-
ఓ క్లీన్ సీన్ తో క్లైమాక్స్ పూర్తయ్యింది. మరి పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:15 AM December 25, 2020
-
క్లైమాక్స్ కు రంగం సిద్ధం అయ్యింది. ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి, ఇదంతా సిల్లీగా ఉంది.
Date & Time : 11:11 AM December 25, 2020
-
మొత్తానికి హీరోయిన్ లవ్ పై క్లారిటీ తెచ్చుకుంటుంది. రాజేంద్ర ప్రసాద్ కీలక లెక్చర్ సీన్ తో క్లైమాక్స్ దిశగా సినిమా వెళ్తుంది.
Date & Time : 11:08 AM December 25, 2020
-
ఓ కీలక ట్విస్ట్ ఇప్పుడు చోటు చేసుకుంది. రావు రమేష్ పై కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 11:03 AM December 25, 2020
-
సెకండాఫ్ కొంచెం స్లో అయ్యినట్టు అనిపిస్తుంది, రొటీన్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి.
Date & Time : 10:58 AM December 25, 2020
-
ఇప్పుడు మరో సాంగ్ వస్తుంది. ఈ హార్ట్ బ్రేకింగ్ సాంగ్ లో తేజ్ స్టెప్స్ బాగున్నాయి.
Date & Time : 10:55 AM December 25, 2020
-
ఇప్పుడు హైపర్ ఆది స్క్రీన్ లో ఎంటర్ అయ్యాడు. ఓ రేంజ్ లో కామెడీ సీన్స్ నడుస్తున్నాయి.
Date & Time : 10:47 AM December 25, 2020
-
తేజ్ తన ట్రిక్స్ తో నభా ను పడేయాలని చూస్తున్నాడు కానీ ఆమె అవేవి వర్కౌట్ అవ్వనివ్వట్లేదు. ఆ సంబంధిత సన్నివేశాలే వస్తున్నాయి.
Date & Time : 10:45 AM December 25, 2020
-
కొన్ని కాలేజీ సన్నివేశాలు వస్తున్నాయి. అతని నో పెళ్లి ఫిలాసఫి మారింది కానీ అతను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అలాగే సమస్యలు కూడా కనిపిస్తున్నాయి.
Date & Time : 10:36 AM December 25, 2020
-
మరో ట్విస్ట్ తో లవ్ యాంగిల్ తో మరో సాంగ్ మొదలయింది. ఇందులో నభా చాలా నాచురల్ గా కనిపిస్తుంది.
Date & Time : 10:30 AM December 25, 2020
-
నభా నటేష్ తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. అలాగే తేజ్ లవ్ స్టోరీలో మరో క్రేజీ ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 10:29 AM December 25, 2020
-
ఇంటర్వెల్ అనంతరం, సాయి తేజ్ మరియు వెన్నెల కిషోర్ మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:25 AM December 25, 2020
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ :ఇప్పటి వరకు సినిమా నీట్ గా కొనసాగింది. మంచి పాటలు, డీసెంట్ కామెడీ అలాగే సింపుల్ ట్విస్టులతో సజావుగానే సాగింది. సాయి తేజ్ ఈ ఫన్ ఎంటర్టైనర్ లో బాగా కనిపించాడు. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:05 AM December 25, 2020
-
మరో క్రేజీ ఫన్నీ ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ కు సినిమా చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:01 AM December 25, 2020
-
ఇప్పుడు హీరోయిన్ నభా నటేష్ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా ఇంటర్వెల్ సమయానికి కరెక్ట్ గా వచ్చింది.
Date & Time : 10:00 AM December 25, 2020
-
ఇప్పుడు తేజ్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి. అలాగే ఫన్నీ ట్విస్ట్ తో సినిమా సగానికి చేరుకుంటుంది.
Date & Time : 09:53 AM December 25, 2020
-
ఇపుడు చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. తేజ్ నో పెళ్లి కాన్సెప్ట్ కు దెబ్బ పడింది. ఇప్పుడు తేజ్ మరియు రావు రమేష్ ల నడుమ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:43 AM December 25, 2020
-
మరో ఫన్ సాంగ్ నో పెళ్లి స్టాట్ అయ్యింది. ఇందులో లొకేషన్స్, స్టెప్స్ బాగున్నాయి.
Date & Time : 09:30 AM December 25, 2020
-
సాయి తేజ్ హైదరాబాద్ కు వచ్చి ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు వెన్నెల కిషోర్ కూడా పరిచయం అయ్యాడు, కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:22 AM December 25, 2020
-
ఇప్పుడు సాయి తేజ్ తండ్రిగా నరేష్, అలాగే మావయ్యగా రావు రమేష్ పరిచయం అయ్యారు. అతడే నో పెళ్లి అనే కాన్సెప్ట్ ను సాయి తేజ్ బుర్రలోకి ఎక్కించాడు.
Date & Time : 09:14 AM December 25, 2020
-
ఇప్పుడు ఫన్నీ విజువల్స్ తో టైటిల్ సాంగ్ వస్తుంది.కమెడియన్ సత్య కూడా స్క్రీన్ పై యాడ్ అయ్యాడు.
Date & Time : 09:07 AM December 25, 2020
-
ఒక సీరియస్ సన్నివేశంతో చిత్రం మొదలయ్యింది,సాయి తేజ్ కటౌట్ ను తగలబడుతున్న సన్నివేశంలో సాయి తేజ్ వాయిస్ ఓవర్ లో తన కోసం చెప్పుకుంటున్నాడు.
Date & Time : 09:00 AM December 25, 2020
-
హాయ్...126 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 08:55 AM December 25, 2020