-
ఈ పోరాట సన్నివేశం అనంతరం సినిమా క్లైమాక్స్ ముగిసి కథ సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 09:08 AM December 20, 2019
-
భూమిక మరియు వేదికలు బాలకృష్ణకు అతని గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఇదే సమయంలో బాలయ్యను విలన్స్ గ్యాంగ్ దగ్గరకే తీసుకెళ్లి వారితో పోరాటం చెయ్యమని అడుగుతారు.ఇప్పుడు మరో యాక్షన్ సీన్.
Date & Time : 09:00 AM December 20, 2019
-
ఈ ఫైట్ లో బాలయ్య తీవ్రమైన గాయాలపాలయ్యాడు.ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది.
Date & Time : 08:55 AM December 20, 2019
-
విలన్ గ్యాంగ్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ ను చంపేసి భూమికను వెతకడానికి వెళ్తున్నారు.విలన్ పై కంప్లైంట్ ఇచ్చేందుకు భూమిక ఓ ట్రైన్ ను పట్టుకోగా బాలయ్య కూడా అదే ట్రైన్ లోకి ఎంటర్ అయ్యాడు.ఇప్పుడు మరో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్ కు రంగం సిద్ధం అయ్యింది.
Date & Time : 08:42 AM December 20, 2019
-
విలన్స్ గ్యాంగ్ రైతుల నుంచి భూములను లాక్కునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.సంబంధిత కీలక సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 08:42 AM December 20, 2019
-
ఇప్పుడు బాలయ్య మరియు వేదికలకు పెళ్లి నిశ్చయం అయ్యింది.ఈ నేపథ్యంలో యెలా యెలా పాట మొదలయ్యింది.
Date & Time : 08:35 AM December 20, 2019
-
ఇప్పుడు సప్తగిరి మరియు వేదికల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:30 AM December 20, 2019
-
సినిమాలోని మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ చేసిన పనితో అతని కుటుంబం అంతటిని చంపాలని చూస్తుండగా వారిని కాపాడేందుకు బాలయ్య ఎంటర్ అయ్యాడు.ఇప్పుడు మరో ఫైట్ సీన్ వస్తుంది.
Date & Time : 08:24 AM December 20, 2019
-
ఇప్పుడు ప్రకాష్ రాజ్, భూమిక మరియు ఆర్యన్ రాజేష్ లు పరిచయం అయ్యారు.రాజేష్ మరియు భూమికలు పెళ్లి చేసుకుంటుండగా భూమిక తండ్రి ప్రకాష్ రాజ్ ఆ పెళ్లిని ఆపేసాడు.
Date & Time : 08:20 AM December 20, 2019
-
కొన్ని కామెడీ సీన్స్ అనంతరం సంకాంత్రి పండుగ సాంగ్ మొదలైయింది.
Date & Time : 08:10 AM December 20, 2019
-
రైతుల గొప్పదనాన్ని ఉద్దేశించి బాలయ్య కొన్ని అద్దిరిపోయే డైలాగ్స్ చెప్తున్నారు.
Date & Time : 08:02 AM December 20, 2019
-
ఇప్పుడు రైతులకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.పంటను వారు అమ్మెందుకు ప్రయత్నిస్తుండగా విలన్ గ్యాంగ్ వారిని భయపెడుతున్నారు.ఇప్పుడు వారిని అడ్డుకునే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు మరో ఫైట్ సీన్.
Date & Time : 08:00 AM December 20, 2019
-
ఓ ఊహించిన ట్విస్ట్ తోనే సినిమా ఇప్పుడు సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.
Date & Time : 07:58 AM December 20, 2019
-
యూపీ లోని ఫైట్ సీన్ అయ్యిపోయింది.అక్కడి ప్రజలు బాలకృష్ణను గుర్తు పట్టి ధర్మ అని పిలవడం మొదలు పెట్టారు.ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు వెళ్ళింది.
Date & Time : 07:55 AM December 20, 2019
-
ఇప్పుడు ఓ గుడి దగ్గర మరో పవర్ ఫుల్ డైలాగ్ వస్తుంది.ఇపుడు మరో యాక్షన్ సీన్..
Date & Time : 07:46 AM December 20, 2019
-
యూపి లోని ఓ సోలార్ ప్రాజెక్ట్ టెండరింగ్ విషయంలో జయసుధ ఎదుర్కొన్న చేదు ఘటనను బాలయ్యకు వివరించింది.దానితో ఆ యూపీ రాష్ట్రానికే దూరంగా ఉండమని సూచించింది.కానీ వారిని ఎదుర్కొనేందుకు బాలయ్య అక్కడకు వెళ్ళాడు.
Date & Time : 07:42 AM December 20, 2019
-
ఇప్పుడు వేదికను విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు.సంబంధిత ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:35 AM December 20, 2019
-
ఇప్పుడు రెండో హీరోయిన్ వేదిక ఎంటర్ అయ్యింది.
Date & Time : 07:30 AM December 20, 2019
-
శ్రీనివాస్ రెడ్డి,ధనరాజ్ మరియు రఘు బాబుల మధ్య ఇప్పుడు మరిన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:23 AM December 20, 2019
-
ఇపుడు బ్యాంగ్ కాక్ లోనే కొన్ని సన్నివేశాల అనంతరం బాలయ్య మరియు సోనాల్ ల మధ్య పడతాడు తాడు సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 07:19 AM December 20, 2019
-
బాలయ్య మరియు సోనాల్ చౌహాన్ వారి టీమ్ సభ్యులు అంతా కలిసి ఇప్పుడు బ్యాంగ్ కాక్ లో అడుగు పెట్టారు.
Date & Time : 07:15 AM December 20, 2019
-
ఇప్పుడు సోనాల్ చౌహాన్,శ్రీనివాస్ రెడ్డి మరియు కమెడియన్ ధన్ రాజ్, రఘు బాబుల మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 07:12 AM December 20, 2019
-
ఇప్పుడు యాక్షన్ హీరో సాంగ్ మొదలయ్యింది.అనంతరం బాలయ్యకు పోటీగా హీరోయిన్ సోనాల్ చౌహన్ మరో ఐటి కంపెనీ హెడ్ గా ఎదురు వస్తుంది.
Date & Time : 07:07 AM December 20, 2019
-
బాలయ్య తన పవర్ ఫుల్ డైలాగ్స్ తో థియేటర్ స్క్రీన్ ను హోరెత్తిస్తున్నారు.
Date & Time : 07:05 AM December 20, 2019
-
ఇప్పుడు ఒక అదిరిపోయే స్టైలిష్ ఎంట్రీతో ఓ కార్పోరేట్ హెడ్ గా బాలయ్య ఎంట్రీ ఇచ్చారు.టోనీ స్టార్క్ లుక్ లో భలే సెట్టయ్యారు.
Date & Time : 07:00 AM December 20, 2019
-
ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారవేత్తగా సీనియర్ నటి జయసుధ ఎంటర్ అయ్యారు.ఆమె బాలయ్యను తన వ్యాపారాలను కాపాడుతాడనే నమ్మకంతో దత్తత తీసుకోవాలనే ప్లాన్ చేస్తుంది.
Date & Time : 06:56 AM December 20, 2019
-
బాలకృష్ణ తీవ్రమైన గాయాలతో ఓ రోడ్ మీదున్న సన్నివేశాలతో చిత్రం మొదలయ్యింది.అతన్ని ఇప్పుడు షియాజీ షిండే హాస్పిటల్ లో జాయిన్ చేసాడు.
Date & Time : 06:53 AM December 20, 2019
-
హాయ్..150 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 06:50 AM December 20, 2019