-
-
ఇక సినిమా పూర్తి అయింది...పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ వుండండి...
Date & Time : 07:12 AM August 09, 2018
-
అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. ప్రస్తుతం అద్భుతంగా పెళ్ళితంతు సాగుతుండగా, నేపథ్యంలో అందమైన పాట 'కళ్యాణం వైభోగం' వస్తోంది...
Date & Time : 07:10 AM August 09, 2018
-
నితిన్, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, జయసుధ, రాశి మరియు ఇతర ముఖ్యమైన పాత్రల మధ్య వివాహ వేదికపై ఒక హృదయానికి హత్తుకునే భావోద్వేగ సన్నివేశం జరుగుతోంది.....
Date & Time : 07:05 AM August 09, 2018
-
విస్తృతంగా పెళ్ళికి సంబందించిన సన్నాహాలు పూర్తి అయిన తరువాత, ప్రస్తుతం పెద్ద ఎత్తున సాంప్రదాయ వివాహం కోసం వేదిక సిద్ధమైంది ...
Date & Time : 06:58 AM August 09, 2018
-
భారీ తారాగణంతో కూడిన కుటుంబ సన్నివేశం ప్రస్తుతం వస్తోంది...
Date & Time : 06:50 AM August 09, 2018
-
పెళ్లి డేట్ దగ్గర పడుతున్నకొద్దీ అందరూ బంధువులు అన్ని అరెంజిమెంట్స్ చేయడంలో బిజీగా వున్నారు...'ప్రస్తుతం వినవమ్మా తూరుపు చుక్క' అనే పల్లవితో సాగే పాట వస్తోంది....
Date & Time : 06:42 AM August 09, 2018
-
`ముఖ్యమైన బంధువుగా సీనియర్ నటులు గిరిబాబు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు... అదే సమయంలో, నితిన్ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఆ వేడుకలో జాయిన్ అయ్యారు... ప్రస్తుతం 'పల్లెటూరి' అనే పల్లవితో సాగే పాట వస్తోంది....
Date & Time : 06:34 AM August 09, 2018
-
ఈవెంట్ మేనేజర్ గా యాక్టర్ అజయ్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు... పెళ్లికి సంబంధించి ప్రస్తుతం కొన్ని షాపింగ్ సన్నివేశాలు వస్తున్నాయి....
Date & Time : 06:25 AM August 09, 2018
-
ఎంగేజ్మెంట్ తరువాత ప్రస్తుతం హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ డ్యూయెట్ 'మొదలవుదాం' వస్తోంది.....
Date & Time : 06:18 AM August 09, 2018
-
ప్రస్తుతం ఎంగేజ్మెంట్ జరుగుతోంది... రెండు కుటుంబాల మధ్య సంస్కృతికి సంబంధించి కొన్ని తేడాలు రియలిస్టిక్ గా చూపించబడుతున్నాయి....
Date & Time : 06:14 AM August 09, 2018
-
ఇంటర్వెల్ తరువాత రెండు కుటుంబాల వారు పెళ్లి పనులు మొదలుబెట్టారు....
Date & Time : 06:08 AM August 09, 2018
-
హీరో, హీరోయిన్ల ఇద్దరు ఫ్యామిలీలు చర్చించుకున్నాక వాళ్ళిద్దరి పెళ్లి ఫిక్స్ చేస్తారు.... ప్రస్తుతం బ్రేక్
Date & Time : 05:56 AM August 09, 2018
-
నితిన్, రాశి ఇద్దరూ తమ ప్రేమని వాళ్ళ తల్లితండ్రులకు చెప్తారు... ప్రస్తుతం ఇరు కుటుంబాల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి....
Date & Time : 05:50 AM August 09, 2018
-
నితిన్ తన ఫ్రెండ్ తో కలిసి ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ కి వెళ్తాడు...ప్రస్తుతం రెట్రో స్టైల్ లో సాగే సంథింగ్ సంథింగ్ గా అనే పాట వస్తోంది...
Date & Time : 05:40 AM August 09, 2018
-
స్క్రీన్ మొత్తం బోలెడు మంది ఆర్టిస్టులతో నిండిపోయి కన్నులపండుగగా వుంది.. ఒక బ్యాచిలర్ పార్టీలో నితిన్, రాశిఖన్నా ఒకరినొకరు మొదటగా కలుసుకున్నారు... మెల్లగా రాశిఖన్నా, నితిన్ ప్రేమలో పడిపోయింది... ప్రస్తుతం ఇతడేనా ఇతడేనా అనే మెలోడీ సాంగ్ వస్తోంది...
Date & Time : 05:30 AM August 09, 2018
-
రాశి ఖన్నా తల్లి తండ్రులుగా ప్రకాష్ రాజ్, సితారలు ఎంట్రీ ఇచ్చారు... రాశి ఖన్నా పెద్ద అక్కగా పూనమ్ కౌర్ సీన్ లోకి వచ్చింది.... డబ్బు ఆశగల తండ్రిగా ప్రకాష్ రాజ్ చూపించబడుతున్నారు...
Date & Time : 05:20 AM August 09, 2018
-
ఇప్పుడే హీరోయిన్ రాశి ఖన్నా కాఫీ షాప్ లో పనిచేసే యువతిగా పరిచయం కాబడింది.. యాక్టర్స్ సత్యం రాజేష్, హరితేజ భార్య భర్తలుగా సీన్ లోని వచ్చారు.. కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి...
Date & Time : 05:12 AM August 09, 2018
-
కొన్ని పరిచయ సన్నివేశాల తరువాత ప్రస్తుతం ఎక్కడ నువ్వుంటే పల్లవితో సాగె మొదటి పాట వస్తోంది... పాట ద్వారా హీరో క్యారెక్టర్ ఎటువంటిదో ఎలివేట్ చేయబడుతోంది.....
Date & Time : 05:07 AM August 09, 2018
-
సినిమా ప్రస్తుత కాలానికి మారింది, హీరో నితిన్ రాజేంద్ర ప్రసాద్ కొడుకుగా చండీగఢ్ లో సింపుల్ గాఎంట్రీ ఇచ్చాడు.. హీరోయిన్ నందిత శ్వేత కూడా సీన్ లో జాయిన్ అయింది..
Date & Time : 05:02 AM August 09, 2018
-
గోదావరి జిల్లాలోని సఖినేటిపల్లిలో 20 ఏళ్ళ క్రితం సినిమా మొదలవుతుంది. సినిమాలోని పాత్రలు రాజేంద్రప్రసాద్ తో మొదలయి అన్నపూర్ణ, జయసుధ, నరేష సహా అందరూ ఒక్కొక్కరుగా ఇంట్రడ్యూస్ చేయబడుతన్నారు. కొన్ని కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 04:57 AM August 09, 2018
-
విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ తో సినిమా మొదలైంది... తెలుగు సంస్కృతి మరియు వివాహాల గురించి ప్రాధాన్యతను అయన వివరిస్తున్నారు.... దానికి సంబంధించి కొన్నిసన్నివేశాలు బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్నాయి
Date & Time : 04:50 AM August 09, 2018
-
హాయ్ .....140 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైయింది
Date & Time : 04:45 AM August 09, 2018