-
‘శివతాండవం’తో సినిమా ముగింపుకి చేరుకుంటుంది. పూర్తి సమీక్ష కోసం 123తెలుగు.కామ్‌ను ఫాలో అవ్వండి.
Date & Time : 03:00 AM August 29, 2024
-
ఫ్లాష్‌బాక్ ముగియడంతో సోకులపాలంలో ఓ భారీ ఎమోషనల్ క్లైమాక్స్ చోటుచేసుకోనుంది.
Date & Time : 02:55 AM August 29, 2024
-
సూర్యను ఎదురించేందుకు నాని ఓ సరికొత్త ప్లాన్‌తో వేస్తాడు. నాని-సూర్యల మధ్య టామ్ అండ్ జెర్రీ ఆట నడుస్తుంది.
Date & Time : 02:40 AM August 29, 2024
-
నాలుగు విభిన్నమైన అంశాలు ‘శనివారం’పై ఆసక్తిని పెంచేస్తాయి. మురళీశర్మ-సూర్యల అంశం ఓ వినూత్నమైన మలుపు తీసుకుంటుంది.
Date & Time : 02:25 AM August 29, 2024
-
ఎస్.జె.సూర్య ఓ పెద్ద ప్లాన్ వేస్తాడు. దానికి అడ్డుగా నాని బరిలోకి దిగుతాడు. దీంతో ‘శనివారం’ ఏం జరుగుతుందనే ఆసక్తి క్రియేట్ అయ్యింది.
Date & Time : 02:10 AM August 29, 2024
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్:సినిమా ప్రథమార్థం సింపుల్ కథతో సాగింది. ఎస్.జె.సూర్య మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలవగా, నాని తన పాత్రలో మెప్పించాడు. పూర్తి మాస్ ఎంటర్టైనర్ చిత్రానికి కావాల్సిన కమర్షియల్ హంగులు కాస్త తక్కువ అయ్యాయని అనిపిస్తుంది.
Date & Time : 01:45 AM August 29, 2024
-
‘శనివారం’కి సంబంధించి ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీన్ నడుస్తుంది. సోకులపాలెం సమస్యను నాని తన భుజాలపై వేసుకుంటాడు. దీంతో సినిమాలో ఇంటర్వెల్ వస్తుంది.
Date & Time : 01:40 AM August 29, 2024
-
ఫ్యాన్స్‌కి ఓ చక్కటి సర్ప్రైజ్. నాని ‘ఈగ’ సినిమాకు సంబంధించి ఓ చక్కటి రిఫరెన్స్‌తో ‘పీటముడి’కి సమయం వచ్చేసింది.
Date & Time : 01:30 AM August 29, 2024
-
నాని, ప్రియాంకలపై ‘ఉల్లాసం’ అనే పాట వస్తుంది.
Date & Time : 01:25 AM August 29, 2024
-
నాని, ఎస్.జె.సూర్యల మధ్య విరోధం పవర్‌ఫుల్‌గా చూపెట్టారు.
Date & Time : 01:20 AM August 29, 2024
-
ప్రియాంక మోహన్ పాత్రకి సంబంధించి ఓ చిన్న ట్విస్ట్ రివీల్ అయ్యింది. ‘సోకులపాలెం’ను వివరంగా చూపెడుతున్నారు.
Date & Time : 01:10 AM August 29, 2024
-
ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో సాలిడ్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 01:00 AM August 29, 2024
-
హీరోయిన్ ప్రియాంక మోహన్ చారులత అనే ఓ సాధారణ పోలీస్ పాత్రలో పరిచయం అయ్యింది.
Date & Time : 12:55 AM August 29, 2024
-
నాని, అతడి సోదరి(అదితి బాలన్)కి సంబంధించిన సీన్స్ ఎమోషనల్‌గా సాగుతున్నాయి.
Date & Time : 12:50 AM August 29, 2024
-
వివేక్ ఆత్రేయ మార్క్‌లో కథను ప్రస్తుతం, గతం తాలూకా సీన్స్‌తో నడిపిస్తున్నారు.
Date & Time : 12:45 AM August 29, 2024
-
నాని ఓ ఎల్ఐసి ఏజెంట్ పాత్రలో కనిపిస్తాడు. అతడి సోదరి, తోటి ఆఫీస్ ఉద్యోగులకు సంబంధించిన పాత్రలు పరిచయం అయ్యాయి.
Date & Time : 12:40 AM August 29, 2024
-
అజయ్ ఘోష్ గ్యాంగ్‌తో ఓ మాస్ ఫైట్‌తో ‘శనివారం’ మొదటి ఎపిసోడ్ ప్రారంభమవుతుంది.
Date & Time : 12:35 AM August 29, 2024
-
నాని ఓ వినూత్నమైన గెటప్‌లో పరిచయం అయ్యాడు.
Date & Time : 12:35 AM August 29, 2024
-
‘శనివారం’ కాన్సెప్ట్ ఏమిటనేది వివరిస్తూ.. టైటిల్ కార్డ్స్ పడుతున్నాయి.
Date & Time : 12:30 AM August 29, 2024
-
కొన్ని ఎమోషనల్ సీన్స్ కథను ముందుకు తీసుకెళ్తున్నాయి.
Date & Time : 12:25 AM August 29, 2024
-
హీరో తల్లి పాత్రలో అభిరామి కనిపించింది. నాని కోపానికి సంబంధించిన సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 12:20 AM August 29, 2024
-
కథ సోకులపాలెంలో మొదలవుతుంది. హీరో చిన్నతనం ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్లారు.
Date & Time : 12:15 AM August 29, 2024
-
హాయ్.. సినిమా ఇప్పుడే మొదలైంది. ఈ సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలుగా ఉంది.
Date & Time : 12:15 AM August 29, 2024