-
ఫైనల్ గా మూవీ ముగంపు కి వచ్చింది, కిడ్నాపర్లు పట్టుబడ్డారు. పూర్తి రివ్యూ కోసం మా 123 తెలుగు సైట్ చూస్తూనే ఉండండి
Date & Time : 10:00 PM Sept 15, 2022
-
ప్రస్తుతం హాస్పిటల్ లో భారీ క్లైమాక్స్ సీన్స్ జరుగుతున్నాయి. హీరోయిన్స్ ఇద్దరూ కూడా ఫుల్ యాక్షన్ మోడ్ లో అదరగొడుతున్నారు. యాక్షన్ సీన్స్, స్టంట్స్ అదిరిపోయాయి.
Date & Time : 09:55 PM Sept 15, 2022
-
మొత్తంగా అంతా రివీల్ అయింది. ఎలాగో కష్టపడి అమ్మాయిలు నేరస్థులను పట్టుకుని వారి చెరలో బందీలైన వారిని రక్షించారు. ప్రస్తుతం క్లైమాక్స్ దిశగా మూవీ సాగుతోంది.
Date & Time : 09:45 PM Sept 15, 2022
-
కిడ్నపర్ల యొక్క ప్రధాన అవసరం, ఉద్దేశ్యం ఏమిటనేది ఇప్పుడు రివీల్ అవడంతో పాటు ఇందులో మెడికల్ మాఫియా ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది
Date & Time : 09:40 PM Sept 15, 2022
-
మెయిన్ విలన్ గా కబీర్ దుహాన్ సింగ్ పరిచయం అయ్యాడు. ఇప్పటివరకు కథ రొటీన్‌గా ఉంది అయితే థ్రిల్లింగ్ సీన్స్ మాత్రం దాదాపుగా ఓకే అనే చెప్పాలి
Date & Time : 09:30 PM Sept 15, 2022
-
అమ్మాయిలు మెల్లగా కిడ్నాపర్లని కనిపెట్టే దారి వెతుకుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్స్ యొక్క పూర్తి యాక్షన్ సీన్స్ వస్తున్నాయి. అటు రెజీనా, ఇటు నివేతా ఇద్దరూ కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు.
Date & Time : 09:20 PM Sept 15, 2022
-
ఇప్పుడే కమెడియన్ సత్య ఎంట్రీ ఇచ్చారు. విచారణలో భాగంగా ప్రస్తుతం కొన్ని కామెడీ కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:10 PM Sept 15, 2022
-
ఇంటర్వెల్ తర్వాత సినిమా సీరియస్ మోడ్ లోకి మారింది. అమ్మాయిలు కిడ్నపర్ల కోసం తమ సొంత విచారణ ప్రారంభించారు
Date & Time : 09:00 PM Sept 15, 2022
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ :సినిమా ఇంటర్వెల్ కి ముందే మెయిన్ ప్లాట్ లోకి ప్రవేశించింది. కామెడీ బాగుంది, మెయిన్ క్యారెక్టర్స్ చేసిన రెజీనా, నివేతలు బాగానే నటించారు. కాగా ఇంటర్వెల్ తరువాత సెకండాఫ్ కీలకంగా మారనుంది
Date & Time : 08:45 PM Sept 15, 2022
-
ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కేసును స్వయంగా ఛేదించాలని అమ్మాయిలు పోలీసులను నిలదీశారు. కాగా సినిమా ఇప్పుడు ఇంటర్వెల్ కి వచ్చింది.
Date & Time : 08:40 PM Sept 15, 2022
-
చివరకు మూవీలో ఒక ట్విస్ట్ వచ్చింది. ఒక కిడ్నాప్ జరిగడంతో వారిని ఎలాగైనా పట్టుకోవాలని అమ్మాయిలు సిద్ధమయ్యారు
Date & Time : 08:35 PM Sept 15, 2022
-
హీరోయిన్ల మధ్య ఉన్న శత్రుత్వం ఇప్పుడు వీగిపోయింది. ప్రస్తుతం వారిద్దరి స్నేహానికి సంబంధించిన సన్నివేశాలు వస్తుండగా సినిమా ఇంకా మెయిన్ ప్లాట్ లోకి ప్రవేశించలేదు
Date & Time : 08:30 PM Sept 15, 2022
-
పోలీస్ అకాడమీ చీఫ్‌గా సీనియర్ నటుడు భానుచందర్ వచ్చారు. కొన్ని సరదా ట్రైనింగ్ సీన్స్ వస్తుండగా నివేత తన పాత్రలో మంచి ఫన్ తో ఆకట్టుకుంటోంది
Date & Time : 08:15 PM Sept 15, 2022
-
30 ఇయర్స్ పృధ్వీ, సుదర్శన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. రెజీనా పాష్ గర్ల్ గా నివేత లోకల్ అమ్మాయిగా కనిపించగా ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు
Date & Time : 08:00 PM Sept 15, 2022
-
ఇప్పుడే నివేదా థామస్ షాలినిగా పరిచయమైంది. ఆమె మరియు రెజీనా ఇద్దరూ పోలీసు శిక్షణ కోసం వచ్చారు.
Date & Time : 07:50 PM Sept 15, 2022
-
పోలీస్ అకాడమీ బ్యాక్ డ్రాప్ లో మూవీ ప్రారంభం కాగా నటి రెజీనా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది
Date & Time : 07:45 PM Sept 15, 2022
-
హాయ్, 118 నిమిషాల నిడివి గల మూవీ ఇప్పుడే మొదలైంది
Date & Time : 07:40 PM Sept 15, 2022