-
ఇక ఈ సాఫ్ట్ వేర్ సుదీర్ సినిమా పూర్తయింది... ఈ సినిమాకి సంబందించిన పూర్తీ సమీక్ష సమావేశం కోసం ఇక్కడే చూస్తూ ఉండండి...
Date & Time : 11:48 AM December 28, 2019
-
ఈ సందర్భంలో హీరో సుధీర్ ఒక తెలివైన ఆటను ప్రదర్శిస్తున్నాడు. కొన్ని కొన్ని విషయాలు ఉమ్మడిగా ఉంటూ కాస్త సంతోషాన్నిస్తున్నాయి.
Date & Time : 11:38AM December 28, 2019
-
ఈ చిత్రంలో ఇదే పెద్ద ట్విస్ట్ గా చెప్పుకోవాలి. ఇప్పటివరకు జరిగిన దానికి వెనకాల ఎవరు నడిపిస్తున్నారో ఇపుడు బయటపడింది.
Date & Time : 11:34 AM December 28, 2019
-
ఇప్పుడు నాజర్ ఎంట్రీ జరిగింది. ఇప్పుడు మరొక ఫ్లాష్ బ్యాక్, మరొక కొత్త పాట వస్తుంది. కాగా ఈ పాట కోసం గద్దర్ ఎంట్రీ ఇచ్చారు...
Date & Time : 11:30 AM December 28, 2019
-
ఇప్పుడిక ఫ్లాష్ బ్యాక్ ముగిసి, ప్రస్తుత సమయానికి చేరుకుంది. కాగా వరుసగా రెండు ట్విస్టులు ప్రదర్షింపబడ్డాయి.
Date & Time : 11:25 AM December 28, 2019
-
ప్రస్తుతానికి చిత్రం మొత్తంకుడా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో జరుగుతుంది. హీరో సుధీర్ ప్రేమ ప్రతిపాదనకు సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:15 AM December 28, 2019
-
ఇప్పుడొక సోలో పాట వస్తుంది. ఇందాక తప్పిపోయిన అనవసరమైన హంగమా ని ఇప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విచిత్రమైన హాస్య సన్నివేశాలు వస్తున్నాయి..
Date & Time : 11:06 AM December 28, 2019
-
ఈ చిత్రం ముందు నుండి చాలా సీరియస్ అంశంతో వచ్చినప్పటికి కూడా ప్రస్తుతానికి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లడం వలన కొద్దిగా బోర్ కొడుతోంది. అంతేకాకుండా ఇప్పుడు వస్తున్న సన్నివేశాలు చాలా విచిత్రంగా ఉన్నాయి.
Date & Time : 11:00 AM December 28, 2019
-
ప్రస్తుతానికి నటి విద్యుల్లేఖ కి సంబందించిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి...
Date & Time : 10:51 AM December 28, 2019
-
ప్రస్తుతానికి ఒక కీలకమైన మలుపు వచ్చింది. హీరో సుధీర్ మాఫియా చేత దారుణంగా మోసం చేయబడ్డాడు... దీనికి అంతటికి కారణం మాఫియా అని తెలుసుకున్నాడు...
Date & Time : 10:44 AM December 28, 2019
-
ఇక విరామం తరువాత హీరో సుదీర్ ని కాపాడటానికి ఒక పూజ జరుగుతుంది. కాగా వీటన్నింటికి వెనకాల ఒక బలమైన కారణం ఉందని ఇపుడే బయట పడింది.
Date & Time : 10:40 AM December 28, 2019
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్: ఆశ్చర్యకరంగా ఈ చిత్రం మంచి కంటెంట్‌ను కలిగి ఉంది మరియు అనవసరమైన డ్రామా లేకుండా ఇప్పటివరకు బాగా వివరించబడింది. హీరోగా సుధీర్ చాలా ఆకట్టుకున్నాడు. మంచి సస్పెన్స్ కూడా ఉంది. రెండవ సగం కీలకం అవుతుంది.
Date & Time : 10:31 AM December 28, 2019
-
జ్యోతిషశాస్త్రం మరియు హీరో మరియు అతని మరణ వార్తల గురించి ఆసక్తికరమైన మలుపులతో ఈ చిత్రం బ్రేక్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:30 AM December 28, 2019
-
ఇప్పుడొక పెద్ద ట్విస్ట్ వచ్చింది. హీరో సుధీర్ కి ప్రాణాపాయం ఉంది. మెల్లిగా కథ విరామం వైపు వెళ్తుంది
Date & Time : 10:25 AM December 28, 2019
-
ఇప్పుడు మరొక పాట వస్తుంది. ఈ పాటలో కూడా అన్ని పాత నృత్యాలు, పాత ప్రదేశాలే కనిపిస్తున్నాయి. కానీ హీరోయిన్ ధన్యా మాత్రం చాలా బాగుంది...
Date & Time : 10:20 AM December 28, 2019
-
ఒక స్వామీజీ ఒక పుస్తకం ఇచ్చి, దాని ప్రకారం పనులు జరుగుతాయని చెప్పారు. ఈ సన్నివేశాలను చాలా ఆసక్తికరంగా ప్రదర్శిస్తున్నారు.
Date & Time : 10:15 AM December 28, 2019
-
ఈ చిత్రంలో జ్యోతిషశాస్త్ర కోణం దాగి ఉంది. కాగా ప్రస్తుతానికి దానికి సంబందించిన విషయాలు ప్రదర్షింపబడుతున్నాయి. కాగా ఇప్పుడే విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళీ పరిచయం జరిగింది.
Date & Time : 10:05 AM December 28, 2019
-
సుదీర్ మరియు ధన్యా బాలకృష్ణ ల ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు వీరి మధ్యన ఒక పాట వస్తుంది. సుదీర్ తన నృత్యాలతో ఆకట్టుకుంటున్నాడు
Date & Time : 09:54 AM December 28, 2019
-
హీరోయిన్ ధన్యా బాలకృష్ణ హీరో సుదీర్ మీద ప్రేమ కనబరుస్తూ ఆసక్తికరమైన ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 09:45 AM December 28, 2019
-
షియాజీ షిండే తన తండ్రిగా, ఇంద్రజ తల్లిగా దర్శనమిచ్చారు. ఇప్పుడిక విలన్ ఎంట్రీ కూడా జరిగింది.
Date & Time : 09:40 AM December 28, 2019
-
హాయ్ చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది... మరియు మంచి సన్నివేశాలతో ఎంట్రీ జరిగింది...
Date & Time : 09:35 AM December 28, 2019