-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 12:50 AM April 26, 2024
-
విశాల్ తన శత్రుశేషం మిగల్చకూడదు అని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో ఓ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ మొదలైంది.
Date & Time : 12:35 AM April 26, 2024
-
ఇప్పుడు ఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా గౌతమ్ మీనన్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 12:20 AM April 26, 2024
-
ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 12:10 AM April 26, 2024
-
విశాల్ కి సంబంధించి ఓ షాకింగ్ నిజాన్ని ప్రియా భవాని శంకర్ ఇప్పుడు తెలుస్తుంది. ఈ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:00 AM April 26, 2024
-
ఇప్పుడొక ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్ వస్తుంది. విశాల్, ప్రియా భవాని శంకర్ ని విలన్ గ్యాంగ్ నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు.
Date & Time : 11:50 AM April 26, 2024
-
ఇప్పుడు మురళీశర్మ పై కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి. అలాగే మరోపక్క విశాల్ కి విలన్స్ కి మధ్య సీన్స్ కూడా కనిపిస్తున్నాయి.
Date & Time : 11:40 AM April 26, 2024
-
ఫస్టాఫ్ అప్డేట్ :
ఇప్పుడు వరకు సినిమా జస్ట్ ఓకే రేంజ్ లోనే ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, యాక్షన్ సీక్వెన్స్ లు బాగున్నాయి, కానీ కథ, కథనం రొటీన్ గానే సాగాయి. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 11:30 AM April 26, 2024
-
ఇప్పుడు ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 11:20 AM April 26, 2024
-
ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సీన్ సింగిల్ టేక్ లో 5 నిమిషాల పాటు డిజైన్ చేసింది నీట్ గా ప్రెజెంట్ చేయబడింది. దీనితో పాటుగా ప్రాణం నా ప్రాణం సాంగ్ కి మరో వెర్షన్ వస్తుంది.
Date & Time : 11:10 AM April 26, 2024
-
ఇప్పుడు కథనంలో ఓ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. సముద్రఖని ఓ షాకింగ్ నిజాన్ని తెలుసుకున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:00 AM April 26, 2024
-
ప్రస్తుతం ప్రాణం నా ప్రాణం సాంగ్ ఓ యాక్షన్ సీక్వెన్స్ తో వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ వింటేజ్ టచ్ ఇందులో కనిపిస్తూ ఇంపుగా ఉంది.
Date & Time : 10:50 AM April 26, 2024
-
ఇప్పుడు హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఓ డాక్టర్ కావాలి అని కోరుకుంటుంది.
Date & Time : 10:30 AM April 26, 2024
-
నటుడు సముద్రఖని చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేగా కనిపిస్తున్నారు. అలాగే విశాల్ తన మనిషిగా కనిపిస్తున్నాడు.
Date & Time : 10:20 AM April 26, 2024
-
ఇప్పుడు సినిమా ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో దృశ్యాలతో కనిపిస్తుంది. ఓ ఎమోషనల్ సాంగ్ కూడా వస్తుంది.
Date & Time : 10:10 AM April 26, 2024
-
హాయ్..156 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 10:00 AM April 26, 2024