-
ఓ షాకింగ్ సంఘటనతో అఫ్రీన్ సీతని కలవడంతో సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కొసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 07:25 AM Aug 05, 2022
-
మొత్తానికి సీతకి ఆ లెటర్ అయితే చేరింది. ఓ షాకింగ్ ట్విస్ట్ తో నిజం తెలుసుకున్న సీత బాధ పడుతుంది. ఇలా సినిమా క్లైమాక్స్ దిశగా కొనసాగుతుంది.
Date & Time : 07:20 AM Aug 05, 2022
-
సుమంత్ అప్పుడు కాశ్మీర్ లో జరిగిన కథ కోసం అంతా చెబుతున్నాడు. తర్వాత రామ్ సీతకి రాసిన లెటర్ కోసం అడుగుతున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:15 AM Aug 05, 2022
-
ఇప్పుడు రామ్ సుమంత్ లు పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ కి ఒక మిషన్ పై వెళ్లారు. దాన్ని సక్సెస్ చేస్తారు కానీ రామ్ పాక్ ఆర్మీ కి దొరికేసాడు. సీత, భూమికలు ఈ విషయాలు అన్నీ ప్రకాష్ రాజ్ నుంచి తెలుసుకుంటున్నారు.
Date & Time : 07:10 AM Aug 05, 2022
-
అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ కి సినిమా షిఫ్ట్ కాగా ఇందులో సుమంత్ భార్యగా భూమిక పరిచయం అయ్యింది. సీత తన నిజమైన బ్యాక్గ్రౌండ్ కోసం రామ్ కి చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:55 AM Aug 05, 2022
-
ఇప్పుడు సీత కోసం అఫ్రీన్ కాశ్మీర్ కి వెళ్తుంది. కానీ ఆమెని ఆర్మీ ఆఫీసర్స్ కస్టడీలోకి తీసుకోగా సీనియర్ ఆఫీసర్ గా కనిపించే సుమంత్ రామ్ కోసం చెప్పడం స్టార్ట్ చేస్తాడు.
Date & Time : 06:50 AM Aug 05, 2022
-
ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఓ రిపోర్టర్ గా ప్రియదర్శి కనిపిస్తున్నాడు. కొన్ని కారణాల వల్ల సీత తన ఇంటిని వదిలేసి రామ్ దగ్గరకి వచ్చింది, ఇప్పుడు మరో పాట మొదలైంది.
Date & Time : 06:40 AM Aug 05, 2022
-
ఒక ఎమోషనల్ సాంగ్ తర్వాత రామ్ తనకి లెటర్స్ రాసిన అందరిని కలుస్తున్నాడు. ఈ సమయంలో రామ్ ఓ పాపని కాపాడడంతో సీత అతనిపై మరింత ప్రేమను పెంచుకుంటుంది.
Date & Time : 06:30 AM Aug 05, 2022
-
ఇంటర్వెల్ అనంతరం.. సీతపై ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తున్నాయి. అఫ్రీన్ సీత ఫ్రెండ్ ని కలుసుకోగా ఆమె సీత - రామ్ ల ప్రేమ కోసం చెబుతున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:25 AM Aug 05, 2022
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు సినిమా సజావుగా ఉందని చెప్పాలి. దుల్కర్, మృణాల్ లా డీసెంట్ నటన, వారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. కాకపోతే హను నరేషన్ మాత్రం కొద్దిగా స్లో గా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 06:10 AM Aug 05, 2022
-
ఇప్పుడు కొన్ని ఆసక్తికర సీన్స్ తర్వాత సినిమా ప్రస్తుతానికి షిఫ్ట్ అయ్యింది, అఫ్రీన్ మురళీ శర్మ ని కలుస్తుంది. కథనంలో ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ తో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది.
Date & Time : 06:00 AM Aug 05, 2022
-
రామ్, సీతని మళ్లీ కలిసాడు. ఇద్దరి మధ్య కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ తర్వాత మరో మెలోడీ సాంగ్ మొదలయింది.
