-
మానవత్వం గురించి మహేష్ ఇచ్చిన మంచి సందేశంతో చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 4:00 AM September 27, 2017
-
చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది. హీరో విలన్ మధ్య భారీ ఫైట్ సీన్ వస్తోంది.
Date & Time : 3:56 AM September 27, 2017
-
ఆసుపత్రిలోని పేషంట్ లని రక్షించడానికి మహేష్ రంగంలోకి దిగాడు. ప్రస్తుతం ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 3:48 AM September 27, 2017
-
సూర్య కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఓ హాస్పిటల్ పై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సాయాజీ షిండే పోలీస్ ఉన్నతాధికారిగా ఎంట్రీ ఇచ్చాడు. దాడిని ఆపడానికి తన టీంతో ప్రయత్నాలు చేస్తున్నాడు.
Date & Time : 3:44 AM September 27, 2017
-
చిత్రం మరో ఆసక్తికర సన్నివేశం ప్రారంభమైంది. ట్రైలర్ లో చూపిన పెద్ద బండరాయి దొర్లుకుని వచ్చే సీన్ వస్తోంది.
Date & Time : 3:38 AM September 27, 2017
-
ఆసక్తికరమైన ఇంటరాగేషన్ సీన్ కు అంతా సిద్ధం అయింది. మహేష్, సూర్యలు తొలిసారి ఎదురుపడ్డారు.
Date & Time : 3:32 AM September 27, 2017
-
అత్యంత ఉత్కంఠ భరితమైన సన్నివేశం ముగిసింది. ఎట్టకేలకు పోలీస్ లు ఎస్ జె సూర్యని అరెస్టు చేసారు
Date & Time : 3:28 AM September 27, 2017
-
సూర్య కోసం మహేష్ బాబు వెతికే సన్నివేశాన్ని ఇంటెలిజెంట్ గా చిత్రీకరించారు. సన్నివేశాలు చాల థ్రిల్లింగ్ గా అనిపిస్తున్నాయి.
Date & Time : 3:22 AM September 27, 2017
-
మురుగదాస్ శైలిలో సాగె ఫన్నీ మరియు ఇంటెలిజెంట్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 3:15 AM September 27, 2017
-
చిత్రంలో ఇప్పుడు మాస్ సాంగ్ 'హాలి హాలి' వస్తోంది. సాంగ్ కోసం వేసిన సెట్స్ చాలా బావున్నాయి.
Date & Time : 3:06 AM September 27, 2017
-
చిత్రం నెమ్మదిగా వేగం పుంజుకుంటోంది. చిత్రంలో మరో షాకింగ్ ట్విస్ట్ రివీల్ అయింది.
Date & Time : 3:00 AM September 27, 2017
-
విలన్ గా సూర్య వెలుగులోకి వచ్చాడు. మహేష్ కుటుంబాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్ని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 2:55 AM September 27, 2017
-
ఇంటర్వల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. ఉన్మాదులు ప్రవర్తనకు సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 2:45 AM September 27, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు చిత్రం డీసెంట్ గా ఉంది. అత్యంత ఆసక్తిని కలిగించే సన్నివేశాలు కొన్ని ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం సీరియస్ గా సాగిన చిత్రం అక్కడక్కడా స్క్రీన్ ప్లే నెమ్మదించింది.
Date & Time : 2:40 AM September 27, 2017
-
హీరోకి విలన్ కి మధ్య ఆసక్తికరమైన సంభాషణతో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 2:35 AM September 27, 2017
-
అసలు విలన్ ఎస్ జె సూర్య ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. అతడి క్యారెక్టర్ కు సంబందించిన పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 2:32 AM September 27, 2017
-
తమిళ నటుడు భరతే మహేష్ అనుమానిస్తున్న నిందితుడు. మహేష్ బాబు అతడిని అదుపులోకి తీసుకున్నాడు. ఆసక్తికరమైన దర్యాప్తు సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 2:28 AM September 27, 2017
-
మహేష్ బాబు ఎట్టకేలకు హంతకుడిని కనుగొన్నాడు. ట్రైలర్ లో ఆసక్తికరంగా కనిపించిన రోలర్ కోస్టర్ సీన్ మహేష్, హంతకుడి మధ్య వస్తోంది.
Date & Time : 2:24 AM September 27, 2017
-
హంతకుడి గురించి మహేష్ బాబుకు షాకింగ్ నిజాలు తెలిసాయి. ప్రస్తుతం హంతకుడి చిన్ననాటి సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 2:18 AM September 27, 2017
-
హత్యలకు కారణమైన నిందితుడి కోసం మహేష్ తన బృందంతో కలసి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 2:10 AM September 27, 2017
-
మహేష్, రకుల్ మధ్య కామెడీ సీన్స్ తరువాత హిట్ సాంగ్ 'సిసిలియా సిసిలియా' మొదలైంది.
Date & Time : 2:04 AM September 27, 2017
-
చిత్రం క్రమంగా సీరియస్ మూడ్ లోకే వెళుతోంది. ఆసక్తికరమైన సీన్స్ వేగంగా సాగుతున్నాయి.
Date & Time : 2:00 AM September 27, 2017
-
సాంగ్ ముగిసింది. ప్రస్తుతం ఓ హత్యకు సంబందించిన దర్యాప్తు ఆసక్తికరంగా సాగుతోంది.
Date & Time : 1:55 AM September 27, 2017
-
ప్రస్తుతం చిత్రంలో 'అచ్చం తెలుగందం' అనే సాంగ్ వస్తోంది.
Date & Time : 1:48 AM September 27, 2017
-
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. మహేష్, రకుల్ మధ్య ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 1:44 AM September 27, 2017
-
సాంగ్ లో విజువల్స్ బావున్నాయి. ఇప్పుడు హీరోకి అతని ఫ్రెండ్ కి మధ్య కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 1:40 AM September 27, 2017
-
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున సూపర్ స్టార్ మహేష్ బాబు ఫైట్ సీన్ తో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే 'బూమ్ బూమ్' సాంగ్ మొదలైంది.
Date & Time : 1:34 AM September 27, 2017
-
బస్ స్టాప్ లో చిత్రం ప్రారంభమైంది. ప్రేమ జంట మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 1:30 AM September 27, 2017
-
145 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభం అయింది. అభిమానులు ఆనందోత్సాహాలతో ఉరకలు వేస్తున్నారు.
Date & Time : 1:20 AM September 27, 2017