-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 12:45 AM August 01, 2024
-
ఆ సస్పెన్స్ ఏంటో ఎట్టకేలకు రివీల్ అయ్యింది. ఈ తర్వాత క్లైమాక్స్ కి రంగం సిద్ధం అయ్యింది.
Date & Time : 12:40 AM August 01, 2024
-
ఆ హత్యలకు సంబంధించి సస్పెన్స్ మాత్రం అలా కొనసాగుతుంది. అసలు ఏం జరిగింది అనే ప్రధాన కారణాన్ని బయట పెట్టాలని అశ్విన్ నిర్ణయించుకున్నాడు.
Date & Time : 12:30 AM August 01, 2024
-
ఇప్పుడు అశ్విన్ తన చుట్టూ జరుగుతున్న ఊహించని ఘటనల వెనుక ఉంది ఎవరో కనుక్కోవాలని డిసైడ్ అయ్యాడు. ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:15 AM August 01, 2024
-
కొన్ని సన్నివేశాల తర్వాత కొందరు అనుమానితులతో అశ్విన్ ఫైట్ చేస్తున్న సీక్వెన్స్ వస్తుంది.
Date & Time : 12:05 AM August 01, 2024
-
ఇంటర్వెల్ అనంతరం.. అశ్విన్ కి ఉన్న కొన్ని సమస్యలకు సంబంధించి కొన్ని షాకింగ్ నిజాలు బయటికి వస్తున్నాయి.
Date & Time : 11:55 AM August 01, 2024
-
ఫస్టాఫ్ అప్డేట్: సినిమాలో కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ కథనం కొంచెం తడబడుతుంది. మెయిన్ లీడ్ పెర్ఫామెన్స్ లు బాగున్నాయి. సెకండాఫ్ లో సినిమా ఇంకా ఆసక్తిగా మారుతుందేమో చూడాలి.
Date & Time : 11:50 AM August 01, 2024
-
అశ్విన్ జీవితానికి సంబంధించి ఒక షాకింగ్ నిజం బయటపడింది, ఇప్పుడు విరామం.
Date & Time : 11:40 AM August 01, 2024
-
ఇప్పుడు అశ్విన్ పై కొన్ని ఊహించని పరిణామాలు జరుగుతున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:25 AM August 01, 2024
-
ఇప్పుడు అశ్విన్ బాబు జీవితం కీలక మలుపు తిరిగింది. ఇంకోపక్క హత్యలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది.
Date & Time : 11:15 AM August 01, 2024
-
ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఏదో అనుమానాస్పదంగా జరుగుతున్న సన్నివేశాలు వస్తున్నాయి. అక్కడ రెండు హత్యలు కూడా జరగడంతో ఇప్పుడు సినిమాలో ఆసక్తికర వాతావరణం నెలకొంది.
Date & Time : 11:05 AM August 01, 2024
-
అశ్విన్ బాబు, హైపర్ ఆది లపై కొన్ని కామెడీ సీన్స్ తర్వాత ఇప్పుడు హీరోయిన్ దిగంగన సూర్యవంశీ స్క్రీన్ పైకి వచ్చింది.
Date & Time : 10:55 AM August 01, 2024
-
చైనా, పాకిస్తాన్ కలిసి భారత్ పై దాడికి ప్లాన్ చేస్తున్నాయి. ఈ కీలక పరిస్థితుల్లో హీరో అశ్విన్ బాబు ఒక లోన్ రికవరీ ఏజెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:45 AM August 01, 2024
-
హాయ్.. 124 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 10:30 AM August 01, 2024