-
మొత్తానికి కథ సుఖాంతమైంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 07:27 AM Mar 29, 2025
-
అవైటెడ్ డేవిడ్ వార్నర్ కామియోతో సినిమాకి సీక్వెల్ లీడ్ ని హింట్ ఇచ్చిన సీన్స్ ఇపుడు వస్తున్నాయి.
Date & Time : 07:25 AM Mar 29, 2025
-
మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆడియెన్స్ కి నచ్చే రీతిలో ఒకటి కొనసాగుతుంది.
Date & Time : 07:20 AM Mar 29, 2025
-
విలన్ పై దర్శకుడు వెంకీ కుడుముల తన మార్క్ సీన్ ని ఇపుడు చూపిస్తున్నారు.
Date & Time : 07:10 AM Mar 29, 2025
-
ఒక ఎమోషనల్ ట్విస్ట్ తర్వాత సినిమా క్లైమాక్స్ దిశగా వెళుతుంది.
Date & Time : 07:05 AM Mar 29, 2025
-
ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ సీన్ తో భీష్మ తరహా ట్విస్ట్ ఇపుడు చోటు చేసుకుంది.
Date & Time : 06:55 AM Mar 29, 2025
-
ప్రస్తుతం మరో ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ వస్తుంది.
Date & Time : 06:45 AM Mar 29, 2025
-
కొన్ని ఎమోషనల్ సీన్స్ తర్వాత కేతిక శర్మ స్పెషల్ సాంగ్ అదిదా సర్ప్రైజు మొదలైంది.
Date & Time : 06:40 AM Mar 29, 2025
-
ఇప్పుడు నితిన్, శ్రీలీల కలిసి విలన్ పై ఇంట్రెస్టింగ్ ఫేస్ ఆఫ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:30 AM Mar 29, 2025
-
ఇప్పుడు వన్ మోర్ టైం సాంగ్ లీడ్ పెయిర్ నడుమ మొదలయింది. నితిన్, శ్రీలీల సాంగ్ లో అదరగొడుతున్నారు.
Date & Time : 06:15 AM Mar 29, 2025
-
ఇంటర్వెల్ అనంతరం.. విలన్ పవర్ ప్యాకెడ్ రీఎంట్రీతో సినిమా మొదలైంది.
Date & Time : 06:10 AM Mar 29, 2025
-
ఫస్టాఫ్ రిపోర్ట్:ఇప్పటివరకు సినిమా ఎంటర్టైనింగ్ గా సాగింది. కామెడీ, యాక్షన్ సీక్వెన్స్ లు బానే వర్కవుట్ అయ్యాయి. లీడ్ పెయిర్ కూడా బాగున్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ల కామెడీ బాగుంది. జీవి ప్రకాష్ సంగీతం కూడా ఓకే. సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి. దీని బట్టి బాక్సాఫీస్ దగ్గర సినిమా రేంజ్ ఆధారపడి ఉంది.
Date & Time : 06:05 AM Mar 29, 2025
-
ఇప్పుడు శ్రీలీలని కాపాడేందుకు నితిన్ ఒక మిషిన్ లో ఉన్నాడు. ఇలా సినిమా ఇంటర్వెల్ దిశగా వెళుతుంది.
Date & Time : 05:55 AM Mar 29, 2025
-
కొన్ని కామెడీ సీన్స్ తర్వాత సినిమా కొంచెం సీరియస్ గా మారింది.
Date & Time : 05:40 AM Mar 29, 2025
-
ఇప్పుడు నితిన్ శ్రీలీల నడుమ వేర్ ఎవర్ యూ గో సాంగ్ మొదలైంది.
Date & Time : 05:35 AM Mar 29, 2025
-
ఇప్పుడు శ్రీలీల ఇండియాకి చేరుకుంది. ఆమె రాకపై సస్పెన్స్ నెలకొంది.
Date & Time : 05:25 AM Mar 29, 2025
-
నట కిరీటి రాజేంద్రప్రసాద్ పై తన సెక్యురిటి ఏజెన్సీ గ్యాంగ్ పై కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:20 AM Mar 29, 2025
-
ఇప్పుడు హీరోయిన్ శ్రీలీల పరిచయం అయ్యింది. అలాగే బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ లు కూడా స్క్రీన్ పైకి వచ్చారు.
Date & Time : 05:15 AM Mar 29, 2025
-
ప్రస్తుతం నితిన్, షైన్ టామ్ చాకో లపై కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ సాగుతున్నాయి..
Date & Time : 05:10 AM Mar 29, 2025
-
ఇప్పుడు నితిన్ ఒక స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులోనే టైటిల్ సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 05:05 AM Mar 29, 2025
-
ఒక పోలీస్ గా మళయాళ నటుడు షైన్ టామ్ చాకో పరిచయం అయ్యాడు. నితిన్ ని పట్టుకునే మిషిన్ లో తను ఉన్నాడు.
Date & Time : 04:55 AM Mar 29, 2025
-
ఇప్పుడు కథ ఇండియాకి షిఫ్ట్ అయ్యింది. రాబిన్ హుడ్ ఎలా తయారవుతున్నాడు అనే దానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:50 AM Mar 29, 2025
-
శ్రీలంకలో విలన్ మరియు తన గ్యాంగ్ ని పరిచయం చేస్తున్న సన్నివేశాలతో సినిమా ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో మొదలైంది.
Date & Time : 04:45 AM Mar 29, 2025
-
హాయ్.. 2 గంటల 38 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 04:40 AM Mar 29, 2025