
మొదటి షో వివరాలు : రెట్రో
ఒక నాన్ వైలెన్స్ యాక్షన్ సీన్ తో సినిమా పూర్తయ్యింది. పూర్తి సమీక్ష కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
సూర్యపై ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇపుడు రివీల్ అయ్యింది. మరో సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ఇపుడు మొదలయింది.
జోజు జార్జ్ మళ్లీ సూర్య దగ్గరకి వచ్చారు. గోల్డ్ ఫిష్ కోసం జరుగుతున్న డిస్కషన్ తర్వాత ఓ స్పెషల్ సాంగ్ శ్రియా శరన్ పై మొదలైంది.
ఇప్పుడు మళ్లీ లీడ్ నటీనటులు విడిపోయారు. సూర్య విలన్ గ్యాంగ్ తో చేరిపోయాడు. ఓ సాలిడ్ యాక్షన్ సీన్ ఇప్పుడు పూర్తయ్యింది.
ఇంటర్వెల్ అనంతరం.. మెయిన్ లీడ్ నడుమ సీన్స్ తో మొదలైంది. ఇంకోపక్క యుద్ధం కోసం ఎదురు చూస్తున్న విలన్ పై ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి.
ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పుడు వరకు సినిమా ఓకే రేంజ్ లో ఉంది. సూర్య డిఫరెంట్ లుక్స్ లో మంచి పెర్ఫార్మెన్స్ ని కనబరిచారు. అలాగే కథనం కూడా నీట్ గా సాగింది. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుంది.
సూర్య మళ్లీ పూజాని కలిసాడు. మరిన్ని సన్నివేశాలు కొనసాగుతున్నాయి.
ఆ ఘటన తర్వాత సూర్య జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. సూర్య అక్కడ నుంచి తప్పించుకుని అండమాన్ దీవికి చేరుకున్నాడు.
అదే పెళ్లిపై ఒక క్రేజీ సింగిల్ షాట్ సీక్వెన్స్ తో సాగుతోంది. ఇక్కడే ఓ షాకింగ్ ఘటన ఈ పెళ్లిలో జరిగింది.
పూజా హెగ్డే ఎంట్రీ తర్వాత సూర్యతో కొన్ని రొమాంటిక్ సీన్స్ వచ్చాయి. బుజ్జమ్మ సాంగ్ తో ఇద్దరి పెళ్లి సీన్స్ వస్తున్నాయి.
చిన్ననాటి సన్నివేశాలు తర్వాత 1993 ఆఫ్రికాకి సినిమా చేరుకుంది. ఈ సీన్స్ తర్వాత సూర్యపై సాలిడ్ యాక్షన్ సీన్ తో ఎంట్రీ ఇచ్చారు.
సినిమా కాకినాడ సన్నివేశాలతో మొదలైంది. నటుడు జోజు జార్జ్ పరిచయం అయ్యారు. ఇపుడు సూర్య చిన్ననాటి సీన్స్ వస్తున్నాయి.
హాయ్.. 2 గంటల 48 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.