-
-
సినిమా ఎమోషనల్ నోట్ తో ముగిసింది. చిత్రం పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 07:10 AM September 13, 2018
-
ఇప్పుడు చైతన్య సిస్టర్ పెళ్లికి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి. ఇప్పుడు మరో పాట పెళ్లి పందిరి వస్తోంది.
Date & Time : 07:00 AM September 13, 2018
-
సినిమా క్లయిమ్యాక్స్ దిశగా సాగుతోంది. చై మరియు అను, రమ్యకృష్ణల మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:52 AM September 13, 2018
-
ఇప్పుడు, ట్రైలర్ లో ప్రదర్శించిన టెంపుల్ ఫైట్ వస్తోంది. రమ్య కృష్ణ, చైతన్యను మరియు అనులను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Date & Time : 06:45 AM September 13, 2018
-
సాంగ్ అనంతరం ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:30 AM September 13, 2018
-
టైటిల్ ట్రాక్ శైలజా రెడ్డి అల్లుడు చూడే అనే సాంగ్ వస్తోంది. అలాగే కొన్ని క్యూట్ ఫ్యామిలీ సన్నివేశాలు కూడా ఆకట్టుకునే విధంగా ప్రదర్శించబడుతున్నాయి.
Date & Time : 06:24 AM September 13, 2018
-
ఫైనల్ గా చైతన్య శైలజా రెడ్డి హౌస్ లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం పృథ్వి మరియు చైతూకి మధ్యన ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:18 AM September 13, 2018
-
ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది. ఇప్పుడు ప్రధాన జంట మధ్య మరో అందమైన సాంగ్ 'ఎగిరేగిరే' వస్తోంది.
Date & Time : 06:10 AM September 13, 2018
-
ఈ చిత్రం ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళింది. తల్లి మరియు కుమార్తె మధ్య అంతరాన్ని దారితీసిన కారణాలు ఇప్పుడు ప్రదర్శించబడుతున్నాయి.
Date & Time : 06:05 AM September 13, 2018
-
ఇంటర్వెల్ అనంతరం చైతన్య మరియు వెన్నెల కిశోర్ రమ్యకృష్ణను కలవడానికి వరంగల్ బయలుదేరారు. ప్రముఖ నటులు నరేష్ శైలజా రెడ్డి భర్తగా పృథ్వి ఆమె అసిస్టెంట్ గా పరిచయం చేయబడ్డారు.
Date & Time : 05:56 AM September 13, 2018
-
కథలో ఒక చిన్న ట్విస్ట్. రమ్య కృష్ణ యొక్క శక్తివంతమైన శైలజా రెడ్డి పాత్ర ప్రవేశంతో చిత్రం సగం వరకు వస్తుంది. ఇప్పుడు బ్రేక్
Date & Time : 05:53 AM September 13, 2018
-
చైతు ఫ్యామిలీ అనుని యాక్సెప్ట్ చేశారు. ప్రస్తుతం కొన్ని ఫ్యామిలీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:44 AM September 13, 2018
-
ఇప్పుడు మరో పాట తాను వెతికిన వస్తోంది. నైస్ లిరికల్ సాంగ్.
Date & Time : 05:33 AM September 13, 2018
-
కొన్ని ప్రయత్నాల తరువాత చివరికి చైతన్య అనుకి డిఫరెంట్ గా ప్రపోజ్ చేస్తాడు. ఇప్పుడు ఇరువురి మధ్య వస్తున్న ఒక మంచి సన్నివేశం ఆకట్టుకుంటోంది.
Date & Time : 05:28 AM September 13, 2018
-
ప్రధాన జంటల మధ్య కొన్ని సన్నివేశాల అనంతరం రెండవ సాంగ్ అను బేబీ వస్తోంది.
Date & Time : 05:14 AM September 13, 2018
-
సీనియర్ కమెడియన్ రఘుబాబు అను కాలేజ్ లో లెక్చరర్ గా పరిచయంచేయబడ్డారు. అను అండ్ వెన్నెల కిషోర్, చైతు మధ్యన కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:08 AM September 13, 2018
-
గోల్డ్ రంగు పిల్ల అనే పాటలో అను ఈగో పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ప్రదర్శించబడుతున్నాయి.
Date & Time : 05:00 AM September 13, 2018
-
హీరోయిన్ అను ఇమ్మన్యుఎల్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. మొదటి చూపులోనే చైతన్య ఆమెకు ఆకర్షితుడవుతాడు. కమెడియన్ వెన్నెల కిషోర్ చారిగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 04:57 AM September 13, 2018
-
మురలిశర్మ కథానాయకుడి తండ్రిగా పరిచయం చేయబడ్డారు. నాగచైతన్య కూడా కూల్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇరువురి మధ్య ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:50 AM September 13, 2018
-
హరి కృష్ణ గారికి నివాళులర్పిస్తూ సినిమా స్టార్ట్ అయ్యింది. నాని యొక్క వాయిస్ ఓవర్ తో ఇప్పుడు టైటిల్స్ వస్తున్నాయి.
Date & Time : 04:45 AM September 13, 2018
-
హాయ్.. 148 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 04:40 AM September 13, 2018