-
పూర్తి సమీక్ష కోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 04:55 AM December 24, 2021
-
క్లైమాక్స్‌లో దర్శకుడు వాసు చివరకు రోసీని కలుస్తాడు. ఒక ట్విస్ట్‌తో సినిమా ముగుస్తుంది.
Date & Time : 04:52 AM December 24, 2021
-
ఇప్పుడు కథ మళ్లీ కోర్టుకెక్కింది. పునర్జన్మపై వాదనలు విన్న కోర్టు కేసుని మరుసటి రోజుకు వాయిదా వేసింది.
Date & Time : 04:40 AM December 24, 2021
-
రోసీ ఆచూకీ గురించి ప్రెస్ యాజమాన్యం మనవరాలిని ఆరా తీస్తాడు వాసు. రాయ్ అదృశ్యమైన తర్వాత రోసీ అతడిని వెతుక్కుంటూ వెళ్లిందని ఆమె వాసుతో చెప్పింది.
Date & Time : 04:37 AM December 24, 2021
-
దర్శకుడు వాసు హిప్నాసిస్ నుండి బయటకి వచ్చి కలకత్తాలోని రాయ్ పని చేసే రాయల్ ప్రెస్‌కి వెళ్తాడు.
Date & Time : 04:34 AM December 24, 2021
-
రాయ్ ఎస్ఆర్ ట్రస్ట్ అనే ట్రస్ట్‌ను ప్రారంభిస్తాడు. ఈ తరుణంలో రాయ్ సోదరుడు కలకత్తాకు వచ్చి వారి అన్నయ్య అనారోగ్యంతో ఉన్నాడని మరియు అతనిని చూడాలనుకుంటున్నాడని చెప్పాడు.
Date & Time : 04:26 AM December 24, 2021
-
దేశంలోని దేవదాసీలందరినీ విడిపించాలని రోసీ రాయ్‌ని అడుగుతుంది. రాయ్ తన రచనలతో దానిని సాధించాడు.
Date & Time : 04:23 AM December 24, 2021
-
రాయ్ మరియు రోసీ కలకత్తా బయలుదేరారు. అక్కడ రాయ్ ప్రెస్‌లో చేరాడు. ఇప్పుడు ఒక అందమైన పాటకు సమయం. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
Date & Time : 04:16 AM December 24, 2021
-
రాయ్ మరియు దేవదాసీల అధిపతికి మధ్య పోరాటం జరుగుతోంది.
Date & Time : 04:09 AM December 24, 2021
-
రాయ్ తిరిగి రోసీని గుడిలో వదిలేశాడు. మరుసటి రోజు వారిద్దరు మళ్లీ కలుసుకున్నారు. ఇది 'సిరివెన్నెల' అనే మధురమైన పాటకు సమయం.
Date & Time : 03:54 AM December 24, 2021
-
చక్కటి డ్యాన్స్‌తో ఆకట్టుకున్న సాయి పల్లవిని రాయ్ కలవడానికి ప్రయత్నించాడు. అక్కడున్న ఒక బోట్ నడిపే వాడిని ఆమె గురించి అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు వారు ఎందుకు ఆలయంలోకి వెళ్తున్నారని కూడా అడిగాడు. అయితే వారంతా బంగ్లాదేశ్‌కు చెందిన దేవదాసీలని అతను రాయ్‌కి చెప్పాడు.
Date & Time : 03:43 AM December 24, 2021
-
ఇంటినుంచి బయటకొచ్చేసిన రాయ్ దారిలో ఒక గుడికి వెళ్తాడు. అక్కడ సాయి పల్లవి కనిపించింది. ఓ మనోహరమైన పాటతో ఆమె ఎంట్రీ వచ్చింది.
Date & Time : 03:39 AM December 24, 2021
-
ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ పశ్చిమ బెంగాల్లో ఉంటున్న ఒక సామాజిక కార్యకర్తగా పరిచయం అయ్యాడు. అతను అణగారిన మరియు తక్కువ కులాల ప్రజలకు మద్దతు ఇస్తున్నాడు.
Date & Time : 03:27 AM December 24, 2021
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్:నాని పెర్ఫార్మెన్స్, టైమింగ్ పర్ఫెక్ట్. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఇప్పటి వరకు సినిమా ఓకే అనిపించింది. మరి ద్వితీయార్థంలో ఏం జరుగుతుందో చూడాలి.
Date & Time : 03:23 AM December 24, 2021
-
ఈ క్రమంలో నాని గతంలోకి వెళ్లిపోతాడు. ఇప్పుడు ఇంటర్వెల్ సమయం. శ్యామ్ సింగరాయ్ మరియు అతని భార్య రోసీ (సాయి పల్లవి) యొక్క కథ 1969లో ప్రారంభమయ్యింది.
Date & Time : 03:17 AM December 24, 2021
-
ఇప్పుడు కేసు కోర్టులోకి వచ్చింది. మురళీ శర్మ పబ్లిషింగ్ కంపెనీ తరపు అడ్వకేట్‌గా పరిచయం అయ్యాడు. వాసు సినిమా కథ శ్యామ్ సింగ రాయ్‌కి కాపీ అని న్యాయమూర్తికి చెప్పాడు. శుభలేఖ సుధాకర్ న్యాయమూర్తిగా పరిచయం అయ్యారు.
Date & Time : 02:59 AM December 24, 2021
-
మడోన్నా సెబాస్టియన్ లాయర్‌గా పరిచయమైంది. కీర్తి మరియు వాసు ఆమెను కేసును టేకప్ చేయమని అభ్యర్తిస్తారు.
Date & Time : 02:54 AM December 24, 2021
-
మొత్తానికి వాసు సినిమా విడుదలై పెద్ద హిట్ కొట్టింది. అదే సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేసే ఆఫర్ వాసుకు వచ్చింది.
Date & Time : 02:49 AM December 24, 2021
-
వాసు మరియు అతని స్నేహితులు ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. కీర్తి వాసుని అభినందించడానికి పార్టీకి వచ్చింది. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్ జరుగుతోంది.
Date & Time : 02:44 AM December 24, 2021
-
వాసు యొక్క షార్ట్ ఫిల్మ్‌ని ఓ నిర్మాత ఇష్టపడి ఫైనల్ స్కిట్‌తో రమ్మని చెప్పాడు. వాసు క్లైమాక్స్ పార్ట్ రాసి నిర్మాతకు చూపించాడు.
Date & Time : 02:40 AM December 24, 2021
-
చివరకు కీర్తి వాసు యొక్క షార్ట్ ఫిల్మ్‌లో నటించడానికి అంగీకరించింది. ఆమెకు వాసు సన్నివేశాలను వివరించాడు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ వస్తుంది.
Date & Time : 02:28 AM December 24, 2021
-
వాసు కీర్తిని తన షార్ట్ ఫిల్మ్‌లో నటించమని కోరతాడు. కానీ ఆమె దానిని తిరస్కరించింది. కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:25 AM December 24, 2021
-
నాని వాసు అనే చిత్రనిర్మాతగా పరిచయం అయ్యాడు. అతడు ఒక షార్ట్ ఫిల్మ్ కోసం అమ్మాయిలను ఆడిషన్ చేస్తున్నప్పుడు కీర్తి (కృతి శెట్టి)ని చూస్తాడు.
Date & Time : 02:22 AM December 24, 2021
-
సాయి పల్లవి వాయిస్ ఓవర్ తో సినిమా మొదలైంది.
Date & Time : 02:18 AM December 24, 2021
-
హాయ్.. 157 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 02:13 AM December 24, 2021