మొదటి షో వివరాలు : సీన్
ఒక కొత్త కేసుకు లీడ్ ఇస్తూ సినిమా ఎట్టకేలకు ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
క్లైమాక్స్ సెటప్ ని బాగా చేశారు. అలానే ఏరోప్లేన్ సాంగ్ కూడా చక్కగా కుదిరింది. ఇలా సినిమా క్లైమాక్స్ దిశగా వెళుతుంది.
ఇప్పుడు నెస్లేన్ సూర్య సీక్రెట్ ని తెలుసుకున్నాడు. ఇంకోపక్క సూర్యపై కూడా ఒక అటెంప్ట్ జరిగిన తర్వాత కిల్లర్ ని పట్టుకునే ప్రక్రియ మరింత వేగవంతం అయ్యింది.
మొదటిసారి సూర్య, నెస్లేన్ లు ఇప్పుడు ఎదురయ్యారు. ఇప్పుడు పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి.
ఇప్పుడు సూర్య తన తల్లిదండ్రులు మర్డర్ మిస్టరీ ఛేదించడానికి రెడీ అయ్యారు. అలాగే ఆ కిల్లర్ ని కూడా పట్టుకోవాలని చూస్తున్నారు.
ఇంటర్వెల్ అనంతరం.. నజ్రియా పాత్రలో కొత్త కోణంతో మొదలైంది.
ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పటివరకు సినిమా ఓకే రేంజ్ లో ఉంది. సూర్య లుక్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నెస్లేన్ జస్ట్ ఓకే. కామెడి బాగుంది. కానీ కథనం కొంచెం సాగదీతగా సాగింది. ఇక సెకాండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
మరికొన్ని సన్నివేశాలు తర్వాత సూర్య తల్లిదండ్రులు పరిచయం అయ్యారు. ఇప్పుడు మరో హత్య జరిగింది. సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది.
ఇప్పుడు మరో హత్య చోటుచేసుకుంది. మాయగా నజ్రియా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది. సూర్యతో కొన్ని ఫన్ సీన్స్ వస్తున్నాయి.
సైకోపాత్ సీరియల్ కిల్లర్ గా ఓ ప్రముఖ నటుడు కనిపించాడు. ఈ విచారణలో సూర్య కోసం ఓ షాకింగ్ నిజం బయటకి వచ్చింది.
కొన్ని సన్నివేశాలు తర్వాత ఓ హత్య కేసు, మరో పాత కేసుతో ముడి పడి ఉంది. తాలూకా విచారణ జరుగుతుంది.
ఈశ్వర్ గా యువ నటుడు నెస్లేన్ పరిచయం అయ్యాడు. తన షాకింగ్ ఇంట్రో బాగుంది. ఈ తర్వాత ప్రేమ్ రాజ్ గా సూర్య మంచి హీరోయిక్ ఎంట్రీ ఇచ్చారు.
హాయ్.. 2 గంటల 29 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలవుతుంది.