-
ఇప్పుడు క్లైమాక్స్.. ఓ ఫన్ సీన్ తో మొత్తం ఫ్రస్ట్రేషన్ కు ముగింపు పలికింది దీనితో కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:00 AM March 26, 2021
-
వారి రొమాన్స్ లో డ్రామా క్లియర్ అయ్యిపోయింది. ఇప్పుడు మెయిన్ లీడ్ మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 10:50 AM March 26, 2021
-
వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగుంది. ఇప్పుడు సిద్ శ్రీరామ్ పాడిన మరో హిట్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 10:45 AM March 26, 2021
-
సినిమాలో ఎమోషన్స్ చాలా బాగున్నాయి. అలాగే ప్రెగ్నన్సీ యాంగిల్ చాలా మార్పులను తీసుకొచ్చింది.
Date & Time : 10:40 AM March 26, 2021
-
ఇప్పుడు కథనంలో ఓ ఎమోషనల్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దీనితో సినిమా కాస్త సీరియస్ గా మారింది. కీర్తి మాత్రం మంచి నటనను కనబరుస్తుంది.
Date & Time : 10:30 AM March 26, 2021
-
మెయిన్ లీడ్ మధ్య ఇప్పుడిప్పుడే కెమిస్ట్రీ పెరుగుతుంది.. ఇప్పుడు కమెడియన్ వెన్నెల కిషోర్ పరిచయం అయ్యాడు. అతను కూడా అక్కడ స్టూడెంట్ నే...
Date & Time : 10:20 AM March 26, 2021
-
ఇప్పుడు హిట్ ట్రాక్ బస్టాండ్ సాంగ్ స్టార్ట్ అయ్యింది. మంచి డాన్స్ మూమెంట్స్ కనిపిస్తున్నాయి.
Date & Time : 10:10 AM March 26, 2021
-
ఇద్దరు భార్యాభర్తలు ఇప్పుడు దుబాయ్ లోని ఓ కాలేజ్ లో జాయిన్ అయ్యారు. ఇపుడు కొన్ని ఆ సంబంధిత కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:05 AM March 26, 2021
-
ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తల మధ్య అసలు గేమ్ స్టార్ట్ అయ్యింది. కీర్తీ నితిన్ ని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టింది.
Date & Time : 10:00 AM March 26, 2021
-
ఇంటర్వెల్ అనంతరం..ట్విస్ట్ రివీల్ అయ్యింది. నితిన్, కీర్తిలకు పెళ్లి అయ్యిపోయింది.
Date & Time : 09:55 AM March 26, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అంతా బానే ఉందని చెప్పాలి. సింపుల్ స్టోరీ అయినా లవ్ యాంగిల్ మరియు కామెడీ నీట్ గా ఉన్నాయి. దీనికి స్క్రీన్ ప్లే ప్రధాన కారణం. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగున్నాయి. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 09:45 AM March 26, 2021
-
ఇప్పుడు ఇంటర్వెల్ సీన్.. పెళ్లి సెటప్ లో కీర్తీ తన ప్రవర్తనతో ప్రతీ ఒక్కరినీ షాక్ చేసింది. ఇప్పుడు విరామం.
Date & Time : 09:40 AM March 26, 2021
-
ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం కథలో పెద్ద మార్పునే తీసుకొచ్చింది. దీనితో కీర్తి పెళ్ళికి ఒప్పుకోవడంతో సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 09:35 AM March 26, 2021
-
వీరి లవ్ స్టోరీ లో చీలిక అనేది ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. అలాగే స్క్రీన్ ప్లే మంచి డ్రామా చూపిస్తుంది. అలాగే ప్రధాన పాత్రధారుల మధ్య కామెడీ కెమిస్ట్రీ కూడా బాగుంది.
Date & Time : 09:30 AM March 26, 2021
-
ఇప్పుడు కీర్తీపై ఓ ఫన్ సన్నివేశం కాస్తా సీరియస్ గా మారింది. ఆ సంబంధిత ఎమోషనల్ సన్నివేశం వస్తుంది.
Date & Time : 09:25 AM March 26, 2021
-
ఇప్పుడు ఓ రొమాంటిక్ సాంగ్ స్టార్ట్
అయ్యింది. ఇందులో కీర్తి చాలా అందంగా
కనిపిస్తుంది. విజువల్స్ కూడా బాగున్నాయి.
Date & Time : 09:20 AM March 26, 2021
-
కీర్తికి నితిన్ అంటే ఇష్టమే కానీ నితిన్
కు ఎలాంటి ఇష్టం లేదు. ఈ యాంగిల్ లో కామెడీ
బాగుంది. ఈ వన్ సైడ్ ప్రేమ కథ కూడా బాగుంది.
Date & Time : 09:15 AM March 26, 2021
-
నితిన్, కీర్తి ఇద్దరూ చిన్నప్పటి నుంచీ
స్నేహితులే కానీ నితిన్ ని ఎప్పుడూ కీర్తిని
హేట్ చేస్తూ ఉంటాడు.
Date & Time : 09:05 AM March 26, 2021
-
ఇప్పుడు కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
బ్రహ్మాజీ మరియు నరేష్ లు ఇప్పుడు స్క్రీన్
పై యాడ్ అయ్యారు.
Date & Time : 09:00 AM March 26, 2021
-
ఇప్పుడు నితిన్ మరియు కీర్తీలు ఒకరికొకరు
పొరుగింటి వారిలా కనిపిస్తున్నారు.
ఒకరికి ఒకరు అంటే అసలు పడదు. ఇప్పుడు
ఫస్ట్ సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 08:55 AM March 26, 2021
-
ఇప్పుడు నితిన్ తన చిన్ననాటి కథను చెప్తున్నాడు.
అలాగే అను గా కీర్తి సురేష్ పరిచయం అయ్యింది.
Date & Time : 08:50 AM March 26, 2021
-
హాయ్..135 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే
మొదలయ్యింది.
Date & Time : 08:45 AM March 26, 2021