-
మొత్తానికి ఒక ఎమోషనల్ నోట్ తో సినిమా ఎండ్ అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:10 AM March 11, 2021
-
ఇప్పుడు శర్వా తనకి వ్యతిరేఖంగా ఉన్న అన్ని పరిస్థితులను అధిగమించి గెలిచాడు. అంతే కాకుండా నేటి యువతరానికి ఒక ప్రేరణగా కనిపిస్తున్నాడు. ఇలా సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.
Date & Time : 11:00 AM March 11, 2021
-
ప్రపంచాన్ని వణికించిన కరోనా.. ఆ రైతులను మరింత ఇబ్బందుల్లో పడేసింది. ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:50 AM March 11, 2021
-
ఇప్పుడు అనుకోని విధంగా శర్వా కుటుంబానికి మరియు అక్కడి రైతుల మధ్య కొన్ని భేదాలు ఏర్పడుతున్నాయి.
Date & Time : 10:40 AM March 11, 2021
-
ఇప్పుడు ఈ సినిమాలో సూపర్ హిట్ ఫోక్ ట్రాక్ "భలేగుంది బాల" స్టార్ట్ అయ్యింది.
Date & Time : 10:30 AM March 11, 2021
-
ఇప్పుడు రైతులు అంతా కలిపి వారి మొదటి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు.
Date & Time : 10:20 AM March 11, 2021
-
ఓ విపరీతమైన ఎమోషనల్ సీన్ తర్వాత సినిమా టైటిల్ సాంగ్ "శ్రీకారం" స్టార్ట్ అయ్యింది.
Date & Time : 10:10 AM March 11, 2021
-
ఇప్పుడు శర్వా మరియు ప్రియాంకాల ఫ్యామిలీ నడుమ కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:05 AM March 11, 2021
-
ఇంటర్వెల్ అనంతరం. శర్వాతో గ్రామస్థులు అంతా "ఉమ్మడి వ్యవసాయం" అనే ఒక భారీ ఎపిసోడ్ లో పాల్గొంటున్నారు. ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:00 AM March 11, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు సజావుగా ఉందనే చెప్పాలి. శర్వా మరియు ప్రియాంకల నడుమ మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. కానీ మిగతా అంతా ఎక్కువ ఎమోషనల్ గా కనిపించింది. శర్వా అగ్రికల్చర్ పై తీసుకున్న స్టెప్ తో సెకండాఫ్ కీలకంగా మారేలా అనిపిస్తుంది. మరి ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 09:55 AM March 11, 2021
-
ఒక ఎమోషనల్ మరియు ప్రేరణ కలిగించే సీన్ తో సినిమా ఇంటర్వెల్ కు చేరుకుంది.
Date & Time : 09:45 AM March 11, 2021
-
ఇప్పుడు కథనంలో ఒక కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. దీనితో శర్వా హైదరాబాద్ నుంచి తన గ్రామానికి వచ్చాడు.
Date & Time : 09:40 AM March 11, 2021
-
ఇప్పుడు నరేష్ మరియు శర్వాల మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:30 AM March 11, 2021
-
హేయ్ అబ్బాయ్ సాంగ్ తో ప్రియాంకా తనలోని డాన్స్ యాంగిల్ ను కూడా చూపిస్తుంది.
Date & Time : 09:15 AM March 11, 2021
-
శర్వా మరియు ప్రియాంకల మధ్య కొన్ని కామెడీ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 09:10 AM March 11, 2021
-
ఓ సింపుల్ ఎంట్రీ తో హీరోయిన్ ప్రియాంక అరుళ్ పరిచయం అయ్యింది. అలాగే ఆమె ఫ్రెండ్ గా బిగ్ బాస్ ఫేమ్ దేతడి హారిక కూడా జాయిన్ అయ్యింది.
Date & Time : 09:05 AM March 11, 2021
-
ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలయ్యింది. సాయికుమార్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 09:00 AM March 11, 2021
-
ఇపుడు సంక్రాంతి సాంగ్ మొదలయ్యింది. ఇందులో విజువల్స్ చాలా బాగున్నాయి.
Date & Time : 08:55 AM March 11, 2021
-
ఓ గ్రామంలో శర్వానంద్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 08:50 AM March 11, 2021
-
హాయ్..132 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 08:45 AM March 11, 2021