చేసుకుంది.కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ తనదైన నటనతో ఆకట్టుకుంటున్నారు.
Date & Time : 02:30 AM October 02, 2019
-
ఇప్పుడు మొదటి యుద్దానికి సమయం ఆసన్నం అయ్యింది.తన ప్రజలతో నరసింహా రెడ్డి ఒక్కడే తెల్ల దొరలను ఎదుర్కొంటున్నాడు.
Date & Time : 02:19 AM October 02, 2019
-
ఇప్పుడు నరసింహా రెడ్డి బ్రిటిష్ దేశస్థులపైకి తిరుగుబాటు మొదలు పెట్టాడు.దీనితో వారు రేనాడు ను ఆక్రమించుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు.
Date & Time : 02:16 AM October 02, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు చాలా చక్కగా కొన్ని ఆసక్తికర సన్నివేశాలతో సజావుగా సాగింది.అయితే ఇంటర్వెల్ బ్లాక్ ఎపిసోడ్ తో మాత్రం సెకండాఫ్ మరింత హై ఓల్టేజ్ గా ఉండడం ఖాయమనిపిస్తుంది.మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Date & Time : 02:09 AM October 02, 2019
-
ఇప్పుడు సినిమా ఇంటర్వెల్ దిశగా చేరుకుంటుంది.
Date & Time : 01:56 AM October 02, 2019
-
ఇప్పుడు "నీకెందుకు కట్టాలిరా శిస్తు?" సీన్ వస్తుంది.మరో పక్క మెగా వారసురాలు నిహారిక ఒక గిరిజన యువతి పాత్రలో పరిచయం అయ్యింది.
Date & Time : 01:47 AM October 02, 2019
-
సిద్ధమ్మగా మరో నటి నయనతార పాత్ర పరిచయం అయ్యింది.ఆమె నరసింహా రెడ్డిని వివాహం చేసుకునేందుకు సిద్ధం అవుతుంది.
Date & Time : 01:29 AM October 02, 2019
-
బ్రిటిష్ దేశస్థులు రేనాడు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.మరోపక్క నరసింహా రెడ్డి మరియు లక్ష్మిల ప్రేమ కథ నడుస్తుంది.
Date & Time : 01:24 AM October 02, 2019
-
ఇప్పుడు జాగో నరసింహా రెడ్డి పాట వస్తుంది.వేలాది మందితో అద్భుత సెట్టింగులతో ఈ పాట చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది.
Date & Time : 01:12 AM October 02, 2019
-
సామంత రాజులుగా జగపతిబాబు,ముఖేష్ రిషి,రవి కిషన్ మరియు కిచ్చ సుదీప్ ల పాత్రలు పరిచయం అయ్యాయి. ఇప్పుడు ఎద్దులతో ఒక యాక్షన్ సన్నివేశం వస్తుంది.
Date & Time : 01:09 AM October 02, 2019
-
సింపుల్ గా ఉన్నా ఒక అద్భుత సన్నివేశంతో నీటి అడుగున మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డిగా ఎంటర్ అయ్యారు.ఇప్పుడు తమన్నా పాత్ర నర్తకి లక్ష్మి గా పరిచయం అయ్యింది.
Date & Time : 01:00 AM October 02, 2019
-
ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చిన్ననాటి సన్నివేశాలు వస్తున్నాయి.అతని తాతయ్య పాత్రలో నాజర్ ఎంటర్ అయ్యారు.అలాగే నరసింహా రెడ్డి గురువు(గోసాయి వెంకన్న)గా అమితాబ్ కూడా ఈ సీన్ లో జాయిన్ అయ్యారు.
Date & Time : 12:56 AM October 02, 2019
-
ఇప్పుడు చిత్రం బకింగ్‌హామ్ ప్యాలెస్ కు చేరుకుంది..ఇప్పుడు 1857లో సిపాయిల తిరుగుబాటు చేస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:53 AM October 02, 2019
-
అల్లు అరవింద్,పవన్ కళ్యాణ్ మరియు అనుష్క శెట్టిలకు ప్రత్యేక కృతజ్ఞ్యతలు తెలుపుతూ సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 12:46 AM October 02, 2019
-
హాయ్..171 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 12:45 AM October 02, 2019