-
సినిమా పూర్తయ్యింది, పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 07:33 AM October 01, 2021
-
ఒక హత్తుకునే మూమెంట్ తో సినిమా సుఖాంతం అయ్యింది.
Date & Time : 07:28 AM October 01, 2021
-
ఒక ఊహించని ట్విస్ట్ తో సినిమా మొదటి సీన్ కి లింక్ చేస్తూ కథనం మారి క్లైమాక్స్ దిశగా కొనసాగుతుంది.
Date & Time : 07:25 AM October 01, 2021
-
ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కోర్ట్ డ్రామా సన్నివేశం స్టార్ట్ అయ్యింది. సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:21 AM October 01, 2021
-
జగపతిబాబు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇప్పుడు వస్తుంది. మరో విలన్ గా రవి వర్మ పరిచయం అయ్యారు.
Date & Time : 07:15 AM October 01, 2021
-
తేజ్ మరియు రమ్యకృష్ణ ల మధ్య మంచి పవర్ ఫుల్ సన్నివేశాలు కొనసాగుతున్నాయి.
Date & Time : 06:47 AM October 01, 2021
-
ఇప్పుడు మైరా ని కాపాడేందుకు తేజ్ మరియు రమ్య కృష్ణల మధ్య ఇంటెన్స్ పోటాపోటీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:28 AM October 01, 2021
-
ఇంటర్వెల్ అనంతరం. మైరా రోల్ పై ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో సినిమా స్టార్ట్ అయ్యింది.
Date & Time : 06:24 AM October 01, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ :ఇప్పుడు వరకు అంతా సజావుగానే ఉందని చెప్పాలి. తేజ్ నటన ఎమోషన్స్, ముఖ్యంగా దేవా కట్ట కథనం డైలాగులు ఆసక్తిగా అనిపించాయి. అలాగే రమ్య కృష్ణ రోల్ కూడా సాలిడ్ గా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ తో ఇక్కడ నుంచి సెకాండఫ్ కీలకంగా మారుతుంది అనిపిస్తుంది. చూడాలి అదెలా ఉంటుందో.
Date & Time : 06:19 AM October 01, 2021
-
ఒక సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ బ్లాక్ కి రంగం సిద్ధం. రమ్యకృష్ణ కీలక అనుచరుడు చంపబడ్డాడు. ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఇప్పుడు విరామం.
Date & Time : 06:18 AM October 01, 2021
-
ఫైనల్ గా అభి కలెక్టర్ అయ్యాడు.. కొన్ని పవర్ ఫుల్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 06:09 AM October 01, 2021
-
ఇప్పుడు నటుడు రాహుల్ రామకృష్ణ పై కీలక సన్నివేశం వస్తుంది. అలాగే దీని తర్వాత దేవా మార్క్ రైటింగ్ లో ఇంట్రెస్టింగ్ ఐఏఎస్ ఇంటర్వ్యూ సన్నివేశం మొదలయ్యింది.
Date & Time : 06:00 AM October 01, 2021
-
మైరా సోదరుడు మిస్సింగ్ కేసుని ఇపుడు తేజ్ డీల్ చేస్తున్నాడు. దీని వెనుక పెద్ద హస్తాలే ఉన్నట్టు చూపిస్తున్నారు.
Date & Time : 05:48 AM October 01, 2021
-
కొత్తగా ఎన్నిక కాబడిన రూలింగ్ పార్టీ లీడర్ గా పవర్ ఫుల్ నెగిటివ్ రోల్ లో రమ్య కృష్ణ పాత్ర ఇప్పుడు పరిచయం అయ్యింది. ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:37 AM October 01, 2021
-
ఇప్పుడు మైరా గా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పరిచయం అయ్యింది. తనకి సాయి తేజ్ మధ్య కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:22 AM October 01, 2021
-
సినిమాలో మొదటి సాంగ్ తో ఒక ఎలక్షన్ రిగ్గింగ్ సన్నివేశం వస్తుంది. దీనితోనే టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి.
Date & Time : 05:13 AM October 01, 2021
-
ఇప్పుడు సాయి తేజ్ చిన్ననాటి సన్నివేశాలు వస్తున్నాయి. జగపతిబాబు తన తండ్రిగా నటి ఆమని తేజ్ పిన్ని పాత్రల్లో పరిచయం అయ్యారు. తేజ్ రోల్ పేరు అభి.
Date & Time : 05:07 AM October 01, 2021
-
ఒక సింపుల్ ఇంట్రోతో సాయి తేజ్ పరిచయం అయ్యాడు. ఇపుడు సినిమా 1970 కాలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోకి వెళ్ళింది.
Date & Time : 04:59 AM October 01, 2021
-
పవన్ కళ్యాణ్ కి సాయి కుమార్ కి స్పెషల్ థాంక్స్ చెబుతూ సినిమా మొదలైంది.
Date & Time : 04:55 AM October 01, 2021
-
హాయ్..152 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 04:50 AM October 01, 2021