Date & Time : 05:45 AM Aug 05, 2022
-
కొన్ని ఆసక్తికర సన్నివేశాల అనంతరం ఇప్పుడు కథనం మళ్లీ ప్రస్తుతానికి షిఫ్ట్ అయ్యింది. అఫ్రీన్ మరోపక్క రామ్ కోసం తీవ్రంగా గాలిస్తుంది. మొత్తానికి రామ్ క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి వెన్నెల కిషోర్ ని కలవగలిగింది.
Date & Time : 05:40 AM Aug 05, 2022
-
ఇప్పుడు కథనం మరింత ఆసక్తి గా మారుతుంది. మొత్తానికి రామ్ అయితే ఆ ఉత్తరాల వెనక ఉంది ఎవరో కనుక్కుంటాడు. ఫస్ట్ మీటింగ్ సీన్ చాలా బాగుంది. అలాగే చిన్న ట్విస్ట్ కూడా ఇప్పుడు చోటు చేసుకుంది.
Date & Time : 05:30 AM Aug 05, 2022
-
ఆ లెటర్స్ లో కాస్త ఆసక్తి గా సీతా మహాలక్ష్మి అనే అమ్మాయి రాసిన ఉత్తరం ఉందని చూస్తాడు. దాంతో ఆమె ఎవరు అనే పనిలో తాను పడతాడు. ఇప్పుడు ఒక మంచి సాంగ్ అద్భుతమైన విజువల్స్ తో కనిపిస్తుంది.
Date & Time : 05:20 AM Aug 05, 2022
-
జమ్మూ కాశ్మీర్ లో కొంతమంది ప్రాణాలు కాపాడడంతో రామ్ ఒక హీరో అయ్యిపోయాడు. తర్వాత ఓ ఇంటర్వ్యూలో తన కోసం ఓ విషయం చెప్పడం తో ఎన్నో లెటర్స్ తనకి ప్రజలు నుంచి రావడం మొదలవుతుంది.
Date & Time : 05:15 AM Aug 05, 2022
-
ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ కి షిఫ్ట్ అయ్యింది. రామ్(దుల్కర్ సల్మాన్) ఒక సైనికుడు గా ఎంట్రీ ఇచడం అలాగే గౌతమ్ మీనన్, సుమంత్ లు కూడా పరిచయం అయ్యారు. ఇపుడు దుల్కర్, సుమంత్ ల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:10 AM Aug 05, 2022
-
అఫ్రీన్, బాలాజీ లు సీత కోసం చాలా గట్టిగా వెతికేస్తున్నారు. కానీ వారు రామ్{దుల్కర్ సల్మాన్} కోసం లీడ్ తెలుసుకున్నారు. ఇప్పుడు సినిమా ఆసక్తిగా మారుతుంది.
Date & Time : 05:00 AM Aug 05, 2022
-
ఇప్పుడు బాలాజీ గా తరుణ్ భాస్కర్ ఎంట్రీ ఇచ్చాడు. తాను కూడా సీతని వెతకడంలో అఫ్రీన్ కి సాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఒక అకౌంటంట్ గా నటుడు మురళీ శర్మ పరిచయం అయ్యాడు.
Date & Time : 04:55 AM Aug 05, 2022
-
ఇప్పుడు అఫ్రీన్ ఓ సమస్య తలెత్తడంతో ఇండియాకి వచ్చింది. తన తాతయ్య ఆమెకి ఓ లెటర్ ఇచ్చి దాన్ని సీత(మృణాల్ ఠాకూర్) కి అందజేయమన్నాడు. అఫ్రీన్ ఆ పనిలో పడింది.
Date & Time : 04:50 AM Aug 05, 2022
-
ఫ్లాష్ బ్యాక్ లో ఇండియన్ ఆర్మీ పై యుద్ధ సన్నివేశాలతో సినిమా స్టార్ట్ అయ్యింది. దీని తర్వాత 20 ఏళ్ల అనంతరం సినిమా లండన్ కి షిఫ్ట్ అయ్యింది. ఇపుడు అఫ్రీన్ గా రష్మికా మందన్నా ఎంటర్ అయ్యింది.
Date & Time : 04:45 AM Aug 05, 2022
-
హాయ్.. 2 గంటల 43 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 04:39 AM Aug 05, 2022