-
క్లైమాక్స్ లో శ్రీవిష్ణు చేసిన అన్ని రోల్స్ కి ఒక సరైన ముగుంపు కనిపిస్తుంది. ఇలా మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:15 AM October 04, 2024
-
కథనంలో సస్పెన్స్ రివీల్ అయ్యి ఇపుడు సినిమా ఎమోషనల్ టోన్ లోకి మారింది. ఇలా సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 11:15 AM October 04, 2024
-
ఇప్పుడు ఒకో ట్విస్ట్ రివీల్ అవుతూ వస్తుంది. అలాగే ఆ నిధికి సంబంధించి కూడా అంతా క్లియర్ అవుతుంది.
Date & Time : 11:10 AM October 04, 2024
-
ఇప్పుడు శ్రీవిష్ణు అసలు ఐడెంటిటీకి సంబంధించిన కొన్ని కన్ఫ్యూజింగ్ కామెడీ సీన్స్ వస్తున్నాయి. మళ్ళీ కథనం ఇంట్రెస్టింగ్ గా మారింది.
Date & Time : 11:05 AM October 04, 2024
-
ఇప్పుడు శ్రీవిష్ణు, రీతూ నడుమ కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:00 AM October 04, 2024
-
ప్రస్తుతం కథనం కొంచెం నెమ్మదిస్తుంది. శ్రీవిష్ణు బ్యాక్ స్టోరీ సాగదీతగా లాగుతున్నారు.
Date & Time : 10:45 AM October 04, 2024
-
ఇప్పుడు శ్రీవిష్ణుపై మరో రోల్ పరిచయం అయ్యింది. ఓ సాంగ్ తో సునీల్ కూడా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:30 AM October 04, 2024
-
భిన్నమైన పాత్రల్లో శ్రీవిష్ణు సాలిడ్ పెర్ఫామెన్స్ అందిస్తున్నాడు. మంచి ఫన్ మ్యానర్ లో సినిమా వెళుతుంది.
Date & Time : 10:20 AM October 04, 2024
-
ఇంటర్వెల్ అనంతరం.. ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. సీన్స్ 15వ శతాబ్దంలో కనిపిస్తున్నాయి.
Date & Time : 10:10 AM October 04, 2024
-
ఫస్టాఫ్ అప్డేట్:
ఇప్పటి వరకు సినిమా బాగానే ఉందని చెప్పాలి. మొదట కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించినప్పటికీ నెమ్మదిగా క్లారిటీ వచ్చింది. శ్రీవిష్ణు తన రోల్స్ లో ఇంప్రెస్ చేసాడు. సెకండాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేలా అనిపిస్తుంది. ఇదెలా ఉంటుందో చూడాలి.
Date & Time : 09:50 AM October 04, 2024
-
ఇప్పుడు శ్రీవిష్ణు పాత్రలపై మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇలా ఎంగేజింగ్ ట్విస్ట్ తో సినిమా సగానికి చేరుకుంది. ఇపుడు విరామం.
Date & Time : 09:40 AM October 04, 2024
-
ఇప్పుడు కథనంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. దీనితో కథ ఒక కొలిక్కి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 09:30 AM October 04, 2024
-
సినిమా కథ చూసేందుకు కొంచెం డిఫరెంట్ గా సాగుతుంది. కొంచెం టైం తీసుకుంటే అన్నీ సెట్టయ్యేలా కనిపిస్తున్నాయి అప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ గా మారొచ్చు. మీరా జాస్మిన్ కీలక పాత్రలో కనిపిస్తుంది. తన రోల్ లో ఆమె అందంగా కనిపిస్తుంది.
Date & Time : 09:20 AM October 04, 2024
-
ఇప్పుడు శ్రీవిష్ణు చేసిన మరో రోల్ పరిచయం అయ్యింది. తన పత్రాలు సహా రీతూ వర్మ రోల్ అన్నీ నిధి చుట్టూతానే కనిపిస్తున్నాయి.
Date & Time : 09:05 AM October 04, 2024
-
ఇప్పుడు రీతూ వర్మ పరిచయం అయ్యింది. ఆమె మగవాళ్ల నుంచి పలు అవమానాలు ఎదుర్కొంటూ లైఫ్ లో తన స్వశక్తితో ఎదుగుతుంది. అలాగే ఇపుడు రవిబాబు కూడా పరిచయం అయ్యాడు.
Date & Time : 08:50 AM October 04, 2024
-
సినిమా ఒక నిధి కోసం డిఫరెంట్ తరాలలో కనిపిస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు ప్రస్తుత కాలంలో శ్రీవిష్ణు ఒక పోలీస్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 08:40 AM October 04, 2024
-
ఒక రాజ కుటుంబీకులుగా మీరా జాస్మిన్, రీతూ వర్మ, శ్రీవిష్ణులు మరో యుగం నుంచి కనిపిస్తున్నారు.
Date & Time : 08:30 AM October 04, 2024
-
హాయ్.. 2 గంటల 40 నిమిషాల నిడివి గల సినిమా శ్రీవిష్ణు వాయిస్ ఓవర్ తో ఇప్పుడే మొదలైంది.
Date & Time : 08:20 AM October 04, 2024