-
ఊహించని విధంగా సినిమా చివర్లో ట్విస్ట్. వైలెంట్ నోట్ తో సినిమా కథ ఎండ్ అయ్యింది. చిత్రం పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 06:10 AM March 30, 2018
-
ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది. అలాగే రెండు సంవత్సరాలు గడిచిపోయింది. అయినా సినిమాలోని సస్పెన్స్ బయటపడలేదు. ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:00 AM March 30, 2018
-
చరణ్ చాలా ఆవేశంగా ఆయుధంతో వెళుతోన్న కొన్ని యాక్షన్ సన్నివేశాలు వస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది.
Date & Time : 05:49 AM March 30, 2018
-
జగపతిబాబు అసిస్టెంట్లు ఆది పై ఎటాక్ చేస్తారు. అందుకు సంబంధించిన సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 05:37 AM March 30, 2018
-
ఊర మాస్ ఐటెమ్ సాంగ్ జిగేలు రాణి పాట వచ్చేసింది. పాటలో చరణ్ అద్భుతమైన స్టెప్పులతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సాంగ్ బి అండ్ సి సెంటర్స్ ప్రేక్షకులను బాగా ఆకర్షించే ఛాన్స్ ఉంది.
Date & Time : 05:30 AM March 30, 2018
-
కథలో ఒక చిన్న ట్విస్ట్. అన్నదమ్ములు ఇద్దరు ఊహించని విధంగా విడిపోతారు. సమంత - చరణ్ మధ్య ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:24 AM March 30, 2018
-
క్రూరమైన అధ్యక్షుడైన జగపతిబాబు యొక్క కొన్ని దురాగతాలు ఇప్పుడు ప్రదర్శించబడుతున్నాయి. మరొక వైపు అదే తరహాలో ఒక తీవ్రమైన ఎలక్షన్ డ్రామా సన్నివేశాలు కొనసాగుతున్నాయి.
Date & Time : 05:15 AM March 30, 2018
-
ఈ చిత్రం కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లింది.. ఇప్పుడు కొన్ని ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి. ఇదే తరుణంలో ఫోక్ సాంగ్ ఆ గట్టునుంటావా.. అనే సాంగ్ కూడా వస్తోంది.
Date & Time : 05:03 AM March 30, 2018
-
ఇంటర్వెల్ తరువాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ - రామ్ చరణ్ మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:49 AM March 30, 2018
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటివరకు ఈ చిత్రం కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలతో చాలా అద్భుతమైన విలేజ్ డ్రామాగా కొనసాగింది. రామ్ చరణ్ నటన ఫస్ట్ హాఫ్ లో ప్లస్ పాయింట్. ఇక సన్నివేశాలు కొనసాగిన తీరు అద్భుతమైన విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
Date & Time : 04:40 AM March 30, 2018
-
కుమార్ బాబు గ్రామ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు దీంతో ఇంటర్వెల్ బ్లాక్ చాలా ఉత్కంఠను రేపుతోంది. సినిమా ఆసక్తికరంగా సాగుతోన్న సమయంలో బ్రేక్ పడింది. ఇప్పుడు ఇంటర్వెల్.
Date & Time : 04:37 AM March 30, 2018
-
చిత్రం నెమ్మదిగా సీరియస్ మూడ్ లోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం చరణ్ - సమంతల మధ్య భావోద్వేగ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:29 AM March 30, 2018
-
ఇప్పుడు చరణ్ మరియు జగపతి బాబు అసిస్టెంట్ల మధ్య భారీ ఫైట్ సీక్వెన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:22 AM March 30, 2018
-
గ్రామీణ సమస్యలపై ఆది స్పందిస్తున్నాడు. దీంతో గ్రామ ప్రజల దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. అయితే ఆ కారణంగా ఆది - జగపతిబాబుల మధ్య వివాదం ఏర్పడుతుంది.
Date & Time : 04:17 AM March 30, 2018
-
ఇప్పుడు బ్లక్ బస్టర్ సాంగ్ రంగమ్మ మంగమ్మ స్టార్ట్ అయ్యింది ... ముందుగా చెప్పినట్లుగానే చిత్ర యూనిట్ వారు వివాదాస్పద గొల్లభామా అనే పదం తీసేసి మరో పదాన్ని యాడ్ చేశారు.
Date & Time : 04:10 AM March 30, 2018
-
చరణ్ మరియు అనసుయల మధ్య ఒక చిన్న భావోద్వేగ సన్నివేశం వస్తోంది ... రంగమ్మగా అనసుయ యొక్క నటన ఆకట్టుకుంటుంది.
Date & Time : 04:05 AM March 30, 2018
-
ప్రధాన జంట మధ్య మరికొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 03:55 AM March 30, 2018
-
చరణ్ మరియు సమంత, అనసుయల మధ్య కొన్ని కొన్ని సరదా సన్నివేశాలు అలరిస్తున్నాయి.
Date & Time : 03:48 AM March 30, 2018
-
ఇక సమంత రామ లక్ష్మీ గా ఇప్పుడే పరిచయం అయ్యింది. చిట్టిబాబు మొదటి చూపులోనే రామలక్ష్మికి పడిపోయాడు. ప్రస్తుతం ఎంత సక్కగున్నవే పాట వస్తోంది.
Date & Time : 03:41 AM March 30, 2018
-
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఒక ప్రభుత్వ అధికారిగా సిన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ... కొన్ని సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:39 AM March 30, 2018
-
సాంగ్ ని అందంగా చూపించారు ... ఇప్పుడు నటుడు ఆది చిట్టి బాబు యొక్క అన్నయ్యగా వచ్చాడు... నరేష్ మరియు రోహిణి కూడా వారి తల్లిదండ్రులుగా సన్నివేశంలో చేరారు.
Date & Time : 03:34 AM March 30, 2018
-
సినిమాలోని మొదటి పాట, అసలైన పాట రంగ రంగ రంగస్థలనా.. వస్తోంది. జానపథం స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Date & Time : 03:30 AM March 30, 2018
-
క్రూరమైన గ్రామ అధ్యక్షుడు జగపతి బాబు కూడా పరిచయం చేయబడ్డాడు... కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి.
Date & Time : 03:25 AM March 30, 2018
-
గ్రామంలోని అన్ని పాత్రలు ఫన్నీగా పరిచయం చేయబడుతున్నాయి. ఎంతగానో ఎదురుచూస్తున్న అనసూయ పాత్ర రంగత్తమ్మ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 03:20 AM March 30, 2018
-
ప్రకాష్ రాజ్ యొక్క కొన్ని పరిచయ సన్నివేశాల తరువాత, ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ మూడ్ కి వెళ్ళింది ... ట్రైలర్లో ప్రదర్శించిన కొన్ని వ్యవసాయ దృశ్యాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 03:16 AM March 30, 2018
-
ఈ చిత్రం కథ రంగస్థలం అనే గ్రామంలో స్టార్ట్ అయ్యింది, 1980 నాటి కాలంలో నిర్మించబడింది. మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిట్టి బాబుగా సైకిల్ నడుపుతూ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 03:12 AM March 30, 2018
-
నటి శ్రీదేవికి నివాళి అర్పిస్తూ సినిమా మొదలైంది.
Date & Time : 03:10 AM March 30, 2018
-
హాయ్..179 నిమిషాల నిడివిగల రంగస్థలం సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 03:08 AM March 30, 2018